మంత్రి అయ్యావు సరే.. అయితే.. మాకేంటి?
ఏ నాయకుడికైనా సొంత సామాజిక వర్గం నుంచి మద్దతు చాలా అవసరం. పార్టీలతో సంబంధం లేకుండా నాయకులు తమ సామాజిక వర్గాలకు దగ్గరగా ఉంటారు. వారికి అనుకూలంగా [more]
ఏ నాయకుడికైనా సొంత సామాజిక వర్గం నుంచి మద్దతు చాలా అవసరం. పార్టీలతో సంబంధం లేకుండా నాయకులు తమ సామాజిక వర్గాలకు దగ్గరగా ఉంటారు. వారికి అనుకూలంగా [more]
ఏ నాయకుడికైనా సొంత సామాజిక వర్గం నుంచి మద్దతు చాలా అవసరం. పార్టీలతో సంబంధం లేకుండా నాయకులు తమ సామాజిక వర్గాలకు దగ్గరగా ఉంటారు. వారికి అనుకూలంగా ఉంటారు. వారి ఓటు బ్యాంకు కదలకుండా చూసుకుంటారు. సామాజిక వర్గంలో రాష్ట్ర వ్యాప్తంగా తానే హీరోగా ఉండాలని కోరుకుంటారు. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో మంత్రులు తమ సామాజిక వర్గంలో కీలక నేతలుగా ఎదగడంతో పాటు ఇతర నేతలు ఎవ్వరూ తమను దాటకుండా చూసుకుంటూ ఉంటారు. రేపు ఒకవేళ రాజకీయ వాతావరణం మారిపోయినా.. తమకు ఇబ్బంది లేకుండా పరిస్థితిని తమవైపు తిప్పుకొనే ప్రయత్నాలు చేస్తుంటారు. ఇది ఓటు బ్యాంకు రాజకీయంగా రాష్ట్రంలో కొన్నాళ్లుగా సాగుతూనే ఉంది.
56 కార్పొరేషన్లు….
అయితే ఏపీలో బీసీ సంక్షేమ శాఖ మంత్రి శంకర నారాయణ విషయంలో మాత్రం ఇది ఎదురు తిరుగుతోంది. బీసీ మంత్రిగా ఉన్నా.. తమను పట్టించుకోవడం లేదని అటు నియోజకవర్గంలోను, ఇటు రాష్ట్రంలోని బీసీ నాయకులు కూడా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. నిజానికి రాష్ట్ర ప్రభుత్వం గతంలో ఎన్నడూ లేని విధంగా బీసీలకు 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేసింది. భారీ సంఖ్యలో డైరెక్టర్లను కూడా నియమించింది. అయితే.. ఇక, మంత్రితో సంబంధం ఏంటని సహజంగానే ప్రశ్నలు వస్తాయి. కానీ,తమలో కొందరికి మాత్రమే పదవులు ఇచ్చారని మిగిలిన వారు అర్హులైనప్పటికీ.. మంత్రికి తెలిసి కూడా పక్కన పెట్టారని బీసీ వర్గాలు ఆరోపిస్తున్నాయి.
నిధులేవీ?
అదే సమయంలో కార్పొరేషన్లకు విధులు, నిధులు వచ్చేలా చేస్తానన్న మంత్రి వాటిని పట్టించుకోవడం లేదని అంటున్నారు. ఇక, 700లకు పైగా ఉన్న నామినేటెడ్ పోస్టుల విషయంలోనూ మంత్రికి సెగలు తగులు తున్నాయి. కనీసం సగానికి సగం పదవులు తమకు ఇచ్చేలా మంత్రి చూడాలని వారు కోరుతున్నారు. అదే సమయంలో కీలకమైన యూనివర్సిటీ వీసీ పోస్టులను కూడా తమకు దక్కకుండా కొందరు మంత్రులు అడ్డు పడుతున్నారని, ఈ విషయంలో జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. అయితే.. మంత్రి శంకర నారాయణ మాత్రం సైలెంట్‌గా ఉంటున్నారు. తాను ఇప్పుడు ఏమీ చేయలేనని.. ఏదైనా ఉంటే.. నేరుగా సీఎంతోనే చెప్పుకోవాలని సూచిస్తున్నారట.
మృదుస్వభావమే…..
సహజంగానే ఇది బీసీ వర్గాలకు ఆగ్రహం తెప్పిస్తోంది. కురుబ సామాజిక వర్గం నుంచి మంత్రిగా ఉన్నా శంకర నారాయణ ఆ వర్గానికి కూడా తన జిల్లాలో న్యాయం చేయలేకపోతున్నారట. ఆయన తీరుపై బీసీ వర్గాలు గుర్రుగా ఉన్నా ఆయన మృదుస్వభావమే ఆయనకు మైనస్‌గా మారిందన్నది వాస్తవం. జిల్లాలో రెడ్డి సామాజిక వర్గం ఎమ్మెల్యేలు, నేతలు ఆయన్ను లెక్కచేయని పరిస్థితి ఉండడంతో ఆయన యాక్టింగ్ మంత్రిగా మారిన పరిస్థితి.