Congress : రేవంత్ ఘర్ వాపసీ మొదలు…?

తెలంగాణ కాంగ్రెస్ లో ఆశలు చిగురిస్తున్నాయి. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక కొంత పార్టీలో జోష్ మొదలయింది. దీంతో అనేక మంది నేతలు తిరిగి పార్టీ [more]

;

Update: 2021-10-24 11:00 GMT

తెలంగాణ కాంగ్రెస్ లో ఆశలు చిగురిస్తున్నాయి. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయ్యాక కొంత పార్టీలో జోష్ మొదలయింది. దీంతో అనేక మంది నేతలు తిరిగి పార్టీ వైపు వచ్చేందుకు మొగ్గు చూపుతున్నారు. కాంగ్రెస్ ఘర్ వాపసీ కార్యక్రమాన్ని ప్రారంభించనుంది. గతంలో అనేక కారణాలతో పార్టీని వీడిపోయిన నేతలను తిరిగి రప్పించేందుకు రేవంత్ రెడ్డి సిద్ధమవుతున్నారు. నేతలు రాక ప్రారంభమయితే పార్టీకి ఎన్నికలకు ముందు హైప్ వస్తుందని భావిస్తున్నారు.

పాదయాత్రకు ముందే….

వచ్చే ఏడాది రేవంత్ రెడ్డి తెలంగాణ వ్యాప్తంగా పాదయాత్ర చేయాలని నిర్ణయించారు. ఈ పాదయాత్ర కంటే ముందుగానే నేతలను పార్టీలోకి చేర్చుకోవాలని డిసైడ్ అయ్యారు. రేవంత్ రెడ్డి స్వయంగా వెళ్లి నేతలను కలవనున్నారు. హుజూరాబాద్ ఉప ఎన్నిక పూర్తయిన తర్వాత రేవంత్ రెడ్డి మాజీ కాంగ్రెస్ నేతల ఇళ్లకు వెళ్లనున్నారని తెలిసింది. ఇప్పటికే రేవంత్ రెడ్డి మాజీ పీసీసీ అధ్యక్షుడు ధర్మపూరి శ్రీనివాస్ ను కలిశారు.

హైకమాండ్ అంగీకారంతోనే….

అదే తరహాలో వివిధ జిల్లాల్లో అనేక మంది నేతలున్నారు. వారు కొందరు అధికార పార్టీల్లో పదవులు లేకుండా ఉన్నారు. అదే సమయంలో కొందరు బీజేపీలోకి కూడా వెళ్లారు. వారందరినీ స్వయంగా కలసి పార్టీలోకి ఆహ్వానించాలని రేవంత్ రెడ్డి నిర్ణయించారని తెలిసింది. ఈ మేరకు పార్టీ అధినాయకత్వానికి లేఖ రాసినట్లు చెబుతున్నారు. పార్టీ హైకమాండ్ నిర్ణయం మేరకు నేతల చేరిక ఉంటుందని చెబుతున్నారు.

హైదరాబాద్ లో నేతలు…?

కొన్ని జిల్లాల్లో కాంగ్రెస్ కు నాయకత్వ సమస్యం ఉంది. నియోజకవర్గాల్లో కొన్ని చోట్ల సరైన నేత లేకపోవడం కూడా ఎన్నికల సమయానికి ఇబ్బందికరంగా మారనుంది. దీంతో రేవంత్ రెడ్డి పాత నేతలందరినీ తిరిగి కాంగ్రెస్ గూటికి రప్పించే యోచనలో ఉన్నారు. ముఖ్యంగా హైదరాబాద్ నగరంలో అన్ని నియోజకవర్గాల్లో నాయకత్వ సమస్య ఉంది. జీహెచ్ఎంసీ ఎన్నికల ఫలితాలే ఇందుకు ఉదాహరణ. అందుకే హైదరాబాద్ సిటీలో నియోజకవర్గాల వారీగా మాజీ నేతలను కలవాలన్నది రేవంత్ రెడ్డి ఉద్దేశ్యంగా ఉంది. మరి వారు ఎలా స్పందిస్తారో చూడాలి.

Tags:    

Similar News