ఒకే ఒక్కడు ఏడిపించేస్తున్నాడు … ?

జనసేన కు కనీసం ఒకే ఒక్క ఎమ్యెల్యే అయినా గెలిచిన ఆనందం లేకుండా చేస్తున్నారు రాపాక వరప్రసాద్. విపక్షాలు వైసిపి పై ముప్పేట దాడి చేసినప్పుడల్లా జనసేన [more]

;

Update: 2020-07-04 06:30 GMT

జనసేన కు కనీసం ఒకే ఒక్క ఎమ్యెల్యే అయినా గెలిచిన ఆనందం లేకుండా చేస్తున్నారు రాపాక వరప్రసాద్. విపక్షాలు వైసిపి పై ముప్పేట దాడి చేసినప్పుడల్లా జనసేన గట్టిగా గొంతెత్తిన ప్రతీసారి రాపాక వరప్రసాద్ సీన్ లోకి దిగి తమ పార్టీ ఆరోపణల గాలి తీసేస్తున్నారు. దీనికి పరాకాష్ట గా ఇటీవల రాజ్యసభ ఎన్నికల్లో రాపాక వైసిపి అభ్యర్ధికి ఓటు వేసి బాహాటంగా ప్రకటించేశారు కూడా. దీనిపై జనసేన ఏమి చేయలేని దుస్థితి ఏర్పడింది. ఈ వైనాన్ని నేరుగా గొంతెత్తి రాపాక వరప్రసాద్ ను నిలదీయలేక ఆయన్ను బయటకు పంపలేక తిప్పలు పడుతుంది జనసేన.

మీడియా మీట్ లలో ఇదే ప్రశ్న …

ప్రశ్నిస్తామని పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ జనసేన వర్గాలు మీడియా ముందుకు ఏదైనా అంశం పై వస్తే వారికి రాపాక వరప్రసాద్ పై ప్రశ్నల పరంపర పాత్రికేయుల నుంచి ఎదుర్కొవాలిసి వస్తుంది. పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడుతున్నా, అధినేత పవన్ ను పదేపదే ఎండగడుతున్నా మౌనం వహించడాన్ని మీడియా ప్రశ్నిస్తే జవాబు చెప్పుకోలేని పరిస్థితి నేతలకు ఏర్పడుతుంది. రాపాక వరప్రసాద్ సాంకేతికంగా జనసేన ఎమ్యెల్యే అయినా ఆయన వైసిపి ఎమ్యెల్యేగా పక్కాగా వ్యవహారాలు సాగిస్తున్నారు. నిత్యం జగన్ భజన చేస్తూ పవన్ కళ్యాణ్ తీరుపై ఒంటికాలిపై లేస్తున్నారు. అయినా కానీ జనసేన ఉన్న ఒక్క ఎమ్యెల్యే పై చర్యలు తీసుకుంటే ఆయన స్వతంత్ర ఎమ్యెల్యే గా ఉండి పార్టీ పేరే వినిపించకుండా చేసే అవకాశాలు ఉన్నాయి.

వైసిపి కూడా రావాలని కోరుకోవడం లేదా … ?

అధికారపార్టీ కూడా రాపాక వరప్రసాద్ జనసేనను వదిలి రావాలని కోరుకోవడం లేదు. ఆ పార్టీలో ఉంటూనే అవసరానికి సీన్ లోకి వస్తే చాలని భావిస్తుంది. దాంతో గతంలో టిడిపి ఆడిన ఆటే ఇప్పుడు వైసిపి కొనసాగిస్తూ ఎపి లో ఇదే తరహా రాజకీయాలను సంప్రదాయంగా మార్చేసింది. ఇదే తీరులో ఇప్పుడు వైసిపి ఎంపి రఘురామకృష్ణం రాజు మొదలు పెట్టారు. దాన్నెలా ముగించాలో అధికారపార్టీకి అర్ధం కావడం లేదు. అదే స్థితిని పవన్ జనసేన ఎదుర్కొంటుంది. ఈ సమస్యకు పరిష్కారం లేనట్లే కనిపిస్తుంది. అంతులేని కథలా ఈ టైపు రాజకీయాలు మరిన్ని తెరపైకి రానున్నట్లే అంటున్నారు విశ్లేషకులు.

Tags:    

Similar News