పీవీ కూతురు అనే ఓటు వేస్తారా?

శాసనమండలి ఎన్నికలు తెలంగాణలో రసవత్తరంగా మారాయి. ప్రధానంగా మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. అధికార టీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రధాని [more]

Update: 2021-03-08 09:30 GMT

శాసనమండలి ఎన్నికలు తెలంగాణలో రసవత్తరంగా మారాయి. ప్రధానంగా మహబూబ్ నగర్, హైదరాబాద్, రంగారెడ్డి పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నిక ఆసక్తికరంగా మారింది. అధికార టీఆర్ఎస్ పార్టీ మాజీ ప్రధాని పీవీ నరసింహారావు కుమార్తె వాణిదేవిని అభ్యర్థిగా ప్రకటించింది. సానుభూతి, సామాజికవర్గం ఓట్లు కలసి వస్తాయనే కేసీఆర్ వాణిదేవిని వ్యూహాత్మకంగా బరిలోకి దించారు. అయితే పీవీ కుమార్తె అయినంత మాత్రాన ఓటు వేస్తారా? అన్నది సందేహంగానే ఉంది.

ఆ సానుభూతి ఉంటుందా?

పీవీ నరసింహారావుకు జాతీయ స్థాయిలో ఖ్యాతి ఉంది. తెలంగాణ గడ్డ మీద పుట్టిన పీవీ ఉన్నతపదవులను అధిష్టించారు. ఆయన పేరిట అధికారికంగా ఇప్పుడు ప్రభుత్వం శత జయంతి ఉత్సవాలను కూడా నిర్వహిస్తుంది. అయితే ఇది పట్బభద్రుల ఎమ్మెల్సీ స్థానం. కొత్త జనరేషన్ ఓట్లు చాలా చేరాయి. వాళ్లకు పీవీ సేవలు, దేశానికి ఆయన అందించిన ఆర్థిక సరళీకృత విధానాలు పెద్దగా పట్టవు. వారంతా ఇక్కడ రాజకీయాలను బట్టి మాత్రమే ఓట్లువేస్తారు. అధికార పార్టీపై నిరుద్యోగ యువత గుర్రుగా ఉన్నారు.

కాంగ్రెస్ ఓటు బ్యాంకు….

కాగా పీవీ నరసింహారావు మృతి చెందినప్పుడు కాంగ్రెస్ ఘోరంగా అవమానించింది. ఆ తర్వాత కూడా పీవీ కుటుంబాన్ని కాంగ్రెస్ పట్టించుకోలేదు. కానీ హటాత్తుగా టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వాణీదేవిని పోటీ చేయించడం వెనక కాంగ్రెస్ ఓట్లు చీలుతాయనే. అయితే కాంగ్రెస్ ఓటు బ్యాంకు ఇప్పుడన్న పరిస్థితుల్లో అధికార పార్టీపై కాంగ్రెస్ క్యాడర్ ఒక్కసారిగా గులాబీ పార్టీ వైపు మళ్లుతుందని అనుకోలేం. ఇందుకు కాంగ్రెస ప్రచారంలో కొంత కష్టపడితే ఆ ఓటు బ్యాంకు ఎక్కడకు వెళ్లదు.

బలమైన అభ్యర్థి అయినా…..

ఇక రంగారెడ్డి, మహబూబ్ నగర్, హైదరాబాద్ జిల్లాల్లో బీజేపీ కూడా బలంగా ఉంది. ఇక్కడ సిట్టింగ్ ఎమ్మెల్సీ ఉన్న రామచంద్రరావు పోటీలో ఉన్నారు. మరోవైపు స్వతంత్ర అభ్యర్థిగా ప్రొఫెసర్ నాగేశ్వర్ ఉన్నారు. విద్యాసంస్థల అధిపతిగా ఉన్న వాణీదేవి గెలుపు అంత సులువు కాదంటున్నారు. పీవీ కుమార్తె అని మాత్రమే ఓట్లు వేస్తారనుకుంటే అది అజ్ఞానమేనని విపక్ష నేతలు సయితం అంటున్నారు. మొత్తం మీద కేసీఆర్ పీవీ కుమార్తె వాణీదేవిని రంగంలోకి దించినా గెలుపు అవకాశాలు ఎంత మాత్రం ఉన్నాయన్నది చెప్పలేం. అయితే బలమైన అభ్యర్థి అని మాత్రం చెప్పుకోవచ్చు.

Tags:    

Similar News