Revnath reddy : హీటెక్కించారు.. బయటకు లాగారు
ఏడేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదు. వారిని పన్నెత్తి మాట అనే ధైర్యం కూడా ఎవరూ చేయలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా [more]
;
ఏడేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదు. వారిని పన్నెత్తి మాట అనే ధైర్యం కూడా ఎవరూ చేయలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా [more]
ఏడేళ్లుగా అధికారంలో ఉన్న టీఆర్ఎస్ పార్టీకి ఎదురు లేదు. వారిని పన్నెత్తి మాట అనే ధైర్యం కూడా ఎవరూ చేయలేదు. ముఖ్యమంత్రి కేసీఆర్ ఏ నిర్ణయం తీసుకున్నా దానికి ప్రతిగా కాంగ్రెస పార్టీ అభ్యంతరాలు వ్యక్తం చేసినా వ్యక్తిగత విషయాల జోలికి వెళ్లలేదు. కానీ పీసీసీ చీఫ్ గా రేవంత్ రెడ్డి నియామకం జరిగిన తర్వాత సీన్ ఛేంజ్ అయింది. వ్యక్తిగత విమర్శలకు రేవంత్ రెడ్డి దిగుతుండటంతో టీఆర్ఎస్ కూడా స్పందించాల్సి వస్తుంది. ప్రజల్లో తమకున్న ఇమేజ్ ను కాపాడుకునే ప్రయత్నం చేయాల్సి వస్తుంది.
ఎఫెన్స్ లో వెళుతూ..
రేవంత్ రెడ్డి సహజంగానే దూకుడుగా ఉంటారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి మాదిరి రేవంత్ రెడ్డి జెంటిల్మెన్ గేమ్ ఆడరు. ఆయనంతా ఎఫెన్స్ లో వెళతారు. కేసీఆర్ తాగుబోతులకు బ్రాండ్ అంబాసిడర్ అని, కేటీఆర్ డ్రగ్స్ కు అంబాసిడర్ అని రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు తెలంగాణ రాజకీయాల్లో కాక రేపుతున్నాయి. ఇందులో నిజం లేకపోయినా ప్రజల్లోకి బలంగా వెళితే పలుచన అవుతామని కేటీఆర్ స్పందించక తప్పలేదు.
కల్వకుంట్ల కుటుంబంపైనే…
ఈ ఏడేళ్లలో కేటీఆర్ కాంగ్రెస్ విమర్శలకు పెద్దగా స్పందించలేదు. సహచర మంత్రుల చేతనే విమర్శలకు సమాధానం చెప్పిస్తూ వస్తున్నారు. కాంగ్రెస్ చేసే ప్రతి విమర్శను తిప్పి కొట్టాల్సిన అవసరం లేదని, వారికి బలం లేదని కేటీఆర్ అనేక సభల్లో చెప్పడం చూశాం. కానీ ఇప్పుడు అలా లేదు. రేవంత్ రెడ్డి నేరుగా తమపైనా, తమ కుటుంబ సభ్యులపైనా విమర్శలు చేస్తున్నారు. అవినీతి ఆరోపణలు మాత్రమే కాకుండా డ్రగ్స్, మద్యం వంటి ఆరోపణలు చేస్తుండటం కేటీఆర్ కు చికాకు కల్గిస్తుంది.
అందుకే రియక్షన్…..
అందుకే రేవంత్ రెడ్డి చేసే ప్రతి వ్యాఖ్యకు కేటీఆర్ రియాక్ట్ అవ్వాల్సి వస్తుంది. ఇది ఒకరకంగా రేవంత్ రెడ్డి విజయమనే చెప్పాలి. ఆరోపణల్లో నిజానిజాలు ఎంత అనేది పక్కన పెడితే కేటీఆర్ ను నేరుగా వివాదాల్లోకి లాగి బద్నాం చేయడమే రేవంత్ రెడ్డి లక్ష్యంగా కన్పిస్తుంది. అందుకే తెలంగాణ రాజకీయాల్లో సవాళ్ల పర్వం మొదలయింది. ఈ సవాళ్లకు కన్ క్లూజన్ రాదని అందరికీ తెలిసినా, మొత్తానికి రేవంత్ పాలిటిక్స్ ను హీటెక్కించారు.