రాముడి కోసం రధమెక్కనున్న సోము …?
పాదయాత్రలకు వైఎస్ ఫ్యామిలీ ఎలా పెట్టింది పేరో రధయాత్రల విషయంలో బీజేపీకే పేటెంట్ హక్కులన్నీ ఉన్నాయి. నాడు రెండు సీట్లు ఉన్న బీజేపీని 89 దాకా తెచ్చిన [more]
;
పాదయాత్రలకు వైఎస్ ఫ్యామిలీ ఎలా పెట్టింది పేరో రధయాత్రల విషయంలో బీజేపీకే పేటెంట్ హక్కులన్నీ ఉన్నాయి. నాడు రెండు సీట్లు ఉన్న బీజేపీని 89 దాకా తెచ్చిన [more]
పాదయాత్రలకు వైఎస్ ఫ్యామిలీ ఎలా పెట్టింది పేరో రధయాత్రల విషయంలో బీజేపీకే పేటెంట్ హక్కులన్నీ ఉన్నాయి. నాడు రెండు సీట్లు ఉన్న బీజేపీని 89 దాకా తెచ్చిన బీజేపీ వరిష్ట నేత ఎల్ కె అద్వానీ ఇక లాభం లేదని ఒక్క ఉదుటున రధం ఎక్కేశారు. ఆయన సోమనాధ ఆలయం నుంచి అయోధ్యకు రధయాత్రను చేపట్టి 1990 దశకంలో దేశ రాజకీయ ముఖచిత్రాన్నే మార్చేశారు. ఆ దెబ్బకు బీజేపీ సీట్లు సెంచరీని దాటి పరుగులు తీశాయి. 1991లో రాజీవ్ గాంధీ హత్య జరగకపోయి ఉంటే అపుడే బీజేపీ అధికారం పట్టేసేది.
దేవుడి కోసమేనా….?
బీజేపీ రధయాత్రలో స్వామి కార్యం స్వకార్యం ఎపుడూ ఉంటాయి. రాముడు భారతీయ సమాజానికి మూల పురుషుడు. ఆయన్ని నమ్ముకుని యాత్ర రధయాత్ర చేస్తే అన్ని విధాలుగా మేలు అని తలచిన అద్వానీ అయోధ్య వైపుగా సాగిపోయారు. మధ్యలో బీహార్ లో ఆయన్ని నాటి సీఎం లాలూ ప్రసాద్ యాదవ్ అరెస్ట్ చేసినా కూడా రధయాత్ర అప్పటికే సూపర్ హిట్. దాంతో 1996 నుంచి డబుల్ సెంచరీకి తక్కువ కాకుండా బీజేపీ గెలుస్తూ మొత్తానికి 1996లో తొలిసారి ఢిల్లీపీఠమెక్కేసింది. ఇదంతా ఎందుకంటే ఇపుడు ఏపీలో కూడా సోము వీర్రాజు రధయాత్రకు రెడీ అవుతున్నారుట.
దక్షిణ అయోధ్య వైపుగా…?
ఆంధ్రాలోని విజయనగరం జిల్లాలోని రామతీర్ధం పుణ్య క్షేత్రాన్ని దక్షిణ అయోధ్యగా పిలుస్తారు. అంటే అయోధ్య అన్నది కామన్, రధయాత్ర అన్నదీ కామన్. ఇక జెండా అజెండా కూడా కామనే. దాంతో మంచి టైం చూసుకుని మరీ సోము వీర్రాజు కూడా ఏపీ వ్యాప్తంగా రధయాత్ర చేపడతారు అంటున్నారు. ఏపీలో ఏ వైపు నుంచి రధయాత్రను స్టార్ట్ చేసినా కూడా రామతీర్ధం వైపుగా రూట్ వేసుకుని మరీ రధాన్ని జోరు పెంచుతారు అని అంటున్నారు. ఏపీలో ఇప్పటికే విగ్రహాల విద్వంసం అన్నది ఒక పవర్ ఫుల్ అజెండాగా విపక్షాలు చేసుకున్నాయి. దాంతో అంది వచ్చిన అవకాశాన్ని రాజకీయంగా వాడుకోవాలని సోము డిసైడ్ అయ్యాని టాక్.
పొలిటికల్ గా హిట్టేనా…?
ఏపీలో ఈ ఏడాది నుంచి ఎన్నికల సంరంభం మొదలవుతుంది. ముందు తిరుపతి లోక్ సభ ఉప ఎన్నిక, ఏ మీదట లోకల్ బాడీ ఎన్నికలు, వచ్చే ఏడాది నాటికి జమిలి ఎన్నికలు కూడా జరిగే అవకాశాలు ఉన్నాయి. దాంతో ఏడాది ముందుగా రధయాత్ర చేపడితే ఏపీలో బలమైన ఆల్టర్నేషన్ గా బీజేపీ తయారవుతుందని ఏపీ బీజేపీ అంచనా వేస్తోందిట. ఇక హై కమాండ్ ఇచ్చిన సూచనలతోనే సోము వీర్రాజు రధం ఎక్కబోతున్నారని అంటున్నారు. ఇప్పటికే హాట్ హాట్ గా ఉన్న ఏపీ రాజకీయ వాతావరణంలో సోము వీర్రాజు చేసే రధ యాత్ర ఏ రకమైన ప్రకంపనలు సృష్టిస్తోందో చూడాల్సిందే.