Ysrcp : సెట్ చేసేసుకున్నారా?
మనసులో ఒకటి పెట్టుకుని రాజకీయాలు చేస్తే అది సులువుగా తెలిసిపోతుంది. ఏ పార్టీకైనా మనస్ఫూర్తిగా పనిచేస్తేనే వారికి విలువ ఉంటుంది. రామసుబ్బారెడ్డి మనసులో ఇబ్బంది పడుతూ వైసీపీలో [more]
;
మనసులో ఒకటి పెట్టుకుని రాజకీయాలు చేస్తే అది సులువుగా తెలిసిపోతుంది. ఏ పార్టీకైనా మనస్ఫూర్తిగా పనిచేస్తేనే వారికి విలువ ఉంటుంది. రామసుబ్బారెడ్డి మనసులో ఇబ్బంది పడుతూ వైసీపీలో [more]
మనసులో ఒకటి పెట్టుకుని రాజకీయాలు చేస్తే అది సులువుగా తెలిసిపోతుంది. ఏ పార్టీకైనా మనస్ఫూర్తిగా పనిచేస్తేనే వారికి విలువ ఉంటుంది. రామసుబ్బారెడ్డి మనసులో ఇబ్బంది పడుతూ వైసీపీలో నలిగిపోతున్నారు. అయితే దానిని పరిష్కరించుకున్నట్లు తెలిసింది. జమ్మలమడుగు రామసుబ్బారెడ్డి ఇటీవల కడప జిల్లాకు వచ్చిన ముఖ్యమంత్రి జగన్ ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన తన నియోజకవర్గంలో జరుగుతున్న పరిణామాలు వివరించినట్లు తెలిసింది. దీంతో జగన్ నుంచి కూడా రామసుబ్బారెడ్డికి హామీ లభించినట్లు చెబుతున్నారు.
మూడు దశాబ్దాలకు పైగానే…
రామసుబ్బారెడ్డి టీడీపీలోనే ఎక్కువగా తన పాలిటిక్స్ ను చేశారు. మూడు దశాబ్దాలకు పైగానే రామసుబ్బారెడ్డి టీడీపీలో ఉన్నారు. అనేక పదవులను పొందరు. రెండు సార్లు ఎమ్మెల్యేగా గెలిచి ఒకసారి మంత్రి పదవిని కూడా దక్కించుకున్న రామసుబ్బారెడ్డి వరస ఓటములను తట్టుకోలేకపోయారు. గత ఎన్నికలలో ఓటమి పాలయిన తర్వాత ఆయన వైసీపీలో చేరిపోయారు. టీడీపీకి దూరమైన తర్వాత ఆయన వైసీపీలో యాక్టివ్ అయ్యారు.
పంచాయతీ జరిగినా….
కానీ స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డి ఆయనను దూరం పెడుతుండటంతో తట్టుకోలేకపోతున్నారు. తన క్యాడర్ కు పదవులను కూడా ఇవ్వకుండా, సమావేశాలకు ఆహ్వానం పంపకుండా ఘోరంగా అవమానిస్తున్నారని రామసుబ్బారెడ్డి వర్గం ఆరోపిస్తుంది. ఈ మేరకు తాడేపల్లిలో పంచాయతీ కూడా జరిగింది. రామసుబ్బారెడ్డికి ఎమ్మెల్సీ పదవి ఇస్తారని హామీ ఇచ్చారు. అలాగే వచ్చే ఎన్నికల్లో తిరిగి సుధీర్ రెడ్డికే ఎమ్మెల్యే టిక్కెట్ ఇస్తామని ఒప్పందం కుదుర్చుకుని వచ్చారు.
జగన్ ను కలసి….
కానీ ఆ తర్వాత కూడా సుధీర్ రెడ్డి వ్యవహారశైలిలో మార్పు లేదు. దీంతో ఇటీవల పులివెందులకు వచ్చిన జగన్ ను కలసి తన బాధను చెప్పుకున్నట్లు సమాచారం. అయితే జగన్ ఇబ్బంది పడాల్సిన పనిలేదని, అన్నీ సవ్యంగా జరుగుతాయని రామసుబ్బారెడ్డికి హామీ ఇచ్చినట్లు చెబుతున్నారు. అసంతృప్తిగా ఉన్న రామసుబ్బారెడ్డి తిరిగి టీడీపీలో చేరతారన్న ప్రచారానికి జగన్ ను కలవడంతో తెరపడినట్లయింది.