ఈ ఎమ్మెల్యేలకే అలా ఎందుకు జరుగుతుంది?

పార్టీ ఏదైనా కావచ్చు. సింబల్ మారవచ్చు. కానీ ఆ ఎమ్మెల్యేల సీన్ మాత్రం మారడం లేదు. ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు చుక్కలు కన్పిస్తున్నాయి. అది ఏ ప్రాంతమైనా [more]

;

Update: 2020-11-21 05:00 GMT

పార్టీ ఏదైనా కావచ్చు. సింబల్ మారవచ్చు. కానీ ఆ ఎమ్మెల్యేల సీన్ మాత్రం మారడం లేదు. ఎస్సీ నియోజకవర్గ ఎమ్మెల్యేలకు చుక్కలు కన్పిస్తున్నాయి. అది ఏ ప్రాంతమైనా కావచ్చు. రాయలసీమ, ఉత్తరాంధ్ర, కోస్తా అనేది కాదు. అక్కడ ఉన్నది ఎస్సీ ఎమ్మెల్యే అయితే చాలు వారిపై విరుచుకుపడటానికి పార్టీ నేతలే సిద్ధంగా ఉంటారు. కొన్ని నియోజకవర్గాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు తాము ఎందుకు గెలిచామా? అన్న ఆవేదన చెందుతున్న తీరు ఇది.

టీడీపీ పవర్ లో ఉన్నప్పుడు……

తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కూడా అంతే. రావెల కిశోర్ బాబుపై ఒక సామాజికవర్గం పెత్తనం చేయబోయింది. దానిని వ్యతిరేకించినందుకు ఆయనను ఏకంగా మంత్రివర్గం నుంచి తప్పించగలిగింది. అలాగే కోడుమూరు నియోజకవర్గంలో మణిగాంధీని అక్కడ విష్ణువర్థన్ రెడ్డి వేపుకు తినేవారు. రంపచోడవరంలో వంతల రాజేశ్వరిని అప్పట్లో టీడీపీ నేతలు ఎమ్మెల్యేగానే చూసేవారు కాదు. వీరంతా వైసీపీ నుంచి టీడీపీలోకి జంప్ చేసినవారే కావడం విశేషం. బద్వేలులో జయరాములు పరిస్థితి కూడా అంతే.

జగన్ జమానాలోనూ……

ఇక వైసీపీ అధికారంలోకి వచ్చినా పరిస్థితిలో ఏమాత్రం మార్పు లేదు. తాటికొండ ఎమ్మెల్యే ఉండవల్లి శ్రీదేవికి వైసీపీ నేతలే చుక్కలు చూపిస్తున్నారు. తొలిసారి గెలవడం, అందులో మహిళ ఎమ్మెల్యే కావడంతో ఒక ఆట ఆడేసుకుంటున్నారు. తనకు నలుగురితో ప్రాణహాని ఉందని పోలీసులను ఆశ్రయించారంటే అర్థం చేసుకోవచ్చు. ఇక కోడుమూరు నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే సుధాకర్ కు, హర్షవర్ధన్ రెడ్డికి పడటం లేదు. హర్షవర్ధన్ రెడ్డి డామినేషన్ ఎక్కువగా ఉండటంతో సుధాకర్ ఇబ్బంది పడుతున్నారు.

వారిదే అంతా పెత్తనం…..

ఇక నందికొట్కూరు నియోజకవర్గంలో ప్రస్తుత ఎమ్మెల్యే ఆర్థర్ కు బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి మధ్య విభేదాలు నిత్యం తలెత్తుతూనే ఉన్నాయి. అధిష్టానం జోక్యం చేసుకున్నా ఫలితం లేదు. నిత్యం పంచాయతీలే. పాయకరావుపేటలో ఎమ్మెల్యే గొల్ల బాబూరావు సీనియర్ నేత అయినప్పటికీ అక్కడ ఒక సామాజికవర్గం ఆయనపై పెత్తనం చెలాయిస్తుంది. ఇలా ఎస్సీ నియోజకవర్గం ఎమ్మెల్యేలే అటు చంద్రబాబు, ఇటు జగన్ పాలనలో ఇబ్బంది పడుతున్నారు. అయినా అధిష్టానం మాత్రం ఆర్థికంగా బలంగా ఉన్న అగ్రకులాలకే అండగా నిలుస్తుండగంతో వీరు బేలగా ఎదురు చూస్తున్నారు. అంతకు మించి ఏమీ చేయలేని పరిస్థితి.

Tags:    

Similar News