వెయిట్ చేయడం అంత ఉత్తమం లేదేమో?

ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాల్లో తెలిస్తే రాజకీయంలో సగం సక్సెస్ సాధించినట్లే. టైం మనది కానప్పుడు తాడు కూడా పామై కరుస్తుందన్న సామెత రాజకీయనేతలకు చక్కగా సరిపోతుంది. [more]

;

Update: 2020-11-13 02:00 GMT

ఎక్కడ తగ్గాలో.. ఎక్కడ నెగ్గాల్లో తెలిస్తే రాజకీయంలో సగం సక్సెస్ సాధించినట్లే. టైం మనది కానప్పుడు తాడు కూడా పామై కరుస్తుందన్న సామెత రాజకీయనేతలకు చక్కగా సరిపోతుంది. టీడీపీ నుంచి వైసీపీలోకి వచ్చిన నేతల పరిస్థితి ఏమాత్రం బాగా లేదు. వారికి పదవులు ఇవ్వకపోవడంతో పాటు తమ నియోజవకర్గాల్లో ప్రాధాన్యత కూడా లభించడం లేదు. కాని వారు తిరిగి టీడీపీలోకి వెళ్లినా బావుకునేదేమీ లేదు. వెయిట్ చేయడమే బెటర్. అలాంటి పరిస్థితినే జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే రామసుబ్బారెడ్డి ఎదుర్కొంటున్నారు.

టీడీపీలో కొనసాగలేెక….

రామసుబ్బారెడ్డి టీడీపీని వదిలివెళ్లడానికి అనేక కారణాలున్నాయి. చంద్రబాబు వేసిన ప్లాన్ బూమ్ రాంగ్ అయింది. తనకు ఇష్టం లేకున్నా తన ప్రత్యర్థి ఆదినారాయణరెడ్డిని పార్టీలోకి తీసుకోవడమే కాకుండా మంత్రి పదవిని ఇవ్వడం ఆయనకు అప్పట్లోనే ఆగ్రహం తెప్పించినా టీడీపీ మరోసారి అధికారంలోకి వస్తుందని భావించి ఆయన పార్టీలోనే కొనసాగారు. మరోవైపు జమ్మలమడుగు నియోజకవర్గంలో టిక్కెట్ కోసం తన ఎమ్మెల్సీ పదవిని కూడా వదులకున్నారు.

వచ్చే ఎన్నికల్లో….

అయితే వైసీపీ అధికారంలోకి రావడంతో రామసుబ్బారెడ్డి టీడీపీలో ఉండి చేయగలిగిందేమీ లేదని భావించారు. ఆదినారాయణరెడ్డి వర్గం వచ్చే ఎన్నికల్లోనూ తనకు సహకరించదని ఆయన అభిప్రాయపడ్డారు. అంతేకాదు వచ్చే ఎన్నికల నాటికి ఆదినారాయణరెడ్డి తిరిగి టీడీపీలోకి రావడం ఖాయమని కూడా ఆయనకు తెలుసు. అందుకే ముందుగా వైసీపీలో చేరారు. వైసీపీలో చేరితే వచ్చే ఎన్నికల నాటికి జగన్ చూపు తనపై ఉంటుందని రామసుబ్బారెడ్డి భావించారు.

వెయిట్ చేస్తూనే…..

కానీ స్థానిక ఎమ్మెల్యే సుధీర్ రెడ్డితో పొసగకపోవడంతో ఆయన ప్రస్తుతం మౌనంగా ఉంటున్నారు. వైసీపీని వీడతారని, టీడీపీలో చేరతారని ప్రచారం జోరుగా సాగింది. అయితే రామసుబ్బారెడ్డి స్వయంగా ఈ ప్రచారాన్ని ఖండించారు. తాను వైసీపీలోనే కొనసాగుతానని స్పష్టం చేశారు. ఎమ్మెల్యేతో కొన్ని విభేదాలు ఉన్నమాట నిజమేనని, కొత్తగా తాను పార్టీలోకి రావడంతో సహజమేనని ఆయన అన్నారు. దీన్నిబట్టి టీడీపీలోకి వెళ్లినా చేసేదేమీ లేదని రామసుబ్బారెడ్డి డిసైడ్ అయినట్లుంది. అయితే ఎన్నికలు దగ్గరపడే సమయంలో ఆయన నిర్ణయాన్ని మార్చుకునే అవకాశమూ లేకపోలేదు.

Tags:    

Similar News