యడ్యూరప్ప వారసుడెవరు? ఆయనేనా?

ముఖ్యమంత్రి యడ్యూరప్ప దిగిపోవడం దాదాపు ఖాయమైంది. ఈనెల 25వ తేదీతో ఆయన రెండేళ్ల ముఖ్యమంత్రి పదవీ కాలం పూర్తవుతుంది. ఆ తర్వాత ఆయనంతట ఆయనే దిగిపోయేలా అధినాయకత్వం [more]

;

Update: 2021-07-23 16:30 GMT

ముఖ్యమంత్రి యడ్యూరప్ప దిగిపోవడం దాదాపు ఖాయమైంది. ఈనెల 25వ తేదీతో ఆయన రెండేళ్ల ముఖ్యమంత్రి పదవీ కాలం పూర్తవుతుంది. ఆ తర్వాత ఆయనంతట ఆయనే దిగిపోయేలా అధినాయకత్వం ప్లాన్ చేసింది. దీంతో ఎప్పుడైనా యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేసే అవకాశముంది. అయితే యడ్యూరప్ప స్థాయిలో కర్ణాటకను ప్రభావితం చేయగల నేత ఎవరు వస్తారన్న ఆసక్తి సర్వత్రా నెలకొంది.

దిగిపోవడం ఖాయం…..

యడ్యూరప్ప ముఖ్యమంత్రి పదవి నుంచి దిగిపోవడం ఖాయమయింది. అయితే మరో ఏడాదిన్నరలో జరగనున్న అసెంబ్లీ ఎన్నికలకు ఎవరు సారథ్యం వహిస్తారన్నది చర్చనీయాంశమైంది. యడ్యూరప్ప బలమైన నేత. ఆయన వల్లనే బీజేపీ కర్ణాటకలో అధికారంలోకి అనేకసార్లు రాగలిగింది. కొత్తగా వచ్చే నేతను ఖచ్చితంగా యడ్యూరప్ప సామర్థ్యం, సత్తాతో పోల్చి చూస్తారు. దీంతో యడ్యూరప్ప వారసుడి వ్యవహారం కర్ణాటకలో హాట్ టాపిక్ గా మారింది.

రెండేళ్ల నుంచే….?

అయితే బీజేపీ నాయకత్వం దాదాపు రెండేళ్ల నుంచే యడ్యూరప్పకు ప్రత్యామ్నాయ నేతకోసం అన్వేషణ ప్రారంభించింది. 2019లో తిరిగి బీజేపీ కేంద్రంలో అధికరంలోకి రాగానే ఈ కసరత్తు ప్రారంభమయింది. యడ్యూరప్ప వయసు 78 ఏళ్లు కావడంతో ఆయనను మార్చడం అనివార్యమయింది. సామాజికపరంగా, యడ్యూరప్పను మించిన నేతను ముఖ్యమంత్రి పీఠం పై కూర్చోబెట్టాలన్నది కేంద్ర నాయకత్వం ఆలోచన.

సీఎం పదవి రేసులో…?

అయితే ముఖ్యమంత్రి రేసులో కేంద్ర మంత్రి ప్రహ్లద్ జోషి, సీటీ రవి, మురుగేశ్ నిరాణి, సీఎన్ అశ్వథ్ధ నారాయణ పేర్లు బలంగా విన్పిస్తున్నాయి. వీరిలో మురుగేశ్ నిరాణి యడ్యూరప్ప సామాజికవర్గానికి చెందిన లింగాయత్. దీంతో సీనియారిటీకి పట్టం కడతారా? లేక సామాజికవర్గానికా? అన్నది మరికొద్దిరోజుల్లోనే తేలనుంది. ఇప్పటికే నేతలు ఢిల్లీ లో మాకాం వేసి లాబీయింగ్ చేస్తున్నారు. తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. యడ్యూరప్ప వారసుడెవరనేది కొద్ది రోజుల్లోనే దీనిపై స్పష్టత రానుంది.

Tags:    

Similar News