Revanth reddy : అదే జరిగితే యాభై శాతం సక్సెస్ అయినట్లేనట
వచ్చే ఎన్నికల్లో గెలుపోటములు పక్కన పెడితే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవిని దక్కించుకున్నాక తన ఖాతాలో తొలి ప్లస్ పాయింట్ ను జమ చేసుకున్నారు. కాంగ్రెస్ [more]
;
వచ్చే ఎన్నికల్లో గెలుపోటములు పక్కన పెడితే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవిని దక్కించుకున్నాక తన ఖాతాలో తొలి ప్లస్ పాయింట్ ను జమ చేసుకున్నారు. కాంగ్రెస్ [more]
వచ్చే ఎన్నికల్లో గెలుపోటములు పక్కన పెడితే రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ పదవిని దక్కించుకున్నాక తన ఖాతాలో తొలి ప్లస్ పాయింట్ ను జమ చేసుకున్నారు. కాంగ్రెస్ పార్టీని ఏకం చేయాలన్న విషయాన్ని పక్కన పెడితే తొలుత కేసీఆర్ వ్యతిరేకులందరీని ఒకే వేదికపై తీసుకురావాలన్న రేవంత్ రెడ్డి ప్రయత్నం సక్సెస్ అవుతున్నట్లే కన్పిస్తుంది. కోదండరామ్, వామపక్ష పార్టీలు కాంగ్రెస్ పట్ల అనుకూల ధోరణని వ్యవహరిచండం ఇందుకు ఉదాహరణ.
దూరమైన వామపక్షాలను…
2018 ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి పోటీ చేసినా తర్వాత వామపక్ష పార్టీలు కాంగ్రెస్ కు దూరమయ్యాయి. తర్వాత జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లోనూ విడిగా పోటీ చేశాయి. నాగార్జున సాగర్ ఉప ఎన్నికల్లో అయితే కమ్యునిస్టు పార్టీలలో ఒకైటైన సీపీఐ ఏకంగా టీఆర్ఎస్ కు మద్దతు తెలిపింది. సీపీఎం కూడా మద్దతు విషయాన్ని స్థానిక నాయకత్వానికే వదిలేసింది. ఇక అనేక కార్యక్రమాల్లో వామపక్షాలు కాంగ్రెస్ తో కలసి నడవలేదు.
హుజూరాబాద్ ఎన్నికలో….
అయితే ఇప్పుడిప్పుడే బీజేపీకి వ్యతిరేకంగా జరుగుతున్న అనేక కార్యక్రమాల్లో కాంగ్రెస్ వెంట నడిచేందుకు కమ్యునిస్టు పార్టీలు ముందుకు వస్తున్నాయి. హుజూరాబాద్ ఉప ఎన్నిక ముందు ఈ పరిణామాలు కాంగ్రెస్ కు అనుకూలించేవే. హుజూరాబాద్ లో కమ్యునిస్టు పార్టీలు పోటీకి దింపకుండా రేవంత్ రెడ్డి మంతనాలు సాగిస్తున్నారు. వచ్చే సాధారణ ఎన్నికలలో కలసి వెళదామని, హుజూూరాబాద్ లో పోటీ చేయకుండా కాంగ్రెస్ కు మద్దతివ్వాలని కోరుతున్నారు.
పోటీకి దిగకపోతే….?
బీజేపీ కేంద్రంలో తీసుకుంటున్న నిర్ణయాలకు టీఆర్ఎస్ మద్దతిస్తుండటంతో కమ్యునిస్టు పార్టీలు కూడా కాంగ్రెస్ వైపు చూస్తున్నాయి. ఇటీవల భారత్ బంద్ సందర్భంగా ఏపీలో అధికార వైసీపీ బంద్ కు మద్దతిచ్చినా ఇక్కడ ఇవ్వకపోవడాన్ని వామపక్ష పార్టీలు తప్పుపడుతున్నాయి. హుజూరాబాద్ లో వామపక్ష పార్టీలు బరిలోకి తమ అభ్యర్థులను బరిలోకి దించకపోతే రేవంత్ రెడ్డి చాలా వరకూ సక్సెస్ అయినట్లే చెప్పుకోవాలి.