మళ్లీ మొదలుపెట్టారుగా?

నెల్లూరు జిల్లాలో ఇద్దరు నేతల మధ్య వార్ మళ్లీ మొదలయింది. ఎవరు అధికారంలో ఉన్నా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోడం, కేసులు పెట్టుకోవడం నెల్లూరు జిల్లాలో ఈ [more]

Update: 2020-11-07 08:00 GMT

నెల్లూరు జిల్లాలో ఇద్దరు నేతల మధ్య వార్ మళ్లీ మొదలయింది. ఎవరు అధికారంలో ఉన్నా ఒకరిపై ఒకరు విమర్శలు చేసుకోడం, కేసులు పెట్టుకోవడం నెల్లూరు జిల్లాలో ఈ ఇద్దరినేతలకే చెల్లింది. వారే వైసీపీ నేత కాకాణి గోవర్థన్ రెడ్డి, తెలుగుదేశం పార్టీ సీనియర్ నేత సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి. ఈ ఇద్దరు నేతలు మరోసారి విమర్శలతో వీధికెక్కుతున్నారు. ఒకరిపై ఒకరు సవాల్ విసురుకుంటున్నారు.

ఐదుసార్లు ఓటమి పాలయి…

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి సీనియర్ నేత. ఆయన ఐదు సార్లు సర్వే పల్లి నియోజకవర్గంలో పోటీ చేసి ఓటమి పాలయ్యారు. రెండు సార్లు ఆదాల ప్రభాకర్ రెడ్డిపైనా, మూడు సార్లు కాకాణి గోవర్థన్ రెడ్డిపైన ఓటమి చెందారు. 2004, 2009, 2012, 2014, 2019లో ఓటమి పాలయ్యారు. 2014 లో సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఓటమి పాలయినా చంద్రబాబు ఎమ్మెల్సీని చేసి మరీ మంత్రి పదవిని ఇచ్చారు. అప్పుడు కూడా కాకాణి గోవర్థన్ రెడ్డి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డిపై సంచలన ఆరోపణలు చేశారు.

సోమిరెడ్డి అధికారంలో ఉండగా….

సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డికి విదేశాల్లో వెయ్యి కోట్ల రూపాయల ఆస్తులు ఉన్నాయని కాకాణి ఆరోపించడం అప్పట్లో సంచలనంగా మారింది. దీనిపై సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి డీజీపీకి ఫిర్యాదు చేశారు. పరువు నష్టం దావా వేస్తానని చెప్పారు. అయితే 2019 ఎన్నికల్లో ఓటమి పాలయిన తర్వాత కొంత కాలం మౌనంా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి తిరిగి కాకాణిపై విమర్శలు మొదలు పెట్టారు. కాకాణి అవినీతిపరుడని ఆయన దుయ్యబట్టారు.

ఇప్పుడు కాకాణిపై….

దీనిపై స్పందించిన కాకాణి గోవర్థన్ రెడ్డి అంతే ధీటుగా స్పందించారు. సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మంత్రిగా ఉన్నప్పుడు పసుపు కుంభకోణం జరిగిందన్నారు. మిల్లర్ల నుంచి భారీగా ముడుపులు స్వీకరించారని ఆరోపించారు. నీరు చెట్టులో అవినీతి జరిగిందని సోమిరెడ్డిపై ధ్వజమెత్తారు. మొత్తం మీద మరోసారి సోమిరెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డిల మధ్య మళ్లీ వార్ మొదలయిందనే చెప్పాలి. కాకాణి కూడా సోమిరెడ్డిపై పరువు నష్టం దావా వేసేందుకు సిద్దమయ్యారు. ప్రస్తుతం నెల్లూరు జిల్లాలో వీరిద్దరి మధ్య వార్ హాట్ టాపిక్ గా మారింది.

Tags:    

Similar News