ఈ మంత్రికి భవిష్యత్ అస్సలు కన్పించడం లేదే?
అనంతపురం జిల్లాలో అధికార వైసీపీలో నియోజకవర్గానికో గొడవ రేగుతోంది. ఇప్పటికే మంత్రి శంకర్ నారాయణను జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఆయనకు మంత్రి పదవి [more]
;
అనంతపురం జిల్లాలో అధికార వైసీపీలో నియోజకవర్గానికో గొడవ రేగుతోంది. ఇప్పటికే మంత్రి శంకర్ నారాయణను జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఆయనకు మంత్రి పదవి [more]
అనంతపురం జిల్లాలో అధికార వైసీపీలో నియోజకవర్గానికో గొడవ రేగుతోంది. ఇప్పటికే మంత్రి శంకర్ నారాయణను జిల్లాలో పలువురు ఎమ్మెల్యేలు టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఆయనకు మంత్రి పదవి రావడం జిల్లాలో చాలా మంది ఎమ్మెల్యేలకు, సీనియర్ నేతలకు నచ్చలేదు. ఇక ఇద్దరు ఎంపీలు ఉండగా.. వీరికి చాలా మంది ఎమ్మెల్యేలకు పడడం లేదు. జిల్లాలో ఇప్పటికే హిందూపురం ఎంపీ గోరంట్ల మాధవ్‌కు హిందూపురం ఇన్‌చార్జ్‌గా ఉన్న ఎమ్మెల్సీ ఇక్బాల్‌కు పడడం లేదు. మాధవ్ హిందూపురంపై ప్రత్యేకంగా కాన్‌సంట్రేషన్ చేయడంతో పాటు తన వర్గాన్ని ఎంకరేజ్ చేయడంతో ఇక్కడ గ్రూపుల వార్ స్టార్ట్ అయ్యింది.
విభేదాలు తీవ్రమయి…..
కదిరిలోనూ ఎంపీ వర్సెస్ ఎమ్మెల్యే సిద్దారెడ్డి మధ్య సఖ్యత లేదు. పుట్టపర్తి లాంటి చోట్ల కూడా ఇదే పరిస్థితి ఉంది. ఇక మంత్రి శంకర్ నారాయణకు, అనంత ఎమ్మెల్యే అనంత వెంకట్రామిరెడ్డికి పచ్చ గడ్డి వేస్తేనే భగ్గుమంటోంది. మంత్రిని ఏ ఎమ్మెల్యే కూడా తమకు తెలియకుండా తమ నియోజకవర్గంలోకి ఎంటర్ కానివ్వడం లేదు. ఇక అనంత ఎంపీ రంగయ్యకు కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషా శ్రీ చరణ్‌కు మధ్య కూడా రగడ స్టార్ట్ అయ్యింది. ఎమ్మెల్యేకు తెలియకుండా ఆమె వ్యతిరేక వర్గం నిర్వహించిన ఒకటి రెండు కార్యక్రమాలకు ఎమ్మెల్యే రంగయ్య రావడంతో వీరి మధ్య గొడవలు భగ్గుమంటున్నాయి.
మంత్రికి వ్యతిరేకంగా…..
చివరకు ఎమ్మెల్యే వర్గం కడుతోన్న ఫ్లెక్సీల్లో ఎంపీ రంగయ్య ఫొటో కూడా ఉండడం లేదు. ఈ వివాదాలు ఇలా ఉండగానే ఇప్పుడు మంత్రి శంకర్ నారాయణకు రాఫ్తాడు ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాశ్‌రెడ్డికి మధ్య కొత్త వార్ స్టార్ట్ అయ్యింది. పలు అంశాలు ఈ ఇద్దరి మధ్య గ్యాప్ బాగా పెంచేశాయంటున్నారు. హింద్రీ నీవా కాలువ నుంచి పుష్కలంగా నీరు వెళుతున్నా తన నియోజకవర్గానికి రాకుండా ప్రకాశ్‌రెడ్డి రాఫ్తాడుకు మళ్లించుకుంటున్నారని మంత్రి మండిపడుతున్నారు. మంత్రికి వ్యతిరేకంగా ప్రకాశ్ రెడ్డి పావులు కదుపుతున్నారన్న వార్తలు కూడా వస్తున్నాయి.
మంత్రి రేసులో ప్రకాశ్, అనంత…?
మరో పది నెలల్లో జరిగే మంత్రివర్గ ప్రక్షాళనలో శంకర్ నారాయణను పక్కన పెట్టేస్తారన్నది దాదాపు ఖాయమే అంటున్నారు. ఈ క్రమంలోనే జిల్లా నుంచి ప్రకాశ్ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి ఇద్దరూ కూడా రేసులో ఉన్నారు. ఈ క్రమంలోనే ఈ ఇద్దరు ఎమ్మెల్యేలు తమకు మంత్రి పదవి ఖాయమైందని… ఆధిపత్య రాజకీయాలకు తెరలేపడంతో పాటు మంత్రి శంకర్ నారాయణను ఇబ్బందులు పెడుతున్నారని అంటున్నారు. అసలే సౌమ్యుడు అయిన శంకర్ నారాయణ ఈ గ్రూపుల గోలతో వేగలేకపోతున్నారట. మరో ట్విస్ట్ ఏంటంటే పైకి మంత్రిని టార్గెట్ చేస్తోన్న ప్రకాశ్‌రెడ్డికి, అనంత వెంకట్రామిరెడ్డికి మధ్య కూడా కోల్డ్‌వార్ ఉందట. వచ్చే మంత్రి వర్గ ప్రక్షాళనలో బెర్త్‌పై కన్నేసిన ఈ ఇద్దరు నేతలు ఎవరికి వారే మంత్రి పదవి రావాలని తెరవెనక రాజకీయాలు మొదలు పెట్టేశారట. ఏదేమైనా అనంత వైసీపీలో గ్రూపుల గోల ఇప్పట్లో సమసిపోయేలా లేదు.