చేతులారా చేటును కొనితెచ్చుకుంటున్నారా?

సర్వేలు చూసి భ్రమ పడుతున్నారు. రజనీకాంత్ కూడా పార్టీ పెట్టడం లేదని ప్రకటించడంతో విశ్వాసం రెట్టింపయింది. ఇక తానే ముఖ్యమంత్రి నన్న ధీమా పెరిగింది. ఆయనే డీఎంకే [more]

Update: 2021-02-03 18:29 GMT

సర్వేలు చూసి భ్రమ పడుతున్నారు. రజనీకాంత్ కూడా పార్టీ పెట్టడం లేదని ప్రకటించడంతో విశ్వాసం రెట్టింపయింది. ఇక తానే ముఖ్యమంత్రి నన్న ధీమా పెరిగింది. ఆయనే డీఎంకే అధినేత స్టాలిన్. ఈ అతి విశ్వాసమే ఆయనకు చిక్కులు తెచ్చిపెడుతున్నాయంటున్నారు. స్టాలిన్ అంతా ఏకపక్షంగానే నిర్ణయం తీసుకుంటున్నారు. ఆళగిరిని ఇప్పటికే దూరం చేసుకున్నారు. అలాగే కూటమిలోని పార్టీలపై కూడా స్టాలిన్ చిన్న చూపు చూస్తున్నారు.

అతి విశ్వాసంతో….

డీఎంకే ఈసారి అధికారంలోకి రావడం ఖాయమన్న లెక్కలు సర్వత్రా విన్పిస్తున్నాయి. అదే స్టాలిన్ కొంప ముంచేలా ఉంది. డీఎంకేలో అనేక పార్టీలు ఉన్నాయి. కాంగ్రెస్ తో పాటు చిన్నా చితకా పార్టీలు అనేకం ఉన్నాయి. అయితే ఈ పార్టీలకు సీట్లు ఎక్కువ సంఖ్యలో ఇచ్చే ఉద్దేశ్యంలో స్టాలిన్ లేరు. కాంగ్రెస్ పార్టీ యాభై స్థానాలు కోరుకుంటుంది. కానీ స్టాలిన్ మాత్రం పదిహేను నుంచి ఇరవై స్థానాలకు మించి ఇవ్వలేమంటున్నారు.

తమ గుర్తుపైనే…..

ఇక వీసీకే కూడా ఎక్కువ స్థానాలను ఆశిస్తుంది. అయితే స్టాలిన్ మాత్రం వీసీకే కు పది, సీపీఎం, సీపీఐకి చెరో పది స్థానాలను కేటాయించాలని డిసైడ్ చేశారు. దీనికి తోడు తమ పార్టీ గుర్తు పైనే పోటీ చేయాలని స్టాలిన్ షరతు విధించారు. కానీ కూటమిలోని పార్టీలు డీఎంకే గుర్తుపై పోటీ చేసేందుకు సుముఖతగా లేవు. తమ ఐడెంటిటీని కోల్పోతామని, తమ గుర్తు మీదనే బరిలోకి దిగుతామని చెబుతున్నాయి. ఎక్కువ స్థానాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాయి. గత అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిలోని పార్టీల కారణంగానే అధికారంలోకి రాలేకపోయామని స్టాలిన్ ఈ నిర్‍ం తీసుకున్నారు.

మరో కూటమికి ఏర్పాట్లు….?

దీంతో కాంగ్రెస్ పార్టీ కూడా కొంత ఆగ్రహంతో ఉన్నట్లు సమాచారం. అందుకే రాహుల్ గాంధీ తరచూ తమిళనాడులో పర్యటనలు చేస్తున్నారు. స్టాలిన్ తల ఎగరేస్తే తృతీయ కూటమిని ఏర్పాటు చేయడానికి కాంగ్రెస్ సిద్ధమవుతుంది. ఈ కూటమిలోకి వచ్చేందుకు మక్కల్ నీది మయ్యమ్ అధినేత కమల్ హాసన్ కూడా సుముఖంగా ఉన్నారు. కమల్ హాసన్, ఇతర పార్టీలతో కాంగ్రెస్ మరో కూటమిని ఏర్పాటు చేసే అవకాశాలు కన్పిస్తున్నాయి. అదే జరిగితే స్టాలిన్ కు ఇబ్బందిగా మారుతుంది. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలిపోతే మరోసారి అధికారం చేజారిపోతుంది. మరి స్టాలిన్ ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో చూడాల్సిందే.

Tags:    

Similar News