ఇక ఓపిక లేదట.. తాడో పేడో?

జమ్మలమడుగు వైసీపీ లో విభేదాలకు ఇప్పట్లో చెక్ పడేలా కన్పించడం లేదు. తాజాగా రామసుబ్బారెడ్డి వర్గీయుడు గురునాధరెడ్డి మరణంతో విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. అధిష్టానం సరైన సమయంలో [more]

;

Update: 2020-11-22 05:00 GMT

జమ్మలమడుగు వైసీపీ లో విభేదాలకు ఇప్పట్లో చెక్ పడేలా కన్పించడం లేదు. తాజాగా రామసుబ్బారెడ్డి వర్గీయుడు గురునాధరెడ్డి మరణంతో విభేదాలు మరింత తీవ్రమయ్యాయి. అధిష్టానం సరైన సమయంలో స్పందించకపోవడంతోనే రెండు వర్గాలు పరస్పరం దాడులుకు దిగాయంటున్నారు. గురునాధరెడ్డి హత్యతో రామసుబ్బారెడ్డి పునరాలోచనలో పడినట్లు తెలిసింది. తన వర్గాన్ని ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి టార్గెట్ చేస్తున్నారని రామసుబ్బారెడ్డి ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేశారు.

టీడీపీతో అనుబంధం ఉన్నా…..

రామసుబ్బారెడ్డికి తెలుగుదేశం పార్టీతో సుదీర్ఘ అనుబంధం ఉంది. ఆయన తొలి నుంచి తెలుగుదేశం పార్టీలోనే ఉన్నారు. రామసుబ్బారెడ్డి వరస ఓటములతో కుంగిపోయారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో వైఎస్ ప్రభావం ఎక్కువగా ఉండటం, టీడీపీ కి ఇబ్బందులు తలెత్తడంతో రామసుబ్బారెడ్డి వరస ఓటములను చవి చూస్తున్నారు. 2014 ఎన్నికలలో ఓటమి పాలయినా టీడీపీ అధికారంలోకి రావడంతో రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ అయ్యారు.

వైసీపీలో చేరినా….

అయితే చంద్రబాబు ఆదినారాయణరెడ్డిని వైసీపీలోకి తీసుకుని వచ్చి మంత్రిని చేయడంతో ఆయన టీడీపీలో ఇమడ లేకపోయారు. 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసినా ఆదినారాయణ రెడ్డి వర్గం సహకరించలేదు. దీంతో మరోసారి ఓటమి పాలయ్యారు. ఆయన ఇక టీడీపీలో ఉండి లాభం లేదనుకుని వైసీపీలో చేరారు. అయితే రామసుబ్బారెడ్డి వైసీపీలో చేరడంత సిట్టింగ్ వైసీపీ ఎమ్మెల్యే సుధీర్ రెడ్డికి ఇ‌ష్టం లేదు. దీంతో సుధీర్ రెడ్డి రామసుబ్బారెడ్డితో సయోధ్యకు సుముఖత చూపలేదు.

జగన్ దృష్టికి తీసుకెళ్లినా…..

ఈ నేపథ్యంలో గత కొంతకాలంగా రెండు వర్గాల మధ్య విభేదాలు తలెత్తుతున్నాయి. సుధీర్ రెడ్డి ప్రభుత్వ, పార్టీ కార్యక్రమాలకు రామసుబ్బారెడ్డిని దూరంగా ఉంచడం మొదలుపెట్టారు. ఈ విషయాన్ని కడప జిల్లాకు జగన్ వచ్చిన సందర్భంలో రామసుబ్బారెడ్డి తీసుకెళ్లినా ఫలితం లేకపోయింది. దీంతో గండికోట నిర్వాసితుల రీసర్వేలో ఘర్షణ జరిగి రామసుబ్బారెడ్డి వర్గీయుడు మరఠణించారు. ఇప్పటి వరకూ ఓపిక పట్టిన రామసుబ్బారెడ్డి తన అనుచరుడు మరణించడంతో ఆయన జగన్ వద్ద తేల్చుకునేందుకు సిద్ధమయ్యారు. అవసరమైతే పార్టీని వీడేందుకు కూడా రామసుబ్బారెడ్డి సిద్ధమయినట్లు తెలుస్తోంది.

Tags:    

Similar News