రాజీనామాకు అదే కారణమా? కట్టడి చేయాలనేనా?

పంజాబ్ కు చెందిన హర్ సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వ్యవసాయ సంస్కరణలను వ్యతిరేకిస్తూ ఆమె కేంద్ర మంత్రిపదవికి [more]

;

Update: 2020-09-19 17:30 GMT

పంజాబ్ కు చెందిన హర్ సిమ్రత్ కౌర్ బాదల్ కేంద్రమంత్రి పదవికి రాజీనామా చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. వ్యవసాయ సంస్కరణలను వ్యతిరేకిస్తూ ఆమె కేంద్ర మంత్రిపదవికి రాజీనామా చేసిన సంగతి తెలిసిందే. అయితే రైతుల మీద ప్రేమా? లేక మరేదైనా కారణమా? అన్న దానిపై చర్చ సాగుతోంది. కేంద్ర ప్రభుత్వం చేపడుతున్న వ్యవసాయ సంస్కరణలకు తాము వ్యతిరేకమని ఎన్డీఏ మిత్రపక్షం శిరోమణి అకాలీదళ్ ప్రకటించింది. బిల్లులను వ్యతిరేకించాలని నిర్ణయం తీసుకుంది. పార్టీ సభ్యులకు విప్ కూడా జారీ చేసింది.

త్వరలో నిర్ణయం అంటూ….

ఎన్డీఏలో కొనసాగాలా? వద్దా? అన్న దానిపై శిరోమణి అకాలీదళ్ త్వరలోనే నిర్ణయం తీసుకుంది. ఎన్డీఏలో శిరోమణి అకాలీదళ్ కొన్నేళ్లుగా భాగస్వామిగా ఉంది. అయితే రెండో దఫా కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ పార్టీ నుంచి హర్ సిమ్రత్ కౌర్ ను మోదీ తన మంత్రివర్గంలోకి తీసుకున్నారు. హర్ ప్రీత్ సింగ్ అకాలీదళ్ అధినేత సుఖ్ బీర్ సింగ్ బాదల్ సతీమణి. పంజాబ్ లో రెండు పార్టీల మధ్య విభేదాలు గత కొంతకాలంగా కొనసాగుతున్నాయి.

బీజేపీ రాష్ట్ర నేతలను…

బీజేపీ నేతలు శిరోమణి అకాలీదళ్ పై ఇటీవల కాలంలో వమర్శలు చేస్తున్నారు. బీజేపీ ఇక్కడ సొంతంగా ఎదిగేందుకే ఈ ప్రయత్నాలు మొదలుపెట్టిందన్న అనుమనాలు అకాలీదళ్ లో ఉన్నాయి. మరో వైపు పంజాబ్ ఎన్నికలకు ఇంకా ఎంతో సమయం లేదు. మరో 18 నెలల్లో పంజాబ్ శాసనసభకు ఎన్నికలు జరగనున్నాయి. సీట్ల పంపకాల్లో తన పట్టునిలుపుకునేందుకు కూడా అకాలీదళ్ మంత్రి పదవి నుంచి తప్పుకుందన్న కామెంట్స్ కూడా విన్పిస్తున్నాయి.

ఎన్నికలే కారణమా?

నిజానికి బీజేపీకి నమ్మకమైన మిత్రుడు అకాలీదళ్. గత పంజాబ్ ఎన్నికల్లోనూ అకాలీదళ్ 94 సీట్లను తీసుకుని, బీజేపీకి కేవలం 23 స్థానాలను మాత్రమే ఇచ్చింది. 117 స్థానాలుండటంతో ఈసారి బీజేపీ ఎక్కువ స్థానాలను ఆశిస్తుంది. ఈ మేరకు కొన్నాళ్లుగా అకాలీదళ్ ను బీజేపీ నేతలు టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలోనే కేంద్ర మంత్రి పదవి నుంచి తప్పుకుని బీజేపీకి అకాలీదళ్ ఝలక్ ఇచ్చిందంటున్నారు. అంతేకాకుండా సీట్ల పంపకాల్లో బీజేపీ పట్టుబట్టకుండా ఉండేందుకు కూడా రాజీనామా తమకు ఉపయోగపడుతుందని అకాాలీదళ్ భావిస్తుంది. మొత్తం మీద రైతుల మీద ప్రేమ కంటే రానున్న ఎన్నికలే లక్ష్యంగా అకాలీదళ్ ఈ నిర్ణయం తీసుకుందంటున్నారు.

Tags:    

Similar News