జగన్ కేబినెట్ లో రాపాక మంత్రా ? ఇదేం లెక్కరా బాబు?
గత సాధారణ ఎన్నికల్లో ఎన్నో ఆశలతో ఎన్నికల బరిలోకి దిగిన జనసేన ఏపీలో ఒక్క రాజోలు సీటుతో సరిపెట్టుకుంది. అక్కడ నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాదరావు [more]
గత సాధారణ ఎన్నికల్లో ఎన్నో ఆశలతో ఎన్నికల బరిలోకి దిగిన జనసేన ఏపీలో ఒక్క రాజోలు సీటుతో సరిపెట్టుకుంది. అక్కడ నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాదరావు [more]
గత సాధారణ ఎన్నికల్లో ఎన్నో ఆశలతో ఎన్నికల బరిలోకి దిగిన జనసేన ఏపీలో ఒక్క రాజోలు సీటుతో సరిపెట్టుకుంది. అక్కడ నుంచి పోటీ చేసిన రాపాక వరప్రసాదరావు ఆ వెంటనే వైసీపీలోనూ బయటా సీఎం జగన్ భజన చేస్తూ ఆ పార్టీకి చేరువయ్యారు. పవన్‌నే రెండు చోట్ల ఓడాడు… ఇంక నన్నెక్కడ గెలిపించాడు.. తాను రాజోలులో తన వ్యక్తిగత ఇమేజ్‌తో గెలిచానని చెప్పేశారు. రాజోలులో పొలిటికల్ లాబీయింగ్ చేసే ఓ వర్గం రాపాకకు సపోర్ట్ చేయడంతో ఇప్పుడు అనధికారికంగా రాపాక వరప్రసాదరావు వైసీపీ నేతగానే కొనసాగుతున్నారు. ఇటీవలే తన కుమారుడికి జగన్ సమక్షంలోనే వైసీపీ కండువా కప్పించేశారు.
స్థానిక సంస్థల ఎన్నికల్లో…
ఇక ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ రాపాక వరప్రసాదరావు చాలా పంచాయతీల్లో తన వర్గానికి చెందిన వారికే సీట్లు ఇప్పించుకుంటున్నారు. కొన్ని చోట్ల నియోజకవర్గ వైసీపీ ఇన్‌చార్జ్‌గా ఉన్న పెదపాటి అమ్మాజీ ఎవరిని అయినా పోటీలో పెడితే రాపాక వారికి వార్నింగ్‌లు కూడా ఇస్తున్నారట. ఇటీవల అమ్మాజీ వర్గానికి చెందిన ఓ కార్యకర్తకు రాపాక ఫోన్లో వార్నింగ్ ఇస్తోన్న వీడియో కూడా వైరల్ అయ్యింది. ఇక గత రెండు ఎన్నికల్లోనూ ఇక్కడ వైసీపీ నుంచి పోటీ చేసి ఓడిన బొంతు రాజేశ్వరరావుకు బలమైన వర్గం ఉన్నా ఆయన్ను జగన్ పక్కన పెట్టేయడంతో ఇప్పుడు రాపాక వరప్రసాదరావు హవాయే రాజోలు వైసీపీలో ఎక్కువుగా ఉంది.
మంత్రిగా ప్రచారం….
ఈ క్రమంలోనే రాపాక అనుచరులతో పాటు ఆయనకు సపోర్ట్ చేసే లాబీయిస్టులుగా పేరున్న ఓ కులం వాళ్లు కూడా ఈ స్థానిక ఎన్నికల్లో రాపాక వరప్రసాదరావు నిలబెట్టిన వాళ్లను గెలిపిస్తే వచ్చే కేబినెట్ మార్పులు, చేర్పుల్లో రాపాక మంత్రి అయిపోతారని నియోజకవర్గంలో ప్రచారం చేస్తున్నారు. పనిలో పనిగా వీరు ఇదే కోనసీమలో ఉన్న ఎస్సీ వర్గానికి చెందిన పినిపే విశ్వరూప్ పదవికి మాటల్లో ఎసరు పెట్టేస్తున్నారు. విశ్వరూప్ పనితీరుపై జగన్ గుర్రుగా ఉన్నారని.. ఆయన్ను తప్పించి జిల్లాలో ఎస్సీ వర్గం నుంచి రాపాక వరప్రసాదరావును మంత్రిని చేస్తారని ప్రచారం చేసుకుంటున్నారు.
గ్రిప్ లోకి తెచ్చుకోవాలని….
వాస్తవంగా చూస్తే జనసేన నుంచి గెలిచిన రాపాక వరప్రసాదరావుకు జగన్ వైసీపీ కండువాయే కప్పలేదు. అలాంటిది ఆయనకు మంత్రి పదవి ఇస్తారని ఆశించడం ఎంత పెద్ద ఆశే. నిజంగా విశ్వరూప్‌ను మార్చాల్సి వస్తే అదే జిల్లాలో టి.గన్నవరం నుంచి గెలిచిన కొండేటి చిట్టిబాబు కూడా ఎస్సీ వర్గం ఎమ్మెల్యేగా ఉన్నారు. ఆయన్ను కాదని రాపాక వరప్రసాదరావుకు మంత్రి పదవి రాదు. అయితే రాపాక & అనుచరులు మాత్రం చాలా తెలివైన ప్రచారం చేసుకుంటూ వైసీపీ రాజకీయాన్ని గ్రిప్‌లోకి తెచ్చుకుంటున్నారు.