వారు వైసీపీకి దూరమవుతున్నారా ? దూరం చేస్తున్నారా ?
గడిచిన రెండు రోజులుగా వైసీపీలో ఒక వాదన బలంగా వినిపిస్తోంది. కింది స్థాయి నుంచి పై స్థాయి నేతల వరకు ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఎస్సీలు పార్టీకి [more]
;
గడిచిన రెండు రోజులుగా వైసీపీలో ఒక వాదన బలంగా వినిపిస్తోంది. కింది స్థాయి నుంచి పై స్థాయి నేతల వరకు ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఎస్సీలు పార్టీకి [more]
గడిచిన రెండు రోజులుగా వైసీపీలో ఒక వాదన బలంగా వినిపిస్తోంది. కింది స్థాయి నుంచి పై స్థాయి నేతల వరకు ఇదే విషయాన్ని చర్చించుకుంటున్నారు. ఎస్సీలు పార్టీకి దూరం అవుతున్నారా? అనేది హాట్ టాపిక్‌గా మారింది. అంబేడ్కర్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ సామాజిక వర్గాలు పెద్ద ఎత్తున ర్యాలీలు.. నిర్వహించాయి. ఈ క్రమంలో జగన్ పాలనపై కొందరు ఎస్సీ నాయకులు తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. అదే సమయంలో కొందరు చెప్పులతో కూడా కొట్టుకుని.. “ ఒక్క ఛాన్స్ ఇచ్చినందుకు మాకు మేమే శిక్షించుకుంటున్నాం “ అంటూ.. వ్యాఖ్యానించారు.
కొన్ని రోజులుగా….?
ఈ పరిణామాలు మీడియాలో పెద్ద ఎత్తున హైలెట్ అయ్యాయి. దీంతో వైసీపీలోని కీలక నాయకులు ఈ పరిణామాలపై దృష్టి పెట్టారు. అసలు క్షేత్రస్థాయిలో ఏం జరుగుతోంది ? ఎందుకు ఇలాంటి పరిణామాలు.. వ్యాఖ్యలు వస్తున్నాయి? అనే ఆలోచన చేస్తున్నారు. జగన్ ప్రభుత్వం ఏర్పడిన కొత్తలో సోషల్ మీడియాలో ఒక విషయం ప్రధానంగా చర్చకు వచ్చింది. జగన్ కనుక అధికారంలోకి వస్తే.. రెడ్డి రాజ్యం ఏర్పడుతుంది.. మిగిలిన సామాజిక వర్గాలకు ముఖ్యంగా ఎస్సీ, ఎస్టీలకు ప్రాధాన్యం ఉండదు.. అని ప్రచారం చేశారు. బహుశ దీనిని దృష్టిలో పెట్టుకునో.. ఏమో.. జగన్ ఈ వర్గాలకే ఎక్కువగా ప్రాధాన్యం ఇచ్చారు.
వారికే ప్రాధాన్యత ఇస్తున్నా…?
దీంతో అప్పట్లో రెడ్డి రాజ్యం వచ్చేస్తుంది.. అన్న కొన్ని మీడియా సంస్థల అధిపతులు, నాయకులు సైతం సైలెంట్ అయ్యారు. కానీ, ఇప్పుడు మాత్రం మళ్లీ ఎస్సీ వర్గాలు జగన్ సర్కారుపై నిప్పులు చెరుగుతున్న పరిస్థితి కనిపిస్తోంది. దీనికి రీజనేంటి? అనేది వైసీపీ నేతలను అంతర్మథనానికి గురి చేస్తోంది. సీఎం జగన్ ఏ కార్యక్రమం చేసినా.. ఎస్సీలను దృష్టిలో పెట్టుకునే చేస్తున్నారు. వారికి అనేక రూపాల్లో ఆర్థిక పథకాలు సైతం ప్రకటించి అమలు చేస్తున్నారు. ప్రభుత్వానికి రాబడి తగ్గినా.. ఎక్కడా వెనుకడుగు వేయకుండా.. ఆయన ముందుకు సాగుతున్నారు.
అన్నింటినీ ఇస్తున్నా..?
అయినప్పటికీ.. అమరావతి రాజధానిలోని దళితులు కావొచ్చు.. ఇతరత్రా ప్రాంతాల్లోని ఎస్సీ వర్గాలు కావొచ్చు.. ఇప్పుడు జగన్ పాలనపై విముఖత వ్యక్తం చేస్తున్నారు. మాకు విదేశీ విద్యారుణాలు ఇవ్వడం లేదని కొందరు అంటుంటే.. డప్పు కళాకారులకు ఇచ్చే పింఛన్లను ఎత్తేశారని మరికొందరు అంటున్నారు. వాస్తవానికి ఈ రెండు తప్ప.. జగన్ అన్నింటినీ అమలు చేస్తున్నారు.
కావాలనే చేస్తున్నారని…..
అదే సమయంలో ఎస్సీలకు ప్రభుత్వంలో వైసీపీలో ఎన్ని పదవులు వచ్చినా వారు చేసేదేం ఉండడం లేదు. అన్ని ఓ సామాజిక వర్గ నేతల కనుసన్నల్లోనే నడుస్తున్నాయన్న అసంతృప్తి చాలా మంది నేతల్లో ఉంది. ఈ మొత్తం పరిణామాలను గమనిస్తున్న వైసీపీ సీనియర్లు.. ఉద్దేశ పూర్వకంగానే తమ ప్రభుత్వాన్ని బద్నాం చేసేందుకు, ముఖ్యంగా తిరుపతి ఎన్నికల నేపథ్యంలోనే ఇలాంటి నిరసనలను కొందరు ప్రోత్సహిస్తున్నారని ఒక నిర్ణయానికి వచ్చారు. అయితే.. ఇది సెంటిమెంటుతో కూడుకున్న వ్యవహారం కావడంతో ఎటూ ఎవరినీ నిందించే పరిస్థితి లేకపోవడం గమనార్హం.