పడి లేచాడు

శరద్ పవార్… మరాఠా యోధుడు. మొన్నటి వరకూ శరద్ పవార్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ తన ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి శరద్ పవార్ [more]

Update: 2019-10-27 17:30 GMT

శరద్ పవార్… మరాఠా యోధుడు. మొన్నటి వరకూ శరద్ పవార్ పని అయిపోయిందని అందరూ అనుకున్నారు. కానీ తన ఇమేజ్ ఏమాత్రం తగ్గలేదని మరోసారి శరద్ పవార్ నిరూపించారు. ప్రత్యర్థుల సయితం శరద్ పవార్ పోరాటపటిమను ప్రశంసిస్తున్నారు. చివరకు శివసేన అధికార పత్రిక సామ్నాలో సయితం శరద్ పవార్ మరాఠా యోధుడిగా పేర్కొనడం ఆయనకు మహారాష్ట్రలో ఉన్న పట్టును మరోసారి నిరూపించిందనే చెప్పాలి.

చరిత్ర సృష్టించి…..

కాంగ్రెస్ నుంచి విడిపోయి నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీని పెట్టిన శరద్ పవార్ 38ఏళ్లకే ముఖ్యమంత్రి పదవిని అధిష్టించి చరిత్ర సృష్టించారు. మరాఠా యోధుడిగా శరద్ పవార్ కు పేరుంది. ఆయనకు పశ్చిమ మహారాష్ట్రలో గట్టి పట్టుంది. 2014 అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా శరద్ పవార్ పోటీ చేశారు. అయినా 41 సీట్లు సాధించారు. కాంగ్రెస్ కు అప్పుడు ఎక్కువ స్థానాలు దక్కడంతో ప్రతిపక్ష హోదా దక్కలేదు.

కాంగ్రెస్ తో కలసి…..

అయితే ఈసారి శరద్ పవార్ ముందు నుంచే కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకున్నారు. లోక్ సభ ఎన్నికల్లో కలసి పోటీ చేసినా పెద్దగా ప్రభావం చూపలేదు. కేవలం నాలుగు లోక్ సభ స్థానాలు మాత్రమే దక్కాయి. ఇక శరద్ పవార్ పార్టీ ఫినిష్ అయిపోయిందనుకున్నారు. అయినా శరద్ పవార్ తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ తో కలసి పోటీ చేశారు. ఎన్సీపీ నుంచి బీజేపీ, శివసేనలకు గట్టి మద్దతుదారులు వెళ్లిపోయినా శరద్ పవార్ ఏమాత్రం జంకలేదు. పైగా తనకు ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ నోటీసులు దాఖలు చేయడాన్ని కూడా శరద్ పవార్ తన ప్రచారంలో బాగా వినియోగించుకున్నారు.

రికార్డు స్థాయిలో…..

ఇక తాజాగా జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్ కంటే ఎక్కువ స్థానాలను సాధించారు. ప్రచారంలో దాదాపు 60 బహిరంగ సభలో ప్రసంగించి తనకు వయసు అడ్డురాదని నిరూపించారు. ఫలితంగా 54 స్థానాల్లో శరద్ పవార్ పార్టీ ఎన్సీపీ అభ్యర్థులు విజయం సాధించారు. కాంగ్రెస్ కేవలం 44 స్థానాలకే పరిమితమయింది. అధికారంలోకి రాకపోయినా తాను కింగ్ మేకర్ ను భవిష్యత్తులో కాగలనని శరద్ పవార్ నిరూపించారు. ప్రతిపక్షానికే పరిమితమవుతానని ఆయన నిక్కచ్చిగా చెప్పడం రాజకీయ విశ్లేషకుల ప్రశంసలను సయితం అందుకుంది. అందుకే పవార్ ను తక్కువగా అంచనా వేసి చూడలేం.

Tags:    

Similar News