ఈ ఎమ్మెల్యేకు సొంత పార్టీ నుంచి షాక్ తప్పదా?
ఏపీ సీఎం జగన్ తన సొంత జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు క్రమక్రమంగా ఎర్త్ పెట్టేస్తూ వస్తున్నారా ? పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే లెక్కలేని తనంగా [more]
ఏపీ సీఎం జగన్ తన సొంత జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు క్రమక్రమంగా ఎర్త్ పెట్టేస్తూ వస్తున్నారా ? పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే లెక్కలేని తనంగా [more]
ఏపీ సీఎం జగన్ తన సొంత జిల్లాకు చెందిన ఓ ఎమ్మెల్యేకు క్రమక్రమంగా ఎర్త్ పెట్టేస్తూ వస్తున్నారా ? పార్టీ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలోనే లెక్కలేని తనంగా వ్యవహరిస్తోన్న సదరు ఎమ్మెల్యేకు వచ్చే ఎన్నికల్లో టిక్కెట్ కూడా ఇచ్చే ఛాన్సులు లేవా ? అంటే కడప జిల్లా వైసీపీలో ఇప్పుడు అవును అన్న మాటే వినిపిస్తోంది. సదరు ఎమ్మెల్యే ఎవరో కాదు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డి. పార్టీ ఓడిన 2014 ఎన్నికల్లో గెలిచిన ఆయన గత ఎన్నికల్లోనూ మరోసారి విజయం సాధించారు. గత ఎన్నికల్లో గెలిచాక శివప్రసాద్ రెడ్డి దూకుడు వైఖరి కారణంగా ప్రొద్దుటూరు నియోజకవర్గంలో ఆయనకు మైనస్ మార్కులు పడడంతో పాటు పార్టీ ప్రతిష్ట సైతం మసకబారుతూ వస్తోంది.
ఆయన రూపంలో….
కొద్ది నెలల క్రితం టీడీపీకి చెందిన ఓ బీసీ నేత హత్య విషయంలో ఎమ్మెల్యే ప్రమేయంపై తీవ్రమైన విమర్శలు రావడంతో చివరకు ఈ విషయాన్ని టీడీపీ రాష్ట్ర స్థాయిలో హైలెట్ చేయడంతో జిల్లాలో వైసీపీ నేతలు బీసీలను దారుణంగా అణగదొక్కడంతో పాటు చివరకు చంపేయిస్తున్నారన్న విమర్శలు తీవ్రంగా వచ్చాయి. అనంతరం నామినేటెడ్ పదవుల విషయంలో రాచమల్లు శివప్రసాద్ రెడ్డి సిఫార్సులను జగన్ పూర్తిగా పక్కన పెట్టేశారు. 2014 ఎన్నికల్లో నియోజకవర్గంలో వైసీపీ నుంచి గెలిచిన నేతలకు, ఎమ్మెల్యేకు అప్పుడే పడేది కాదు… ఇక ఇప్పుడు అదే పరిస్థితి ఉంటుందనే జగన్ ఆయన చెప్పిన వారికి పదవులు ఇవ్వలేదు.
బిగ్ షాక్ తప్పదా?
అన్నింటికి మించి ఆయనకు ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ రూపంలో బిగ్ షాక్ తగిలింది. అదే నియోజకవర్గానికి చెందిన బీసీ నేత రమేష్ యాదవ్‌ను జగన్ ఎమ్మెల్సీని చేశారు. అప్పుడు రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి కనీసం ఒక్క మాట కూడా చెప్పలేదట. అప్పటి నుంచి రమేష్ యాదవ్‌ను నియోజకవర్గంలో అణగదొక్కేందుకు రాచమల్లు చేస్తోన్న ప్రయత్నాలు కూడా అధిష్టానం దృష్టికి వెళ్లడం పై నుంచి వార్నింగులు రావడం జరుగుతున్నాయట. జిల్లాలో ఒక్క ఎమ్మెల్యే సీటు కూడా బీసీలకు ఇవ్వలేదు. ఈ క్రమంలోనే ప్రొద్దుటూరులో బీసీ కోటాలో కూడా రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి జగన్ చెక్ పెట్టేస్తారనే అంటున్నారు.
చెప్పకుండానే బదిలీలు…
ఇక తాజాగా ఆయనకు చెప్పకుండానే ఆయన నియోజకవర్గంలో అధికారుల బదిలీలు జరిగిపోతున్నాయి. కొద్ది రోజుల క్రితం ఓ పోలీస్ అధికారిని ఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పట్టుబట్టి బదిలీ చేయించారు. ఇదంతా రాచమల్లు శివప్రసాద్ రెడ్డికి తెలియదు. ఉన్నత నేతల అండతోనే రమేష్ యాదవ్ ఆ అధికారిని బదిలీ చేయించారు. ఇక ఇప్పుడు ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రాధను సైతం ఎమ్మెల్యేకు తెలియకుండానే బదిలీ చేసి పడేశారు.
కట్టడి చేయడానికేనా?
ఎమ్మెల్యే అండతో ఆమె చాలా ఇష్టారాజ్యంగా వ్యవహరించారన్న అపవాదు ఉంది. చివరకు ఆమె తీరుపై వైసీపీ కౌన్సెలర్లు సైతం రగిలిపోయారు. ఆమె పార్టీ కార్యకర్తగా వ్యవహరించారన్న విమర్శలు ఎదుర్కొన్నారు. అయితే ఆమె బదిలీ కూడా ఎమ్మెల్యేకు తెలియకుండానే జరిగిపోయిందంటు న్నారు. ఏదేమైనా ప్రతి విషయంలోనూ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్ రెడ్డిని కట్టడి చేసే ప్రక్రియ అయితే సొంత పార్టీలోనే జరుగుతోందన్నది వాస్తవం..?