R. krsihaniah : మళ్లీ పని దొరికిందా?

తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక మంది నేతలు రాజకీయంగా ప్రయోజనం పొందారు. కొందరు నష్టపోగా రాష్ట్ర విభజనతో ఊహించిన స్థాయికి ఎదిగారు. అయితే కొందరు ప్రజాసంఘాల [more]

Update: 2021-10-07 11:00 GMT

తెలంగాణ రాష్ట్రం విడిపోయిన తర్వాత అనేక మంది నేతలు రాజకీయంగా ప్రయోజనం పొందారు. కొందరు నష్టపోగా రాష్ట్ర విభజనతో ఊహించిన స్థాయికి ఎదిగారు. అయితే కొందరు ప్రజాసంఘాల నేతలు మాత్రం రాష్ట్ర విభజనతో మొత్తం తమ ఉనికినే కోల్పోయే ప్రమాదం ఏర్పడింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో వారు ఒక వెలుగు వెలిగారు. విభజన తర్వాత మాత్రం వారు తమ సంస్థలను కాపాడుకునేందుకే ఎక్కువ సమయం కేటాయించాల్సి వస్తుంది. వారే బీసీ సంఘాల నాయకుడు ఆర్. కృష్ణయ్య,

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో….

ఆర్ కృష్ణయ్య బీసీ సంఘాల నేతగా రెండు రాష్ట్రాల్లో రాజకీయ పార్టీలకు కంటి మీద కునుకులేకుండా ఒకప్పుడు చేశారు. 1994లో ఆర్ కృష్ణయ్య బీసీ సంక్షేమ సంఘాన్ని ఏర్పాటు చేశారు. బీసీల సంక్షేమం కోసం, వారి అభివృద్ధి కోసం ఎన్నో కార్యక్రమాలు చేపట్టారు. రాజకీయ పార్టీల్లోనూ పలుకుబడిని పెంచుకున్నారు. రాష్ట్ర విభజన తర్వాత తొలిసారి జరిగిన ఎన్నికల్లో ఆయన ఎల్.బి.నగర్ నుంచి తెలుగుదేశం పార్టీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. 2018 ఎన్నికల్లో టీడీపీని వీడి కాంగ్రెస్ లో చేరి మిర్యాలగూడ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు.

రాజకీయ ముద్ర….

అయితే టీడీపీలో చేరడంతో అప్పటి వరకూ బీసీ నేతగా ఉన్న ఆర్ .కృష్ణయ్యపైన రాజకీయ ముద్ర పడింది. అక్కడి నుంచి కాాంగ్రెస్ లో చేరి పోటీ చేసి ఓటమి పాలయిన తర్వాత పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉంటున్నారు. అయినా ఆయనపై రాజకీయ ముద్ర తొలగిపోలేదు. అప్పటి వరకూ ఉన్న ఇమేజ్ కూడా మసకబారింది. నాలుగేళ్లకే తిరిగి ఎన్నికలు రావడం ఆయన మాజీ కావడం జరిగిపోయాయి. ఇప్పుడు అడపాదడపా కార్యక్రమాలు చేస్తున్నా ప్రభుత్వం బీసీలకు ఇస్తున్న ప్రాధాన్యతతో ఆయనకు పెద్దగా పనిలేకుండా పోయింది. తాజాగా దళిత బంధును ప్రభుత్వం తీసుకురావడంతో ఇక పోరాట కార్యక్రమాలకు ఆయన శ్రీకారం చుట్ట నున్నారు.

మరోసారి ఉద్యమానికి….

ీబీసీలకు కూడా దళిత బంధును అమలు చేయాలని ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేస్తున్నారు. ప్రతి బీసీ కుటుంబానికి పది లక్షల రూపాయల ఆర్థిక సాయాన్ని చేయాలని కోరుతున్నారు. త్వరలో ప్రకటన రాకుంటే ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని హెచ్చరిస్తున్నారు. గత రెండేళ్లుగా పనిలేకుండా పోయిన ఆర్. కృష్ణయ్యకు ఇప్పుడు పని దొరికింది. కానీ గతంలో మాదిరి ఆయనకు ప్రజల్లో ఆదరణ లభించే అవకాశాలు తక్కువేనంటున్నారు. మొత్తం మీద రాష్ట్ర విభజన తర్వాత నష్టపోయిన వారిలో ఆర్. కృష్ణయ్య మొదటి వరసలో ఉన్నారన్న కామెంట్స్ వినపడుతున్నాయి.

Tags:    

Similar News