Sujana choudary : కంటిన్యూ చేస్తారట.. లేకుంటే కష్టమేగా మరి
కష్టాలన్నీ ఒకేసారి ముంచుకు వస్తాయి. పారిశ్రామిక వేత్త, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి కాలం కలసి రావడం లేదు. ముందున్నవన్నీ కష్టాలేనని చెప్పాలి. ఇటు సీబీఐ, ఈడీ [more]
;
కష్టాలన్నీ ఒకేసారి ముంచుకు వస్తాయి. పారిశ్రామిక వేత్త, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి కాలం కలసి రావడం లేదు. ముందున్నవన్నీ కష్టాలేనని చెప్పాలి. ఇటు సీబీఐ, ఈడీ [more]
కష్టాలన్నీ ఒకేసారి ముంచుకు వస్తాయి. పారిశ్రామిక వేత్త, రాజ్యసభ సభ్యుడు సుజనా చౌదరికి కాలం కలసి రావడం లేదు. ముందున్నవన్నీ కష్టాలేనని చెప్పాలి. ఇటు సీబీఐ, ఈడీ కేసులు, అటు రాజ్యసభ పదవీకాలం ముగియనుండటంతో ఇక రాజకీయంగా, వ్యాపారపరంగా ఇబ్బందులు తప్పేట్లు లేవు. దీనికి తోడు బీజేపీలోనూ ఆయన పట్టు కోల్పోతున్నారు. సోము వీర్రాజు వర్గం ఆయనను, ఆయన అనుచరులను దూరం పెట్టేసింది.
కొన్ని నెలల్లోనే….
సుజనా చౌదరి పదవీ కాలం మరికొద్ది నెలల్లోనే ముగియనుంది. ఇక బీజేపీ మరోసారి ఆయనను రాజ్యసభకు పంపుతుందా? అంటే అనుమానమే. ఎందుకంటే బీజేపీ ఇటీవల రాజ్యసభ పదవులను భర్తీ చేసిన విధానం చూస్తుంటే సుజనా చౌదరికి రావడం కష్టమే. కర్ణాటక తదితర రాష్ట్రాల్లో పార్టీలో సుదీర్ఘకాలం నుంచి పనిచేస్తున్న వారికే రాజ్యసభ పదవులు ఇచ్చారు. సుజనా చౌదరి నిన్నగాక మొన్న వచ్చారు. ఆయనకు మరోసారి రాజ్యసభ పదవిని రెన్యువల్ చేయడం కష‌్టం.
లాబీయింగ్ చేయడానికి….
మరోవైపు రాజ్యసభ పదవి పోతే ఢిల్లీ స్థాయిలో లాబీయింగ్ చేయడం కూడా కష్టమవుతుంది. తాను పారిశ్రామికవేత్తగా అనేక కేసులు ఎదుర్కొంటున్నారు. తొలుత సుజనా చౌదరి ఈ కేసుల నుంచి బయటపడాల్సి ఉంది. కోర్టు అనుమతితో ఆయన విదేశాలకు వెళ్లాల్సిన పరిస్థిితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో ఆయన బీజేపీలోనే కొనసాగే అవకాశాలున్నాయి. బీజేపీలో ఉంటేనే కొంత కేసుల నుంచి రక్షణ దొరుకుతుంది.
ఆ డీల్ కష‌్టమేనట…
సుజనా చౌదరి బీజేపీ, టీడీపీ మధ్య సయోధ్య కుదర్చడానికి చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇక్కడ సోము వీర్రాజు పార్టీ అధ్యక్షుడిగా వచ్చిన తర్వాత అది అసాధ్యమని తేలిపోయింది. జేపీ నడ్డా వంటి వారు సుముఖత వ్యక్తం చేసినా రాష్ట్ర నేతలు టీడీపీతో సయోధ్యకు అంగీకరించడం లేదు. దీంతో సుజనా చౌదరి ఆ డీల్ ను వదిలేశారని, 2024 ఎన్నికల ఫలితాలు వచ్చే వరకూ బీజేపీలోనే ఉంటారు. అప్పుడు ఫలితాలను బట్టి నిర్ణయం తీసుకోనున్నారు.