ఈసారి ఈయనకు మాత్రం మంత్రి పదవి గ్యారంటీ ?

ఆయన వైఎస్సార్ భక్తుడు. ఎంత భక్తుదు అంటే ఆయన ఇంట్లో కొలిచే దైవం వైఎస్సారే. వైఎస్సార్ అందరికీ ఎక్కడ ఉన్నారో తెలియదు కనీ ఆయన గుండెల్లో మాత్రం [more]

;

Update: 2020-05-21 11:00 GMT

ఆయన వైఎస్సార్ భక్తుడు. ఎంత భక్తుదు అంటే ఆయన ఇంట్లో కొలిచే దైవం వైఎస్సారే. వైఎస్సార్ అందరికీ ఎక్కడ ఉన్నారో తెలియదు కనీ ఆయన గుండెల్లో మాత్రం గూడు కట్టుకుని ఉన్నాడు. ఆయనే విజయనగరం జిల్లా సాలూరు ఎమ్మెల్యే రాజన్న దొర. గిరిజన తెగకు చెందిన ఈ ఎమ్మెల్యే మూడు సార్లు అదే సీటు నుంచి గెలిచి అక్కడ బాగా పాతుకుపోయారు. గిరిజనులకు ఆయన ప్రత్యక్ష దైవం అయ్యారు. ఆయనకు కాంగ్రెస్ పార్టీ కంటే వైఎస్సార్ ముఖ్యం. అందుకే వైఎస్సార్ లేరని తెలిసిన మరుక్షణం గుండె బద్దలై కొన్నాళ్ల పాటు మనిషి కాలేకపోయారు. ఆ టైంలో ఆయన తీసుకున్న నిర్ణయమే జగన్ ని అనుసరించాలని. అప్పట్లో ఎందరో కాంగ్రెస్ దిగ్గజాలు ఆయనకు నచ్చచెప్పినా వినకుండా జగన్ ని గుడ్డిగా అనుసరించారు. తనకు రాజన్న కుటుంబమే రాజకీయాల కంటే కూడా ముఖ్యమని కూడా చెప్పేసుకున్నారు.

ఆశాభంగమేనా…?

అయితే జగన్ అధికారంలోకి వచ్చాక రాజన్న దొరకు మంత్రి పదవి వస్తుందని అంతా భావించారు. జగన్ తో నేరుగా సన్నిహిత సంబంధాలు ఉన్న రాజన్నదొర మంత్రి కావడమే మిగిలిందని కూడా అంచనా వేశారు. అయితే జగన్ మాత్రం ఇదే జిల్లాలో ఉన్న తన ముద్దుల చెల్లి కురుపాం ఎమ్మెల్యే పుష్ప శ్రీవాణి పట్ల మొగ్గు చూపారు. ఆమెను ఏకంగా డిప్యూటీ సీఎంని చేశారు. దాంతో రాజన్న దొర ఆశాభంగం చెందారు. ఎన్నడూ దేనికీ అంతగా బాధపడని ఆయన తనకు తగిన గుర్తింపు పార్టీ ఇవ్వలేదని మధనపడ్డారు. అయితే జగన్ ఆయనని ఓదార్చి మలి విడతలో ఛాన్స్ ఉంటుందని చెప్పారని అప్పట్లో ప్రచారం జరిగింది.

ఎమ్మెల్యేగా మార్కులే …?

ఎన్నడూ రహదాని అన్న మాటను చూడని గిరిజన గ్రామాలకు రాజన్న దొర రోడ్లు ఇపుడు కొత్తగా వేయిస్తున్నారు. ఇందుకోసం జగన్ తో స్వయంగా మాట్లాడి నిధులు తెచ్చుకున్నారు. ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉంటూ ఆయన తన పని తాను చేసుకుపోతున్నారు. ఎటువంటి పరిస్థితులు అయినా ఆయన ఇల్లు ఎపుడూ ప్రజాదర్బార్ లా ఉంటుంది. ఆయన చాలా నిరాడంబరంగా ఉంటారు. తాను అధికార పార్టీ ఎమ్మెల్యేనని అహంభావం చూపించారు. నేరుగా పేదలు, గిరిజనులు తన ఇంటిని రావచ్చునని చెబుతారు. వారితో కలసి ఆయన సమస్యలకు పరిష్కారం వెతుకుతారు. ఓ విధంగా నూటికి నూరు శాతం ఎమ్మెల్యేగా మార్కులు తెచ్చుకున్న రాజన్నదొరకు జిల్లా పార్టీ నేతలతో గ్రూపులు కట్టడం తెలియదు. ఆయన తాను జగన్ గ్రూప్ మాత్రమేనని చెబుతున్నారు. జిల్లాలో ఇద్దరు మంత్రులు ఉన్నా కూడా ఆయన ఎవరికీ చేరువ కానీ దూరం కానీ లేకుండా జాగ్రత్త పడతారు. తాను ఎమ్మెల్యేనని, ప్రజల పక్షమని చెబుతూ ఉంటారు.

రికార్డేనా…?

ఆయన మంత్రి అయితే రికార్డేనని అంటున్నారు. రాజన్నదొరకు అధికారం వస్తే, అమాత్య కుర్చీలో కూర్చుంటే చూడాలని ఆయన నియోజకవర్గంతో పాటు, మొత్తం జిల్లా ప్రజలకు ఉంది, నిజాయతీపరుడిగా, సాదాసీదాగా ఉండే రాజన్నదొరకు మంత్రి యోగం పట్టినా జనంతోనే ఉంటారని అంటారు. ఇక ఆయన పేరుని మలి విడతలో జగన్ పరిశీలన చేస్తారన్న మాట గట్టిగా వినిపిస్తోంది. ఆయనకు పదవి ఇవ్వడం న్యాయమని కూడా అంతా అంటున్నారు. టీడీపీ టైంలో ఎన్ని ప్రలోభాలు పెట్టినా ఎక్కడా చలించకుండా రాజన్నదొర పార్టీకి కట్టుబడి ఉన్నారని, ప్రజల కోసం పనిచేసే నేతగా ఉన్నారని అంటున్నారు. అలాంటి నాయకుడికి పదవి ఇస్తే అది మంత్రి పదవికే వన్నె తెస్తుందని కూడా చెబుతున్నారు. చూడాలి మరి జగన్ ఏం చేస్తారో.

Tags:    

Similar News