నా కెందుకీ మంత్రి పదవి?
పువ్వాడ అజయ్ కుమార్….. ఈయన తెలంగాణ రవాణా శాఖ మంత్రి. ఆయన మంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పువ్వాడకు సమస్యల స్వాగతాలే. ఆయన పదవి చేపట్టాడో లేదో [more]
;
పువ్వాడ అజయ్ కుమార్….. ఈయన తెలంగాణ రవాణా శాఖ మంత్రి. ఆయన మంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పువ్వాడకు సమస్యల స్వాగతాలే. ఆయన పదవి చేపట్టాడో లేదో [more]
పువ్వాడ అజయ్ కుమార్….. ఈయన తెలంగాణ రవాణా శాఖ మంత్రి. ఆయన మంత్రి బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి పువ్వాడకు సమస్యల స్వాగతాలే. ఆయన పదవి చేపట్టాడో లేదో ఆ సంతోషం ఎంత సేపు నిలవలేదు. ఆర్టీసీ కార్మికులు సమ్మె చేపట్టారు. ఇటు కార్మికులు, అటు ముఖ్యమంత్రి మధ్య పువ్వాడ నలిగిపోతున్నారు.
రాజకీయంలో…..
పువ్వాడ అజయ్ కుమార్ 2012 లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ద్వారా రాజకీయాల్లోకి వచ్చారు. 2013 లో కాంగ్రెస్ పార్టీలో చేరి, 2014లో ఖమ్మం నియోజకవర్గం నుంచి తొలిసారిగా ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2016లో తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీలో చేరారు. 2018లో టీఆర్ఎస్ నుంచి పోటీ చేసి రెండోసారి ఖమ్మం ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 2019 సెప్టెంబర్ 8న ముఖ్యమంత్రి కెసీఆర్ రెండోసారి చేపట్టిన మంత్రివర్గంలో మంత్రిగా ప్రమాణస్వీకారం చేశారు పువ్వాడ అజయ్ కుమార్.
అన్నింట్లో మౌనమే…..
ఖమ్మం నియోజకవర్గం శాసనసభ నుంచి గెలిచిన పువ్వాడ అజయ్ కుమార్ కు కమ్మసామాజిక వర్గం కోటాలో మంత్రి పదవి లభించింది. ఈ సామాజిక వర్గానికి చెందిన తుమ్మల నాగేశ్వరరావు ఎన్నికల్లో గెలవకపోవడంతో పువ్వాడ అజయ్ కు ఈ అవకాశం దక్కింది. పదవి చేపట్టినప్పటి నుంచి పువ్వాడ అజయ్ కు ఏ అధికారం లేకుండా పోయింది. ఆర్టీసీ కార్మికులు సమ్మెకు పిలుపు నిచ్చిన నేపథ్యంలో ప్రభుత్వం రెండు సార్లు చర్చలు చేపట్టింది. ఆ సమయంలోనూ మంత్రి పువ్వాడ అజయ్ లేరు. ఆ తర్వాత ముఖ్యమంత్రి ఆర్టీసీ అధికారులతో చర్చలు జరిపారు. అప్పుడు కూడా మంత్రి అజయ్ కుమార్ అక్కడ లేరు.
కేసీఆర్ దే హవా…
పేరుకు అజయ్ మంత్రే అయినా అన్నీ పనులు చక్కదిద్దేది మాత్రం ముఖ్యమంత్రి కేసీఆరే. రెండు వారాలుగా రాష్ట్రంలో బస్సులు నడవక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. ప్రతిపక్షాలు విమర్శిస్తున్నాయి. ఇంత గోల జరుగుతున్నా మంత్రి అజయ్ కు మాత్రం ఏం పట్టనట్లే ఉన్నారు. అన్నీ కేసీఆరే మాట్లాడుతుండడంతో మంత్రి కేవలం ఉత్సవ విగ్రహంలానే మారారు. కేవలం బస్సులు నడుస్తున్నాయా లేదానని మాత్రమే మంత్రి పువ్వాడ అజయ్ అధికారులతో టెలికాన్ఫరెన్స్ లు నిర్వహిస్తున్నారు. దీంతో ఎందుకీ మంత్రి పదవి అంటూ పువ్వాడ అజయ్ లోలోన బాధపడుతున్నారు.