బిగ్ టాస్క్ మామూలుగా లేదుగా?
రాజకీయాల్లో ఎదగాలంటే నాయకత్వ పటిమతో పాటు లక్ కూడా అవసరం. పదవులు వచ్చి పడటం కూడా అదృష్టమే అనుకోవాలి. సామాజిక సమీకరణాలు, ఆర్థిక పరిస్థితులు పదవులకు అడ్డంకిగా [more]
;
రాజకీయాల్లో ఎదగాలంటే నాయకత్వ పటిమతో పాటు లక్ కూడా అవసరం. పదవులు వచ్చి పడటం కూడా అదృష్టమే అనుకోవాలి. సామాజిక సమీకరణాలు, ఆర్థిక పరిస్థితులు పదవులకు అడ్డంకిగా [more]
రాజకీయాల్లో ఎదగాలంటే నాయకత్వ పటిమతో పాటు లక్ కూడా అవసరం. పదవులు వచ్చి పడటం కూడా అదృష్టమే అనుకోవాలి. సామాజిక సమీకరణాలు, ఆర్థిక పరిస్థితులు పదవులకు అడ్డంకిగా మారే అవకాశముంది. ఇప్పడు మనం మాట్లాడుకోబోయేది తెలంగాణ పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి గురించి. నిజానికి రేవంత్ రెడ్డికి ఇది సెకండ్ టాస్క్. ఈ టాస్క్ లో విజయం సాధించగలిగితేనే రేవంత్ రెడ్డి నాయకుడిగా ఎదుగుతారు. మరికొంతకాలం కొనసాగుతారు.
రాజకీయాల్లోకి వచ్చిన….
రేవంత్ రెడ్డి రాజకీయాల్లోకి వచ్చిన అనతికాలంలోనే ఎదగగలిగారు. పార్టీలు మారినా తెలుగుదేశం పార్టీలోకి వచ్చిన తర్వాతనే ఆయన దశ తిరిగింది. టీడీపీలో వివిధ పదవులతో పాటు రాష్ట్ర పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గా నియమితులయ్యారు. అయితే రాష్ట్ర విభజన జరగడంతో తెలంగాణలో టీడీపీకి ఆదరణ కరువయింది. 2014లో గెలిచిన ఎమ్మెల్యేలు సయితం అధికార పార్టీ వైపు వెళ్లారు. అంటే టీడీపీ తొలి టాస్క్ లో రేవంత్ రెడ్డి ఫెయిలయ్యారు. ఇక టీడీపీలో ఉంటే భవిష‌్యత్ లేదని భావించిన రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరారు.
కొద్ది నెలల కాలంలోనే…
రేవంత్ రెడ్డి కాంగ్రెస్ లో చేరిన కొద్ది నెలల కాలంలోనే పీసీీసీ చీఫ్ అయ్యారు. ఇప్పుడు వచ్చే ఎన్నికల్లో పార్టీని ముందుకు నడిపించడం రేవంత్ రెడ్డి ముందున్న బిగ్ టాస్క్. ఉప ఎన్నికలను పక్కన పెట్టినా సార్వత్రిక ఎన్నికల సమయానికి పార్టీని ఒక దారిలో పడేయాలి. దాదాపు ఏడేళ్ల నుంచి వరస ఓటములతో పార్టీ క్యాడర్ డల్ అయింది. వారందరిలో జోష్ నింపాలి. అంతేకాదు రేవంత్ రెడ్డి ఇప్పుడు పార్టీ పుంజుకునేందుకు, అధికార టీఆర్ఎస్ ను ఇరుకున పెట్టేందుకు కొత్త మార్గాన్ని ఎంచుకున్నారు.
అవినీతిపై ఫోకస్….
అధికార టీఆర్ఎస్ సంక్షేమ పథకాలను ఇబ్బడి ముబ్బడిగా అమలు చేస్తుంది. అందుకే రేవంత్ రెడ్డి ఫోకస్ ప్రభుత్వంలో జరిగే అవినీతిపై పెట్టారు. మంత్రుల అవినీతితో పాటు ప్రభుత్వంలో జరిగే అవినీతిని గట్టిగా రేవంత్ విన్పిస్తున్నారు. కోకాపేట, ఖానామెట్ భూముల్లో అవకతవకలు జరిగాయని రేవంత్ రెడ్డి ఆరోపిస్తున్నారు. సీబీఐకి కూడా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ నిర్ణయంతో 1500 కోట్లు నష్టపోయిందన్నారు. అస్మదీయులకు భూములను అప్పగించేందుకు ప్రభుత్వం అడ్డదారులు తొక్కిందని ఆరోపిస్తున్నారు. సంక్షేమ పథకాలను మరిపించేలా అవినీతిని ఫోకస్ చేయడం ద్వారా అధికార పార్టీని ఇబ్బంది పెట్టాలని రేవంత్ రెడ్డి భావిస్తున్నారు. మరి ఈ బిగ్ టాస్క్ లో రేవంత్ రెడ్డి సక్సెస్ అవుతారా? లేదా? అన్నది చూడాల్సి ఉంది.