ఏడాదిన్నరలో ఏం జరగబోతుంది …?
కమలం కత్తులు దూస్తుంది. ఏపీ లో తామెంటో ఏడాదిన్నరలో చూపిస్తామని అంటుంది. అంటే రాబోయే ఏడాది లోగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఏమి జరగనుంది అనే చర్చ [more]
;
కమలం కత్తులు దూస్తుంది. ఏపీ లో తామెంటో ఏడాదిన్నరలో చూపిస్తామని అంటుంది. అంటే రాబోయే ఏడాది లోగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఏమి జరగనుంది అనే చర్చ [more]
కమలం కత్తులు దూస్తుంది. ఏపీ లో తామెంటో ఏడాదిన్నరలో చూపిస్తామని అంటుంది. అంటే రాబోయే ఏడాది లోగా ఆంధ్ర ప్రదేశ్ రాజకీయాల్లో ఏమి జరగనుంది అనే చర్చ ఇప్పుడు మొదలైంది. ఎపి పాలిటిక్స్ లో బిజెపి కొత్త అధ్యక్షుడితో ఒక్కసారిగా వేడెక్కింది. వచ్చి రావడంతోనే ఎపి కమలం చీఫ్ సోము వీర్రాజు చంద్రబాబు గత చరిత్ర అంతా తవ్వడమే కాదు, ఆయన బట్టలు విప్పినంత పనిని మీడియా లో చేయడం మొదలు పెట్టేశారు.
సోము ను టచ్ చేయాలంటే …
ఎపి లో బిజెపి బలం ఎంతన్నది పక్కన పెడితే ప్రస్తుతం ఆ పార్టీ చీఫ్ తో మాట్లాడాలంటే పసుపు మీడియా వణుకుతుంది. ఎందుకంటే సోము నోరు విప్పితే చాలు చంద్రాబాబు బండారం చర్విత చరణంగా చెప్పేస్తున్నారు. తమ మీడియా లో బాబు ను నిప్పులు చెరుగుతుంటే యాంకర్లు డిఫెన్స్ లో పడుతున్నారు. తెలుగు మీడియా వైఖరిని పనిలో పనిగా సోము వీర్రాజు చెరిగి పడేస్తున్నారు. దశాబ్దాలుగా చంద్రబాబు బాకాలుగా ఒక ఎజెండా తీసుకుని దాని చుట్టే రాజకీయాలు మీడియా నడుపుతుందంటూ సోము దుమ్మెత్తిపోసేస్తున్నారు.
చూపిస్తాం మా తడాఖా …
సోము వీర్రాజు మరో కొత్త విషయం బయటపెడుతున్నారు. ఏడాదిన్నరలో జరగబోయే విశేషాలు మీరే చూస్తారని ఒక ఆసక్తికర వ్యాఖ్య చేస్తున్నారు. ఆ సమయంలోగా తమ పార్టీ ఏమి చేయబోతుందో చెప్పబోమని జరగబోయేది మీరే చూస్తారంటూ ముందస్తు హెచ్చరికలను ప్రధాన విపక్షంపై విసిరారు. దాంతో టిడిపి తొక్క తీసి ఆ స్థానంలో తాము అడుగు పెట్టాలని కమలం చూస్తుంది అన్న సంకేతాలు స్పష్టం అయిపోయాయి. ఇది గ్రహించే చంద్రబాబు ఇప్పటికే బిజెపి పై ఎదురు దాడి వ్యూహం గట్టిగానే రూపొందించారు. అమరావతి లో రాజధాని ఉంచి తీరాలని ఆ బాధ్యత కేంద్రానిదే అన్న స్లోగన్ తో ఆయన తెరమీదకు వస్తున్నారు. ఇప్పటికే పార్టీ శ్రేణులనుంచి అమరావతి రైతుల వరకు ఇదే అంశంపై బిజెపి ని టార్గెట్ చేసేశాయి. మరి దీనికి విరుగుడు కమలం దగ్గర ఏముందో చూడాలి.