Silpa : శిల్పా ఫ్యామిలీ సీన్ లో ముందుందా?

శిల్పా కుటుంబం ఈసారి మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. శిల్పా మోహన్ రెడ్డి రాజకీయంగా పక్కకు తప్పుకోవడంతో ఆయన సోదరుడు చక్రపాణి రెడ్డి ఈసారి విస్తరణలో [more]

Update: 2021-10-08 15:30 GMT

శిల్పా కుటుంబం ఈసారి మంత్రి పదవిపై ఎన్నో ఆశలు పెట్టుకుంది. శిల్పా మోహన్ రెడ్డి రాజకీయంగా పక్కకు తప్పుకోవడంతో ఆయన సోదరుడు చక్రపాణి రెడ్డి ఈసారి విస్తరణలో తనకు గ్యారంటీ అన్న నమ్మకంతో ఉన్నారు. ఇందుకు రెండు కారణాలు చెబుతున్నారు. తనకు మంత్రి పదవి ఇవ్వడం వల్ల పార్టీని ఇటు శ్రీశైలంతో పాటు నంద్యాల, ఆళ్లగడ్డలోనూ విజయపథంలో నడిపే అవకాశముందని చెబుతున్నారు.

టీడీపీ నుంచి ….

జగన్ కష్ట సమయంలో ఉన్నప్పుడు శిల్పా కుటుంబం వైసీపీలోకి వచ్చింది. అప్పటి వరకూ టీడీపీలో ఉన్నా 2017లో భూమా నాగిరెడ్డి టీడీపీలో చేరడంతో వెంటనే వైసీపీలోకి వచ్చారు. నాగిరెడ్డి మరణం తర్వాత జరిగిన ఉప ఎన్నికల్లో శిల్పా మోహన్ రెడ్డి వైసీపీ నుంచి పోటీ చేసి ఓటమి పాలయ్యారు. అదే సమయంలో ఇంకా ఐదేళ్లకు పైగానే ఉన్న తన ఎమ్మెల్సీ పదవిని తన సోదరుడి కోసం వదిలి శిల్పా చక్రపాణిరెడ్డి బయటకు వచ్చారు.

ఇద్దరే సీనియర్లు…

ఇప్పుడు ఒక రకంగా కర్నూలు జిల్లాలో కాటసాని రాంభూపాల్ రెడ్డి, శిల్పా కుటుంబమే వైసీపీలో సీనియర్లుగా ఉన్నారు. వీరిలో ఒకరికి ఖచ్చితంగా జగన్ పదవి ఇవ్వాల్సి ఉంటుంది. క్లీన్ స్వీప్ చేసిన జిల్లాల్లో జగన్ రెండు మంత్రి పదవులు కేటాయించారు. నెల్లూరు, విజయనగరం, కర్నూలు జిల్లాల్లో వైసీపీ గత ఎన్నికల్లో క్లీన్ స్వీప్ చేసినందుకు రెండు మంత్రి పదవులు ఇచ్చారు. కడప జిల్లా కూడా క్లీన్ స్వీప్ చేసింది. అయితే తాను ముఖ్యమంత్రిగా ఉండటంతో మరొకరికి మంత్రి పదవి ఇచ్చారు.

రెండు పదవులు ఇస్తే….?

ఈసారి వంద శాతం మంత్రివర్గాన్ని మారుస్తుండటంతో కర్నూలు జిల్లాకు రెండు పదవులు గ్యారంటీ అని అంటున్నారు. ఇందులో ఒకటి రెడ్డి సామాజికవర్గానికి ఒకటి ఖాయం. ఇందులో శిల్పా చక్రపాణి రెడ్డి పదవిని గట్టిగా ఆశిస్తున్నారు. కాటసాని రాంభూపాల్ రెడ్డి కూడా ఎన్నికలకు ముందు వైసీపీలో చేరిన వారే. దీంతో వీరిద్దరి మధ్యనే పోటీ నెలకొంది. మరి జగన్ చివరకు ఎవరి పేరు ఖరారు చేస్తారన్నది ఆసక్తికరంగా మారింది.

Tags:    

Similar News