దొంగ ఓట్లే ఈమెకు శ్రీరామ రక్ష.. కారణమిదేనట
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక టీడీపీలో కొందరు నేతలకు ఇబ్బంది కలగనుంది. అయితే తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అధిష్టానం ఆగ్రహం నుంచి తప్పించుకున్నట్లే. సుగుణమ్మ పై [more]
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక టీడీపీలో కొందరు నేతలకు ఇబ్బంది కలగనుంది. అయితే తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అధిష్టానం ఆగ్రహం నుంచి తప్పించుకున్నట్లే. సుగుణమ్మ పై [more]
తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక టీడీపీలో కొందరు నేతలకు ఇబ్బంది కలగనుంది. అయితే తిరుపతి మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ అధిష్టానం ఆగ్రహం నుంచి తప్పించుకున్నట్లే. సుగుణమ్మ పై పార్టీలో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఆమెను బాధ్యతల నుంచి తప్పించాలని ఎప్పటి నుంచో టీడీపీలోని ఒక వర్గం డిమాండ్ చేస్తూ వస్తుంది. అయితే చంద్రబాబు మాత్రం సుగుణమ్మ విషయంలో వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నారు.
పార్లమెంటు ఉప ఎన్నిక….
అయితే తాజాగా తిరుపతి పార్లమెంటు ఉప ఎన్నిక సుగుణమ్మకు పెద్ద సవాల్ గా మారింది. తిరుపతి అసెంబ్లీ నియోజకవర్గంలో టీడీపీకి అత్యధిక మెజారిటీని సాధించాలని చంద్రబాబు ఆదేశించారు. అవసరమైన ఆర్థిక సాయాన్ని కూడా పార్టీ నుంచి సుగుణమ్మకు అందినట్లు తెలుస్తోంది. తిరుపతి శాసనసభ నియోజకవర్గంలో తొలి నుంచి తెలుగుదేశం పార్టీకి పట్టుంది. 1994, 1999, 2014 ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ విజయం సాధించింది.
స్వల్ప ఓట్ల తేడాతో…
2014 ఎన్నికల్లో వెంకటరమణ టీడీపీ నుంచి పోటీ చేసి విజయం సాధించారు. ఆయన ఆకస్మిక మరణంతో భార్య సుగుణమ్మ ఉప ఎన్నికల్లో పోటీ చేసి విజయం సాధించారు. అయితే ఆమె ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో అల్లుడు సంజయ్ పెత్తనం ఎక్కువయిందని టీడీపీ నేతలే ఆరోపణలు గుప్పించారు. చంద్రబాబు అనేక మార్లు సుగుణమ్మను తీరు మార్చుకోవాలని హెచ్చరించినా మార్పులేదు. 2019 ఎన్నికల్లో చంద్రబాబు తిరిగి సుగుణమ్మకే టిక్కెట్ కేటాయించారు. కేవలం700 ఓట్ల తేడాతోనే సుగుణమ్మ ఓటమి పాలయ్యారు.
దొంగ ఓట్లంటూ……
ఇప్పుడు తాజాగా జరిగిన పార్లమెంటు ఉప ఎన్నికల్లో తిరుపతి శాసనసభ నియోజకవర్గం నుంచి మంచి మెజారిటీ రావాలని సుగుణమ్మకు లక్ష్యంగా పెట్టారు. కానీ సుగుణమ్మకు ఇప్పుడు దొంగఓట్లు ప్లస్ అయ్యాయి. ఒకవేళ మెజారిటీ రాకపోయినా సుగుణమ్మకు రాజకీయంగా జరిగే నష్టం ఏమీ ఉండదు. దొంగ ఓట్లు కారణంగానే మెజారిటీ రాలేదని చెప్పుకోవచ్చు. ఒకవేళ మెజారిటీ వస్తే దొంగ ఓట్లు పోలయినా తాను సక్సెస్ అయ్యానని చెప్పుకోవచ్చు. మొత్తం మీద దొంగఓట్ల రచ్చ సుగుణమ్మను సేఫ్ జోన్ లోకి పడేశాయంటున్నారు.