సజ్జల ఎఫెక్ట్.. సీఎంవో వైపు వెళ్లని.. ఆ మంత్రి
సీఎం జగన్ రాజకీయ సలహాదారు… వైసీపీలో కీలక నాయకుడు.. సజ్జల రామకృష్ణారెడ్డి హవా ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలోనూ, వైసీపీలోనూ ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జగన్ సీఎం [more]
సీఎం జగన్ రాజకీయ సలహాదారు… వైసీపీలో కీలక నాయకుడు.. సజ్జల రామకృష్ణారెడ్డి హవా ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలోనూ, వైసీపీలోనూ ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జగన్ సీఎం [more]
సీఎం జగన్ రాజకీయ సలహాదారు… వైసీపీలో కీలక నాయకుడు.. సజ్జల రామకృష్ణారెడ్డి హవా ఇప్పుడు ఏపీ ప్రభుత్వంలోనూ, వైసీపీలోనూ ఎంతలా ఉందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. జగన్ సీఎం అయిన వెంటనే అంతకు ముందు ఏడెనిమిదేళ్లుగా జగన్‌కు రైట్ హ్యాండ్లుగా ఉన్నోళ్లు, 2014లో గెలిచి పార్టీ కోసం ఎంతో కష్టపడిన వాళ్లంతా తెరమరుగు అవుతున్నారు. ఇప్పుడు ఉత్తరాంధ్ర లాంటి చోట్ల మినహా ఎక్కడ చూసినా సజ్జల పేరే వినిపిస్తోంది. ఆయన దూకుడుపై సొంత పార్టీ నేతల్లోనే తీవ్రమైన అసహనాలు, అసంతృప్తులు పెరిగిపోతున్నా ఆయనకు వ్యతిరేకంగా వెళ్లే ధైర్యం, ఫిర్యాదు చేసే సాహసం ఎవ్వరూ చేసే పరిస్థితి లేదు.
అభివృద్ధి పనుల విషయంలో….
అయితే ఇప్పుడు సజ్జల రామకృష్ణారెడ్డి కారణంగా ఓ మం త్రి సీఎంవో ముఖం చేడడం లేదని ప్రచారం జరుగుతోంది! ముఖ్యమంత్రి కార్యాలయం అంటే.. ప్రతి మంత్రికీ నిత్యం ఏదో ఒక పని ఉంటుంది. వారు నిర్వహించే శాఖల విషయంలోను, వారు చేసే కార్యక్రమాల విషయంలోనూ సీఎంవోతో చర్చిస్తూ.. వారు చెప్పినట్టు కార్యక్రమాలు నిర్వహించడం అనేది మనకు కనిపించే ప్రధాన విషయం. అయితే.. తాజా పరిణామంలో ఓ మంత్రి వర్యులు నేరుగా సీఎంవో కి వెళ్లడం మానేశారని అంటున్నారు. దీనికి అనేక కారణాలు కూడా ఉన్నాయని టాక్.
కొందరు సర్దుకుపోతున్నా….
సీఎం రాజకీయ సలహాదారు హోదాలో సజ్జల రామకృష్ణారెడ్డి.. సీఎంవోకు వచ్చే వారిలో కొందరిని ప్రశ్నించడం.. వారు ఏ కార్యక్రమాలపై అక్కడకు వచ్చారో తెలుసుకు ని.. అదెందుకు.. ఇదెందుకు.. అని ప్రశ్నిస్తుండడం కామన్‌గా మారిపోయింది. దీంతో కొందరు మంత్రులు సర్దుకు పోతున్నా.. మరికొందరు మాత్రం హర్ట్ అవుతున్నారు. ఆయన ఉన్నది సీఎం జగన్‌కు సలహాలు ఇవ్వడానికి కానీ.. మాకు కాదు.. అని ఇటీవల చిత్తూరుకు చెందిన సీనియర్ మంత్రి ఒకరు ఆఫ్‌ది రికార్డుగా కామెంట్ చేయడాన్ని బట్టి మంత్రుల విషయంలో సజ్జల రామకృష్ణారెడ్డి తన వైఖరి ప్రదర్శిస్తున్నారని తెలుస్తోంది.
అప్పటి నుంచే…..
ఇలాగే.. పశ్చిమ గోదావరి జిల్లాకు చెందిన ఓ మంత్రి విషయంలోనూ సజ్జల రామకృష్ణారెడ్డి ఇలానే ప్రశ్నలు కురిపించారని తెలుస్తోంది. శాఖాపరమైన విషయాలను ఆయన ప్రశ్నించడంతోపాటు.. క్షేత్రస్థాయిలో పర్యటనలు పెంచాల్సిన అసవరం ఉందని అభిప్రాయపడినట్టు తెలుస్తోంది. దీంతో ఆ మంత్రి హర్టయి ఈ విషయాన్ని సహచర మంత్రుల వద్ద చెప్పారు. దీంతో వారంతా.. మేం కూడా బాధితులమే.. మాకు మాత్రం టార్చర్ తప్పుతోందా ? అని ప్రశ్నించారట. దీంతో సదరు మంత్రి చిన్నబుచ్చుకుని.. ఇక, అప్పటి నుంచి సీఎంవో వైపు రావడమే మానేశారని అంటున్నారు. మొత్తానికి ఈ పరిస్థితి ఎటు దారితీస్తుందో చూడాలి.