ఆయన టీడీపీ టు వైసీపీ, ఈయన వైసీపీ టు టీడీపీ ప్లేస్ ఛేంజ్
నెల్లూరు జిల్లాలోని కీలక నియోజకవర్గం కావలి. అయితే.. ఇప్పుడు నేతల పరిస్థితి భిన్నంగా తయారైంది. ఇక్కడ వైసీపీ నేత.. మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డి ఒక రకంగా [more]
;
నెల్లూరు జిల్లాలోని కీలక నియోజకవర్గం కావలి. అయితే.. ఇప్పుడు నేతల పరిస్థితి భిన్నంగా తయారైంది. ఇక్కడ వైసీపీ నేత.. మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డి ఒక రకంగా [more]
నెల్లూరు జిల్లాలోని కీలక నియోజకవర్గం కావలి. అయితే.. ఇప్పుడు నేతల పరిస్థితి భిన్నంగా తయారైంది. ఇక్కడ వైసీపీ నేత.. మాజీ ఎమ్మెల్యే ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డి ఒక రకంగా ఆలోచిస్తుంటే.. ఇక, ఇక్కడే టీడీపీకి ఇంచార్జ్‌గా ఉన్న విష్ణువర్థన్‌రెడ్డి మరో రకంగా ఆలోచన చేస్తున్నారు. దీంతో కావలి రాజకీయం అత్యంత ఆసక్తిగా మారింది. ఇక, మరో మాజీ ఎమ్మెల్యే బీద మస్తాన్ రావు పరిస్థితి దీనికి భిన్నంగా ఉందనే వాదన వినిపిస్తోంది. అయితే.. అందరూ కూడా వలస నాయకులే కావడం గమనార్హం. ఎవరికి వారు తమతమ భవిష్యత్తు కోసం త్వరలోనే కీలక నిర్ణయం తీసుకుంటారని అంటున్నారు.
కాటంరెడ్డి విష్ణువర్ధన్‌రెడ్డి: ఈయన వైఎస్‌కు ఎంతో విధేయుడిగా గుర్తింపు పొందారు. రెండు సార్లు ఎమ్మెల్యేగా పనిచేశారు. అయితే.. అనంతర కాలంలో ఆయన వైసీపీలోకి చేరారు. అయితే.. ఆయన రెండు సార్లు.. ఎమ్మెల్యే టికెట్ ఆశించినా.. వైసీపీ అధినేత నుంచి సరైన గుర్తింపురాలేదు. పోనీ.. ఎమ్మెల్సీ అయినా వస్తుందని అనుకున్నా.. అది కూడా రాలేదు. దీంతో గత ఎన్నికలకు ముందు టీడీపీలోకి వచ్చారు. ఈ క్రమంలోనే గత ఎన్నికల్లో పోటీ చేసి.. ఓడిపోయారు. ప్రస్తుతం టీడీపీలోనే ఉన్నారు. అయితే.. ఆయనకు పార్టీ నాయకుడు, కీలక నేత.. బీద రవిచంద్రయాదవ్‌కు మధ్య పడడం లేదు. దీంతో ఆయన పార్టీ మారిపోవాలని అనుకుంటున్నారు. ఈ క్రమంలో ఆయన మళ్లీ వైసీపీ వైపు చూస్తున్నారని అంటున్నారు పరిశీలకులు.
ఒంటేరు వేణుగోపాల్‌రెడ్డి: ఈయన గతంలో టీడీపీ తరఫున 1999లో విజయం సాధించారు. ఆ తర్వాత ఉప ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా పోటీ చేసి ఓడిపోయారు. 2014 ఎన్నికలకు ముందే టీడీపీలో పొసగక ..వైసీపీలోకి వచ్చారు. అయితే.. ఇటీవల కాలంలో ఆయనకు వైసీపీ నేతలకు మధ్య విభేదాలు కొనసాగుతున్నాయి. కనీసం ప్రెస్‌మీట్ పెట్టేందుకు కూడా నాయకులు అనుమతించడం లేదని ఒంటేరు ఆవేదనతో ఉన్నారు. ఇక, అధిస్టానం కూడా ఆయనను గుర్తించడం లేదని ఒంటేరు వర్గం చెబుతోంది. చివరకు ఎమ్మెల్సీ ఇస్తామని చెప్పినా పట్టించుకోవడం లేదు. ఈ నేపథ్యంలో కూడా పార్టీ మారేందుకు రెడీ అవుతున్నారు. గతంలో టీడీపీతో ఉన్న అనుబంధం కారణంగా.. ఇప్పుడు ఆ పార్టీ నేతల నుంచి ఆయనకు ఆహ్వానాలు అందుతున్నాయని తెలుస్తోంది. త్వరలోనే దీనిపై ఆయన నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని అంటున్నారు.
బీద మస్తాన్ రావు: ఈయన కూడా 2009లో కావలి నుంచి టీడీపీ తరఫున విజయం సాధించారు. 2014 ఎన్నికల్లో ఎమ్మెల్యేగా… గత ఎన్నికల్లో నెల్లూరు ఎంపీగా కూడా టీడీపీ టికెట్‌పై పోటీ చేశారు.. అయితే జగన్ సునామీలో ఆయన ఓటమిపాలయ్యారు. అయితే.. ఆయనకు వైసీపీ కీలక నేత సాయిరెడ్డితో ఉన్న పరిచయాల కారణంగా.. ఆయన వైసీపీలో చేరిపోయారు. అప్పట్లో ఆయనకు రాజ్యసభ సీటు వస్తుందని ప్రచారం జరిగింది. అయితే.. ఇప్పటి వరకు అలాంటి దేమీ లభించలేదు. ఈ నేపథ్యంలో ఆయన కూడా డైలమాలో ఉన్నారు. అయితే.. పార్టీ మారతారా? లేదా? అనేది తేలాల్సి ఉందని అంటున్నారు పరిశీలకులు.