హ్యాట్రిక్ విజయం అసాధ్యం… కారణాలివేనట
ఆర్కే రోజా సొంత పార్టీలోని శత్రువులతోనే ఇబ్బందులు పడుతన్నారు. నగరి నియోజకవర్గంలో రోజాకు వ్యతిరేకంగా ఉన్న వైసీపీ నేతలు బాగానే స్ట్రాంగ్ అయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్న రోజాను [more]
ఆర్కే రోజా సొంత పార్టీలోని శత్రువులతోనే ఇబ్బందులు పడుతన్నారు. నగరి నియోజకవర్గంలో రోజాకు వ్యతిరేకంగా ఉన్న వైసీపీ నేతలు బాగానే స్ట్రాంగ్ అయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్న రోజాను [more]
ఆర్కే రోజా సొంత పార్టీలోని శత్రువులతోనే ఇబ్బందులు పడుతన్నారు. నగరి నియోజకవర్గంలో రోజాకు వ్యతిరేకంగా ఉన్న వైసీపీ నేతలు బాగానే స్ట్రాంగ్ అయ్యారు. ఎమ్మెల్యేగా ఉన్న రోజాను కాదని వారు వ్యవహరిస్తున్న తీరు ఇప్పుడు పార్టీలోనూ చర్చనీయాంశంగా మారింది. కొందరు కావాలనే తనకు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని ఆర్కే రోజా పదే పదే ఆరోపిస్తున్నా, అధిష్టానానికి ఫిర్యాదులు చేస్తున్నా ఫలితం మాత్రం శూన్యమనే చెప్పాలి.
రెండుసార్లు విజయం….
ఆర్కే రోజాను నగరి నియోజకవర్గాన్ని తన కంచుకోటగా మార్చుకున్నారు. 2014, 2019 ఎన్నికల్లో ఆర్కే రోజా వరస గెలుపులతో తనకంటూ పార్టీలోనూ, నగరిలోనూ ఒక ప్రత్యేక ఇమేజ్ ను ఏర్పరచుకున్నారు. తెలుగుదేశం పార్టీ కూడా నగరి నియోజవర్గంలో బలంగా ఉంది. గాలి ముద్దు కృష్ణమ నాయుడు మృతి తర్వాత బలహీనం అవుతుందనుకున్నా తిరిగి టీడీపీ నగరిలో పుంజుకుంటుంది. కానీ టీడీపీ కంటే ఆర్కే రోజాకు సొంత పార్టీ నేతలతోనే ఇబ్బందిగా మారింది.
పార్టీలోని వ్యతిరేక వర్గం….
సొంత పార్టీలోని ఒక వర్గం ఆర్కే రోజాకు వ్యతిరేకంగా పనిచేస్తుంది. ఈ వర్గానికి మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆశీస్సులున్నాయన్న ప్రచారం ఉంది. తన వ్యతిరేకవర్గానికి పదవులు దక్కకుండా అడ్డుకోవడంలోనూ ఆర్కే రోజా విఫలమయ్యారు. దీనిపై నేరుగా జగన్ కే ఆర్కే రోజా పలుమార్లు ఫిర్యాదు చేశారు. సర్దుకుపోవాలని చెప్పడంతో కొంతకాలం నుంచి రోజా మౌనంగా ఉంటున్నారు. కేవలం మంత్రి వర్గ విస్తరణ ఉంటుందన్న ఏకైక కారణంతోనే రోజా మౌనం పాటిస్తున్నారన్నది వాస్తవం.
రానున్న ఎన్నికల్లోనూ…..
స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ఆర్కే రోజాకు వ్యతిరేకంగా పార్టీలోని ఒకవర్గం బలంగా పనిచేసింది. రెబల్స్ ను బరిలోకి దించి ఆమెకు తలనొప్పులు తెచ్చింది. టీడీపీ సంగతి పక్కన పెడితే ఆర్కే రోజాకు వచ్చే ఎన్నికల్లో సొంత పార్టీ నేతలే శత్రువులుగా మారే అవకాశముంది. హ్యాట్రిక్ విజయాన్ని అందుకుందామనుకుంటున్న రోజాకు సొంత పార్టీ నేతలే షాక్ ఇచ్చే అవకాశముంది. దీంతో నగరి నియోజవర్గంలో టీడీపీ రోజురోజుకూ పుంజుకుంటుంది. మరి ఆర్క్ రోజా హ్యాట్రిక్ ఆశలు నెరవేరతాయా? లేదా? అన్నది చూడాలి.