Raghu : మరోసారి పై చేయి సాధించినట్లేగా?
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు జగన్ పార్టీపై పై చేయి సాధించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలకు ఫిర్యాదు చేసి వైసీపీ అనుకూల అధికారిని [more]
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు జగన్ పార్టీపై పై చేయి సాధించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలకు ఫిర్యాదు చేసి వైసీపీ అనుకూల అధికారిని [more]
వైసీపీ రెబల్ ఎంపీ రఘురామ కృష్ణరాజు జగన్ పార్టీపై పై చేయి సాధించారు. కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నేతలకు ఫిర్యాదు చేసి వైసీపీ అనుకూల అధికారిని బదిలీ చేయించడంలో సక్సెస్ అయ్యారు. రఘురామ కృష్ణరాజు వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా న్యాయపోరాటం తో పాటు ఇటు కేంద్రంలో ఫిర్యాదులు చేస్తూ చికాకు పెట్టిస్తున్నారు. తాజాగా ఏపీ హోంమంత్రి మేకతోటి సుచరిత భర్త బదిలీ విషయంలో రఘురామ కృష్ణరాజు అప్పర్ హ్యాండ్ సాధించారు.
ప్రభుత్వానికి వ్యతిరేకంగా…..
రఘురామ కృష్ణరాజు గత కొద్ది కాలంగా వైసీపీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా కామెంట్స్ చేస్తున్నారు. జగన్ మూడు రాజధానులను ప్రకటిస్తే, దానికి విరుద్ధంగా అమరావతి రైతుల పాదయాత్రకు విరాళమివ్వడమే కాకుండా అందరూ పాల్గొని వారికి మద్దతివ్వాలని ప్రకటించారు. ఇక హోంమంత్రి మేకతోటి సుచరిత భర్త దయాసాగర్ ఆదాయపు పన్ను శాఖలో ఉన్నతాధికారిగా పనిచేస్తున్నారు. ఆయన మహారాష్ట్ర, తెలంగాణలో పనిచేశారు.
విజయవాడ నుంచి….
కానీ తాజాగా మేకతోటి సుచరిత భర్త దయాసాగర్ ను విజయవాడ ఆదాయపు పన్ను శాఖ అధికారిగా బదిలీ చేశారు. పది రోజుల క్రితం బదిలీ ఉత్తర్వులు రావడంతో ఆయన విజయవాడ వచ్చి జాయిన్ అయ్యారు. అయితే హోమంత్రి సుచరిత భర్త కావడంతో విపక్షాలను ఆదాయపు పన్ను శాఖ అధికారిగా టార్గెట్ చేసే అవకాశముందని కేంద్ర ప్రభుత్వానికి ఫిర్యాదులు అందాయి. ప్రధానంగా రఘురామ కృష్ణరాజు హోంమంత్రి అమిత్ షాకు ఈ అంశంపై ఫిర్యాదు చేశారు. దయాసాగర్ కు వైసీపీ నేతలు స్వాగతం పలుకుతున్న ఫొటోలు, వీడియోలను కూడా జతపర్చారు.
షా జోక్యంతో…
రఘురామ కృష్ణరాజుతో పాటు ఏపీకి చెందిన ఒక రాజ్యసభ సభ్యుడు కూడా అమిత్ షాకు ఈ అంశంపై ఫిర్యాదు చేయడంతో కేంద్ర హోం శాఖ యాక్షన్ లోకి దిగింది. ఇది సర్వీస్ రూల్స్ కు విరుద్ధమని, ఆయనను ఆదాయపు పన్ను శాఖ కమిషనర్ గా ఎలా నియమిస్తారని ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో దయాసాగర్ ను విజయవాడ నుంచి మధ్యప్రదేశ్ లోని జబల్ పూర్ కు బదిలీ చేశారు. దీంతో రఘురామ కృష్ణరాజు మరోసారి వైసీపీ పై పైచేయి సాధించినట్లయింది.