రాపాక ఫుల్లుగా క్లారిటీ ఇచ్చేసినట్లేనా?
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జనసేనకు పూర్తిగా దూరమయినట్లేనా? ఆయన పై పార్టీ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోరన్న ధైర్యం రావడంతో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నారా? [more]
;
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జనసేనకు పూర్తిగా దూరమయినట్లేనా? ఆయన పై పార్టీ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోరన్న ధైర్యం రావడంతో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నారా? [more]
రాజోలు ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్ జనసేనకు పూర్తిగా దూరమయినట్లేనా? ఆయన పై పార్టీ పరంగా ఎటువంటి చర్యలు తీసుకోరన్న ధైర్యం రావడంతో ఒక్కొక్క అడుగు ముందుకు వేస్తున్నారా? అంటే అవుననే అనిపిస్తోంది. గత ఎన్నికల్లో 175 నియోజకవర్గాల్లో జనసేన నుంచి గెలిచిన ఒకే ఒక ఎమ్మెల్యే రాపాక వరప్రసాద్. ఆయన జనసేన నుంచి దాదాపుగా బయటకు వచ్చినట్లే. సాంకేతికంగా పార్టీలోనే ఉన్నా ఆయన వైసీపీ కండువా కప్పేసుకున్నట్లే.
పార్టీ సయితం….
జనసేన ఎమ్మెల్యే అసలు ఉన్నారో? లేదో? తెలియదని సాక్షాత్తూ పార్టీ అధ్యక్షుడు పవన్ కల్యాణ‌్ వ్యాఖ్యానించారంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. కనీసం పార్టీ కార్యక్రమాలకు, పవన్ కల్యాణ్ హాజరయ్యే సమావేశాలకు కూడా రాపాక వరప్రసాద్ కు ఆహ్వానం పంపడం లేదు. ఒక రకంగా జనసేన పార్టీ రాపాక వరప్రసాద్ ను దూరం పెట్టేసిందనే చెప్పాలి. రాపాక వరప్రసాద్ కూడా మానసికంగా జనసేనకు దూరమయ్యారు.
దూరంగా పెట్టి….
రాజోలు నియోజకవర్గంలో జనసేన పార్టీ నేతలు ఆయనను ఎలాంటి కార్యక్రమాలకు ఆహ్వానించడం లేదు. ఆయన ఎక్కువగా వైసీపీ నేతలతోనే కలసి వెళుతున్నారు. మంత్రి విశ్వరూప్ తో కలసి అనేక కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటున్నారు. పార్టీ ఎప్పుడు తనపై చర్యలు తీసుకుంటుందా? అఫిషియల్ గా వైసీపీలో కి వెళదామన్నది రాపాక వరప్రసాద్ ఆలోచనగా ఉంది.
స్థానిక సంస్థల ఎన్నికల్లో….
దీంతో పాటు ఇటీవల జరిగిన సంఘటన కూడా రాపాక వరప్రసాద్ జనసేనకు మరింత దూరం పెంచింది. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఆయన వైసీపీ అభ్యర్థుల వైపు మొగ్గు చూపారు. జనసేన ప్రత్యేకంగా ఇక్కడ అభ్యర్థులను బరిలోకి దించింది. వారి నామినేషన్ల సమయంలోనూ రాపాక వరప్రసాద్ దూరంగా ఉండటంతో ఆయన ఇక జనసేనకు దాదాపు గుడ్ బై చెప్పేసినట్లే. ఇక పార్టీ పరంగా కూడా ఆయన పార్టీలో లేనట్లే భావిస్తుండటంతో ఇక రాపాకపై ఫుల్లు క్లారిటీ వచ్చేసినట్లే.