గాంధీ భవన్ నుంచే సెగ మొదలయిందిగా?
రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. దానిని ఎవరూ కాదనలేరు. గతంలో కంటే కాంగ్రెస్ పరిస్థితి తెలంగాణలో మెరుగుపడిందనే చెప్పాలి. అయితే [more]
;
రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. దానిని ఎవరూ కాదనలేరు. గతంలో కంటే కాంగ్రెస్ పరిస్థితి తెలంగాణలో మెరుగుపడిందనే చెప్పాలి. అయితే [more]
రేవంత్ రెడ్డి వచ్చిన తర్వాత తెలంగాణలో కాంగ్రెస్ లో జోష్ పెరిగింది. దానిని ఎవరూ కాదనలేరు. గతంలో కంటే కాంగ్రెస్ పరిస్థితి తెలంగాణలో మెరుగుపడిందనే చెప్పాలి. అయితే ఇదే సమయంలో ఈ పరిస్థితి కాంగ్రెస్ ను వచ్చే ఎన్నికల్లో గట్టెక్కించలేదన్నది కూడా అంతే వాస్తవం. గతంలో కంటే పుంజుకున్నా అధికారానికి వచ్చే స్థాయికి ఇంకా కాంగ్రెస్ చేరుకోలేదనే చెప్పాలి. అయితే కొంచెం సమిష్టిగా పనిచేస్తే అది సాధ్యమవుతుంది. కానీ కాంగ్రెస్ లో అది ఎప్పటికీ అసాధ్యమన్నది తాజా పరిస్థితులు అద్దం పడుతున్నాయి.
దూకుడుగా ఉంటారని….
రేవంత్ రెడ్డి దూకుడుగా ఉంటారనే పార్టీ అధిష్టానం ఆయనకు పీసీసీ చీఫ్ బాధ్యతలను అప్పగించింది. రెండేళ్ల పాటు రేవంత్ రెడ్డి ఈ పదవిలో ఉంటారు. అంటే వచ్చే ఎన్నికలకు కూడా రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ గానే ఉంటారు. రేవంత్ రెడ్డి దూకుడు చూపించాల్సింది ప్రత్యర్థి పార్టీలపైన. అయితే ఆయన సొంత పార్టీ నేతలపై దూకుడు చూపిస్తే అది బూమ్ రాంగ్ అవ్వక తప్పదు. ఇప్పుడు రేవంత్ రెడ్డి అదే సమస్యను ఎదుర్కొంటున్నారు.
ఆయన నిర్ణయాలను….
రేవంత్ రెడ్డి నిన్న గాక మొన్న పార్టీలోకి వచ్చారు. ఇది కాంగ్రెస్ నేతలందరూ అనే మాటే. అయినా ఆయనకు పదవి లభించింది కాబట్టి సహకరించాలనుకుంటుందని కొందరు మాత్రమే. కోమటిరెడ్డి వెంకటరెడ్డి వంటి నేతలు రేవంత్ రెడ్డి నాయకత్వాన్ని ససేమిరా అంగీకరించడం లేదు. ఆయన చెప్పినట్లే గాంధీ భవన్ కు ఇంతవరకూ అడుగుపెట్టలేదు. దీనికి తోడు రేవంత్ రెడ్డి నిర్ణయాలను కూడా కోమటిరెడ్డి లాంటి వాళ్లు తమకు అనుకూలంగా మలచుకుంటున్నారు. వైఎస్ సంస్మరణ సభకు వెళ్లవద్దంటూ రేవంత్ రెడ్డి ఆదేశించారు.
కలుపుకోకుండా వెళితే….?
అయితే ఆ సభకు పంతంగా వెళ్లి వచ్చిన కోమటిరెడ్డి వెంకటరెడ్డి రేవంత్ రెడ్డికి సూటి ప్రశ్నలే వేశారు. తాను కాంగ్రెస్ నేత వైఎస్ సంస్మరణ సభకు మాత్రమే వెళ్లానని, ఇతర నేతల్లాగా టీడీపీ అధినేత చంద్రబాబు వద్దకు వెళ్లి కాళ్లు మొక్కి రాలేదని చెప్పి రేవంత్ ను డైలమాలో పడేశారు. రేవంత్ రెడ్డి వర్గానికి చెందిన సీతక్క వెళ్లి చంద్రబాబును వెళ్లి కలవడాన్ని కోమటిరెడ్డి వెంకటరెడ్డి తప్పు పట్టారు. సీనియర్లను కలుపుకుని, వారిందరి అంగీకారంతోనే రేవంత్ రెడ్డి నిర్ణయాలను తీసుకోవాల్సి ఉంటుంది. లేకుంటే రేవంత్ రెడ్డికి రాజకీయంగా ఇబ్బందులు ఎదురయ్యేది గాంధీ భవన్ నుంచే.