ఈ మంత్రికి పెద్ద పీకులాటే… వదిలించుకునేది ఎలాగో?

ఏపీ మంత్రి శంకర నారాయణ తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ నేతలు ఆయనపై విమర్శలు చేస్తుండటం విశేషం. మంత్రి శంకరనారాయణ అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గానికి [more]

Update: 2020-09-30 06:30 GMT

ఏపీ మంత్రి శంకర నారాయణ తీవ్ర అసమ్మతిని ఎదుర్కొంటున్నారు. సొంత పార్టీ నేతలు ఆయనపై విమర్శలు చేస్తుండటం విశేషం. మంత్రి శంకరనారాయణ అనంతపురం జిల్లా పెనుకొండ నియోజకవర్గానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనా బీసీ కోటాలో శంకరనారాయణకు మంత్రిపదవి దక్కింది. అనంతపురం జిల్లాలో ఎంతోమంది సీనియర్లు ఉన్నా, పార్టీ కోసం ఆర్థికంగా నష్టపోయి కష్టపడి పనిచేసిన నేతలున్నా జగన్ మాత్రం తొలి విడతలోనే శంకరనారాయణకు తన కేబినెట్ లో చోటు కల్పించారు.

రెండు వర్గాలుగా…..

అయితే గతకొంతకాలంటా అక్కడ వైసీపీ నేత గంపల రమణారెడ్డికి, శంకరనారాయణకు పొసగడం లేదు. ఎన్నికల సమయంలో గంపల రమణారెడ్డి పార్టీలో యాక్టివ్ గా ఉండటంతో నియోజకవర్గంలో తన పెత్తనం కూడా ఉంటుందని గంపల రమణారెడ్డి భావించారు. ఈ నేపథ్యంలో మంత్రి శంకరనారాయణ తనను పట్టించుకోకపోవడంతో రమణారెడ్డి వేరు కుంపటి పెట్టుకున్నారు. ప్రధాన సామాజికవర్గం నేతలతో కలిసి మంత్రికి వ్యతిరేకంగా గ్రూపు కట్టారు. మంత్రి శంకరనారాయణ నాన్ లోకల్ అంటూ కొత్త నినాదాన్ని కూడా తీసుకువచ్చారు.

మంత్రి సోదరులపై….

మంత్రి శంకరనారాయణ ఇటీవల నియోజకవర్గానికి వచ్చినప్పుడు రైతులు ఆయనను నిలదీశారు. సాగునీటి కోసం డిమాండ్ చేశారు. దీని వెనక కూడా గంపల రమణారెడ్డి ఉన్నట్లు శంకరనారాయణ అనుమానిస్తున్నారు. దీంతో పాటు తన సోదరులను టార్గెట్ చేసి మాట్లాడటాన్ని మంత్రి శంకరనారాయణ సహించ లేకపోతున్నారు. మంత్రి శంకరనారాయణ సోదరులు నియోజకవర్గంలో చక్రం తిప్పుతున్నారు. వారు చెప్పినట్లే అధికారులు నడుచుకుంటున్నారు.

ఎమ్మెల్యేలు వెనకుండి…..

పనులు కూడా మంత్రి శంకరనారాయణ సోదరులు తమకు ఇష్టం వచ్చిన వారికి అప్పగించడాన్ని కూడా గంపల రమణారెడ్డి వర్గం అభ్యంతరం వ్యక్తం చెబుతోంది. దీంతో మంత్రి సోదరులుపై నేరుగా అవినీతి ఆరోపణలు చేస్తున్నారు. దీంతో మంత్రికి వ్యతిరేకంగా ఉన్న జిల్లా ఎమ్మెల్యేలను గంపల రమణారెడ్డి కలుస్తున్నారు. కొందరు ఎమ్మెల్యేలు మంత్రి శంకరనారాయణకు వ్యతిరేకంగా రమణారెడ్డి వర్గాన్ని వెనకుండి ప్రోత్సహిస్తున్నారు. దీంతో పెనుకొండ నియోజకవర్గం వైసీపీలో మంత్రి వర్సెస్ వైసీపీ నేతలు అన్నట్లు పార్టీ పరిస్థితి తయారయిందనే చెప్పాలి.

Tags:    

Similar News