దీనికి ఎండ్ కార్డు అనేదే లేదా? ?

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు న్యాయస్థానాల చుట్టూనే తిరుగుతున్నాయి. ముఖ్యంగా స్థానిక ఎన్నికల ఎపిసోడ్ అంతా న్యాయస్థానాల్లోనే సాగిపోయాయి. వివాదాస్పద ఎన్నికల అధికారిగా ప్రసిద్ధికెక్కిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ [more]

;

Update: 2021-06-27 03:30 GMT

ఆంధ్రప్రదేశ్ లో రాజకీయాలు న్యాయస్థానాల చుట్టూనే తిరుగుతున్నాయి. ముఖ్యంగా స్థానిక ఎన్నికల ఎపిసోడ్ అంతా న్యాయస్థానాల్లోనే సాగిపోయాయి. వివాదాస్పద ఎన్నికల అధికారిగా ప్రసిద్ధికెక్కిన నిమ్మగడ్డ రమేష్ కుమార్ మొదలు పెట్టిన యుద్ధం ఆయన పదవి నుంచి దిగి వెళ్ళిపోయినా కొనసాగుతుండటం విశేషం. ఎపి లోని జడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికలకు 2020 లో నిమ్మగడ్డ రమేష్ కుమార్ నోటిఫికేషన్ ఇచ్చారు. అప్పుడే చాలా ప్రాంతాల్లో ఏకగ్రీవాలు జరగడం కరోనా ప్రభావంతో ఆయన వాయిదా వేయడం జరిగిపోయాయి.

ఎన్నికలు నిర్వహించినా …?

నిమ్మగడ్డ రమేష్ కుమార్ పదవి నుంచి దిగేముందు చిత్రంగా ఆగిపోయిన ఎన్నికలను పూర్తి చేయడం వదిలి పెట్టి స్థానిక ఎన్నికలకు పచ్చజెండా ఊపారు. ఆ ఎన్నికల్లో వైసిపి స్వీప్ చేసింది. ఇక జడ్పీటీసీ, ఎంపిటిసి ఎన్నికలు నిర్వహించడానికి సమయం లేదంటూ చేతులు ఎత్తేసి ఆయన పదవి నుంచి దిగిపోయారు. ఆ తరువాత నిమ్మగడ్డ రమేష్ కుమార్ స్థానంలో బాధ్యతలు చేపట్టిన నీలం సాహ్ని ఈ ఏడాది ఏప్రిల్ 1 న నోటిఫికేషన్ ఇచ్చి 8 వతేదీన ఎన్నికలు పూర్తి చేశారు. ఈ ఎన్నికల ఫలితాలకు హై కోర్టు సింగల్ జడ్జి బ్రేక్ వేశారు. సుప్రీం కోర్టు గైడ్ లైన్స్ అనుసరించలేదన్న విపక్షాల వాదనతో ఏకీభవించి ఆ ఎన్నికల ప్రక్రియ రద్దు చేసింది. దాంతో మరింత గందరగోళానికి తెరలేచింది.

తాజాగా డివిజన్ బెంచ్ స్టే తో …

సింగల్ బెంచ్ ఇచ్చిన తీర్పును నిలుపుదల చేస్తూ హై కోర్టు డివిజన్ బెంచ్ తాజాగా స్టే మంజూరు చేసింది. అయితే ఓట్ల లెక్కింపు కు నో చెబుతూ జులై 27 విచారణ జరిపిన తరువాత వ్యవహారంలో క్లారిటీ ఇస్తామని పేర్కొంది. ఇప్పటికే ఎన్నికల్లో ఏకగ్రీవం అయి కొందరు పోటీలో తలపడి ఫలితాలు తేలక ఎపి లోని జడ్పీటీసీ, ఎంపిటిసి అభ్యర్థులు త్రిశంకు స్వర్గంలో వేలాడుతున్నారు. దీనికి ఎండ్ కార్డు ఎప్పుడు పడుతుందా అని ఇప్పుడు అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. మరో పక్క డివిజన్ బెంచ్ తీర్పు తరువాత ఎన్నికల కమిషన్ వాదనతో కోర్టు ఏకీభవిస్తే సుప్రీం కోర్టు మెట్లను ప్రతివాదులు ఎక్కితే మాత్రం జీడిపాకం టివి సీరియల్ లాగా ఈ ఎపిసోడ్ మరింత సాగడం తప్పేలా లేదు.

Tags:    

Similar News