ఒక్క షాక్‌తో ఆ మాజీ మంత్రి సైలెంట్.. ఫ్యూచ‌రేంటి ?

ఆయ‌న మాజీ మంత్రి, ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. అయిన‌ప్పటికీ.. ఇప్పుడు ఎక్కడా ఆయ‌న బ‌య‌ట‌కు రావ‌డం లేదు. దీనికి కార‌ణం ఏంటి? ఎంతో అనుభ‌వం ఉన్న ఆయ‌న [more]

;

Update: 2021-05-07 05:00 GMT

ఆయ‌న మాజీ మంత్రి, ప్రస్తుతం టీడీపీలో ఉన్నారు. అయిన‌ప్పటికీ.. ఇప్పుడు ఎక్కడా ఆయ‌న బ‌య‌ట‌కు రావ‌డం లేదు. దీనికి కార‌ణం ఏంటి? ఎంతో అనుభ‌వం ఉన్న ఆయ‌న ఎందుకు సైలెంట్ అయ్యారు ? ఇటీవ‌ల జ‌రిగిన స్థానిక‌, మునిసిప‌ల్ ఎన్నిక‌ల్లోనూ ఆయ‌న ఇంటి నుంచి బ‌య‌ట‌కు రాలేద‌ని.. టీడీపీలో చ‌ర్చ సాగుతోంది. దీంతో ఆయ‌న పార్టీలో సైలెంట్ అయ్యారా ? ఏకంగా రాజ‌కీయాల్లోనే సైలెంట్ అయ్యారా ? అనే చ‌ర్చ సాగుతుండ‌డం గ‌మ‌నార్హం. విష‌యంలోకి వెళ్తే.. కాంగ్రెస్‌లో సీనియ‌ర్ నాయ‌కుడిగా ఉండి.. రాష్ట్ర విభ‌‌జ‌న త‌ర్వాత .. టీడీపీలోకి వ‌చ్చిన మాజీ మంత్రి పితాని స‌త్యనారాయ‌ణ‌.

వరుస విజయాలతో…?

ప‌శ్చిమ గోదావ‌రి జిల్లా ఆచంట నియోజ‌క‌వ‌ర్గం నుంచి హ్యాట్రిక్ విజ‌యాలు ద‌క్కించుకున్న పితాని స‌త్యనారాయ‌ణ‌ గ‌త 2014లో టీడీపీ టికెట్‌పై విజ‌యం సాధించారు. ఈ క్రమంలోనే ఆయ‌న‌కు చంద్రబాబు మంత్రి ప‌ద‌వి ఇచ్చారు. అయితే.. గ‌త ఎన్నిక‌ల స‌మ‌యంలో వైసీపీ నుంచి ఆఫ‌ర్ వ‌చ్చింద‌నే ప్రచారం జ‌రిగింది. అయిన‌ప్పటికీ.. ఆయ‌న సైలెంట్ అయ్యారు. అదే స‌మ‌యంలో జ‌న‌సేనాని ప‌వ‌న్ పై విమ‌ర్శలు చేయ‌డం ద్వారా.. వివాదాస్పదం కూడా అయ్యారు. స‌రే.. గ‌త ఎన్నిక‌ల్లో టీడీపీ నుంచి పోటీ చేసినా.. వైసీపీ అభ్య‌ర్థి, ప్రస్తుత మంత్రి రంగ‌నాథ‌రాజుపై ఓట‌మిపాల‌య్యారు. ఇక‌, అప్పటి నుంచి దూకుడు రాజ‌కీయం మానేశారు.

వైసీపీలో చేరనని చెప్పినా?

టీడీపీలో నే ఉన్నప్పటికీ పితాని స‌త్యనారాయ‌ణ‌ సైలెంట్ గా ఉంటున్నారు. దీనికి ప్రధాన కార‌ణం.. ఈఎస్ఐ మందుల కుంభ‌కోణంలో మంత్రి పితాని కుమారుడి పేరు బ‌య‌ట‌కు రావ‌డ‌మే. అయితే.. నిజానికి రాజ‌కీయాల్లో ఉన్నవారికి ఇలాంటి వివాదాలు, వ్యాఖ్యలు.. స‌ర్వసాధార‌ణం. వీటికి ప్రతి విమ‌ర్శలు చేయ‌డ‌మో.. లేక‌.. కాద‌ని త‌ప్పించుకోవ‌డ‌మో.. నాయ‌కులు చేస్తుంటారు. అయితే.. పితాని విష‌యంలో మాత్రం రెండూ చేయ‌లేదు. ఆయ‌నే పూర్తిగా సైలెంట్ అయ్యారు. దీనికి రీజ‌న్ ఏంట‌నేది ఇప్పటికీ ఎవ‌రికీ అంతుప‌ట్టడం లేదు. వైసీపీలోకి వెళ్లే ఉద్దేశం త‌న‌కు లేద‌ని ఇటీవ‌ల కూడా ఆయ‌న చెప్పారు.

లాలూచీ పడ్డారా?

అలాంట‌ప్పుడు పితాని స‌త్యనారాయ‌ణ‌ ఎందుకు మౌనంగా ఉంటున్నారు? అనేది ప్రశ్న. అయితే.. కేసు నేప‌థ్యంలో అధికార పార్టీతో లాలూచీ ప‌డ్డార‌నే వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. ఈ క్రమంలోనే ఆయ‌న మౌనంగా ఉంటున్నార‌ని అంటున్నారు. చంద్రబాబు పార్టీ ప‌ద‌వుల విష‌యంలో రెండు కీల‌క ప‌ద‌వులు క‌ట్టబెట్టినా పితాని స‌త్యనారాయ‌ణ‌ ఆ దిశ‌గా ప‌ని చేయ‌డం లేదు. ఇటు నియోజ‌క‌వ‌ర్గంలోనూ ఫుల్ సైలెంట్ అయిపోయారు. ఇక మ‌రో ఇద్దరు బీసీ మాజీ మంత్రులు అచ్చెన్నాయుడు, కొల్లు ర‌వీంద్రపై కేసులు వ‌చ్చిన‌ప్పుడు చంద్రబాబు, పార్టీ నేత‌లు రాష్ట్ర వ్యాప్తంగా చేసిన హ‌డావిడి పితాని స‌త్యనారాయ‌ణ‌ విష‌యంలో చేయ‌లేద‌ని.. తన‌ను ప‌ట్టించుకోలేద‌న్న ఆవేద‌న కూడా ఆయ‌న‌కు ఉంద‌ట‌. ఇవ‌న్నీ ఆయ‌న్ను సైలెంట్ చేశాయంటున్నారు. మ‌రి ఆయ‌న ఎప్పట‌కి యాక్టివ్ అవుతారు ? ఆయ‌న పొలిటిక‌ల్ జ‌ర్నీలో కొత్త మార్పులు ఉంటాయా ? అన్నది చూడాలి.

Tags:    

Similar News