అన్నీ కప్పగంతులే… ఇక కష్టమేనటగా?
రావెల కిశోర్ బాబు నిర్ణయాలు ఆయన భవిష్యత్ రాజకీయానికి ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి వెంటనే మంత్రి అయిన అదృష్టం ఒక్క రావెల [more]
;
రావెల కిశోర్ బాబు నిర్ణయాలు ఆయన భవిష్యత్ రాజకీయానికి ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి వెంటనే మంత్రి అయిన అదృష్టం ఒక్క రావెల [more]
రావెల కిశోర్ బాబు నిర్ణయాలు ఆయన భవిష్యత్ రాజకీయానికి ఇబ్బంది పెట్టే విధంగా ఉన్నాయి. తొలిసారి ఎమ్మెల్యేగా గెలిచి వెంటనే మంత్రి అయిన అదృష్టం ఒక్క రావెల కిశోర్ బాబుకు మాత్రమే దక్కుతుంది. చంద్రబాబు పాలనతో మంత్రిగా ఉన్న రావెల కిశోర్ బాబు సొంత పార్టీ నేతలతోనే ఢీ అంటే ఢీ అన్నారు. ఫలితంగా ఆయన మంత్రి పదవికే ఎసరొచ్చింది. చివరకు తనకు రాజకీయ జీవితాన్ని ఇచ్చిన పార్టీనే వదులుకోవాల్సి వచ్చింది.
ఏ పార్టీ అయినా అంతే……
రావెల కిశోర్ బాబుకు ఒక్క విషయం అర్ధం కావడం లేదు. ఏ పార్టీ అయినా ఒకటే. పార్టీ నేతలు వేరయినా వారు అమలు చేసే అజెండా ఒక్కటేనన్నది రావెల కిశోర్ బాబు విస్మరించారు. తెలుగుదేశం పార్టీ నుంచి రావెల కిశోర్ బాబు 2014 ఎన్నికల్లో ప్రత్తిపాడు నియోజకవర్గం నుంచి గెలుపొందారు. సహజంగా ఐఆర్ఎస్ అధికారి కావడంతో తాను చెప్పినట్లే నడుచుకోవాలని రావెల భావించారు. కానీ రాజకీయాల్లో అలా ఉండదన్న విషయం ఆలస్యంగా అర్థమయింది.
జనసేనలో చేరి…..
టీడీపీని వీడిన రావెల కిశోర్ బాబు తర్వాత జనసేనలో చేరారు. జనసేన అభ్యర్థిగా పత్తిపాడు నియోజకవర్గం నుంచి పోట ీచేసి ఓటమి పాలయ్యారు. పోనీ ఆ పార్టీలో ఉన్నారా? అంటే లేదు. ఆ తర్వాత భారతీయ జనతా పార్టీలో చేరారు. బీజేపీ రాష్ట్ర కార్యవర్గంలోనూ చోటు సంపాదించుకున్నారు. తమ అధినేత టిక్కెట్ ఇస్తే పార్టీ మారి ఆయనకు ద్రోహం చేశారని రావెల పై పత్తిపాడు జనసేన శ్రేణులు గుర్రుగా ఉన్నాయి.
ఇప్పుడు బీజేపీలో……
ప్రస్తుతం జనసే, బీజేపీలు పొత్త పెట్టుకున్నాయి. వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తున్నాయి. వచ్చే ఎన్నికల్లో పత్తిపాడు బీజేపీ టిక్కెట్ రావెలకు దక్కుతుందా? పొత్తులో భాగంగా జనసేనకు పోతే పరిస్థితి ఏంటి? సరే అంతవరకూ ఓకే. పత్తిపాడు నియోజకవర్గంలో రావెల కివోర్ బాబుకు బీజేపీ టిక్కెట్ ఇస్తారనుకుందాం. మరోసారి పోటీ చేస్తే జనసేన పార్టీ క్యాడర్ సహకరిస్తుందా? అంటే రావెల కిశోర్ బాబు వద్ద సమాధానంలేదు. రావెల కిశోర్ బాబు కప్పగంతులతో ఆయన చెంత ఇప్పుడు నలుగురు కార్యకర్తలు కూడా నిలకడగా లేని పరిస్థితి ఉందంటున్నారు. మరి రావెల రాజకీయాలలో ఎలా నెట్టుకొస్తారో చూడాలి.