శిల్పా సెట్ చేసినట్లేనా? మరో అడుగు ఉందా?
నందికొట్కూరు పంచాయతీని శిల్పా చక్రపాణిరెడ్డి తేల్చేశారు. అయితే వన్ సైడ్ గా నిర్ణయం ఉండటంతో సహజంగానే మరో వర్గం అసంతృప్తికి లోనయింది. నందికొట్కూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ [more]
;
నందికొట్కూరు పంచాయతీని శిల్పా చక్రపాణిరెడ్డి తేల్చేశారు. అయితే వన్ సైడ్ గా నిర్ణయం ఉండటంతో సహజంగానే మరో వర్గం అసంతృప్తికి లోనయింది. నందికొట్కూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ [more]
నందికొట్కూరు పంచాయతీని శిల్పా చక్రపాణిరెడ్డి తేల్చేశారు. అయితే వన్ సైడ్ గా నిర్ణయం ఉండటంతో సహజంగానే మరో వర్గం అసంతృప్తికి లోనయింది. నందికొట్కూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ విషయంలో పార్టీ ఇన్ ఛార్జి సిద్ధార్థ రెడ్డి, ఎమ్మెల్యే ఆర్థర్ మధ్య విభేదాలు తలెత్తిన సంగతి తెలిసిందే. గత కొన్ని నెలలుగా వీరిద్దరి మధ్య గ్యాప్ ఉన్నప్పటికీ అధిష్టానం ఏమాత్రం సరిదిద్దే ప్రయత్నం చేయలేదు. అయితే నందికొట్కూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ పదవి ఎంపిక ఉండటంతో హైకమాండ్ రంగంలోకి దిగాల్సి వచ్చింది.
మార్కెట్ యార్డు ఛైర్మన్ గా….
నందికొట్కూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ గా పార్టీ ఇన్ ఛార్జిగా సిద్ధార్ధ రెడ్డి, ఎమ్మెల్యే ఆర్ధర్ లు వేర్వేరు పేర్లను ప్రకటించారు. అయితే ఈ విషయంలో జిల్లా ఇన్ ఛార్జి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ వన్ సైడ్ గా వ్యవహరిస్తున్నారంటూ ఎమ్మెల్యే ఆర్థర్ వర్గీయులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. అంతేకాకుండా అనిల్ ను జిల్లాలోకి అడుగుబెట్టనీయబోమంటూ వార్నింగ్ లు ఇచ్చే పరిస్థితికి వచ్చారు. దీంతో పార్టీ హైకమాండ్ అదే జిల్లాకు చెందిన సీనియర్ నేత శిల్పా చక్రపాణిరెడ్డికి రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చేందుకు పెద్దగా నియమించింది.
మధ్యవర్తిగా శిల్పా….
శిల్పా చక్రపాణిరెడ్డి గత కొద్ది రోజులుగా రెండు వర్గాల మధ్య సయోధ్య కుదిర్చే యత్నాలు చేస్తున్నారు. ఇటు ఎమ్మెల్యే ఆర్ధర్ కు కూడా పట్టుదలకు పోవద్దని చెప్పారు. సిద్ధార్ధరెడ్డికి కూడా ఎమ్మెల్యేలను తక్కువ చేసి చూడవద్దని నచ్చ చెప్పగలిగారు. అయితే ఉన్నట్లుండి నందికొట్కూరు మార్కెట్ యార్డు ఛైర్మన్ పదవిని అధిష్టానం భర్తీ చేసింది. పార్టీ ఇన్ ఛార్జి సిద్దార్థ రెడ్డి ఇచ్చిన పేరును ఖరారు చేసింది. చిన్న మల్లారెడ్డి హడావిడిగా ప్రమాణస్వీకారం కూడా చేశారు.
సెట్ అయినట్లేనా?
దీంతో అసంతృప్తికి గురైన ఆర్థర్ రాజీనామాకు సిద్ధపడ్డారంటూ వార్తలు వచ్చాయి. అయితే వెంటనే మళ్లీ శిల్పా చక్రపాణిరెడ్డి రంగంలోకి దిగి ఆర్ధర్ కు నచ్చ చెప్పారు. ఎమ్మెల్యేగా విజయం వెనక ఉన్న వారిని విస్మరించకూడదని, పట్టుదలకు పోతే రాజకీయంగా భవిష్యత్ ఉండదని హెచ్చిరిస్తూనే, జగన్ తో మీటింగ్ ఏర్పాటు చేసి సమస్యలు పరిష్కరించేందుకు కృషి చేస్తానని శిల్పా చక్రపాణిరెడ్డి హామీ ఇచ్చారు. దీంతో ఆర్థర్ చల్లబడిపోయారు. తాను జగన్ నిర్ణయానికి కట్టుబడి ఉంటానని చెప్పడంతో నందికొట్కూరు నాటకం ముగిసినట్లేనని చెప్పుకోవాలి.