Andhra : ముగ్గురి “మూడ్” మారిపోయిందే?
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలకు మూడేళ్ల ముందు నుంచే అన్ని రాజకీయ పార్టీలు ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్దమవుతున్నాయి. ప్రభుత్వం అమలు పరుస్తున్న విధానాలను ఎండగట్టాలని విపక్షాలు, [more]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలకు మూడేళ్ల ముందు నుంచే అన్ని రాజకీయ పార్టీలు ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్దమవుతున్నాయి. ప్రభుత్వం అమలు పరుస్తున్న విధానాలను ఎండగట్టాలని విపక్షాలు, [more]
ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు వేడెక్కాయి. ఎన్నికలకు మూడేళ్ల ముందు నుంచే అన్ని రాజకీయ పార్టీలు ప్రజల వద్దకు వెళ్లేందుకు సిద్దమవుతున్నాయి. ప్రభుత్వం అమలు పరుస్తున్న విధానాలను ఎండగట్టాలని విపక్షాలు, తాము ఏం సంక్షేమ పథకాలను అమలు చేశామో చెప్పుకునేందుకు పాలక పక్షం సయితం ప్రజల వద్దకు వెళ్లేందుకు రెడీ అయ్యాయి. ఇక ఇప్పటి నుంచి రాష్ట్రంలో రాజకీయ వాతావరణం మరింత వేడెక్కనుంది.
రచ్చబండ తో….
ముఖ్యమంత్రి జగన్ ఇప్పటి వరకూ తాడేపల్లి క్యాంప్ కార్యాలయానికే పరిమితమయ్యారు. ఆయన ప్రజల్లోకి వెళ్లి క్షేత్ర స్థాయి పరిస్థితులను తెలుసుకునేందుకు సిద్దమవుతున్నారు. రచ్చబండ పేరుతో గ్రామాలను పర్యటించాలని నిర్ణయించారు. దాదాపు ప్రతి నియోజకవర్గంలో రచ్చ బండ కార్యక్రమంలో పాల్గొని ప్రజలను నేరుగా కలుసుకునే ప్రయత్నం చేయనున్నారు. గ్రామసచివాలయాలను కూడా జగన్ సందర్శించనున్నారు.
జిల్లాల వారీగా….
ప్రతిపక్ష నేత చంద్రబాబు సయితం తన టూర్ కు ప్లాన్ చేసుకుంటున్నారు. ముందగా జిల్లాల పర్యటనలు చేయాలని నిర్ణయించారు. జిల్లాల్లో ప్రజలను కలుసుకోవడంతో పాటు పార్టీ నేతలతో కూడా ఆయన సమావేశం కానున్నారు. దీపావళి తర్వాత చంద్రబాబు జిల్లా పర్యటనలు ఉండే అవకాశముంది. ఆయన ప్రధానంగా ఉత్తరాంధ్ర, రాయలసీమ జిల్లాల్లో ముందుగా పర్యటించాలని నిర్ణయించారు.
జిల్లాల్లో సమస్యలను….
జనసేన అధినేత పవన్ కల్యాణ్ కూడా జిల్లాల పర్యటనకు రెడీ అయిపోయారు. నేరుగా జిల్లాలకే వెళ్లి అక్కడ పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనేలా ప్లాన్ చేశారు. జిల్లాల వారీగా సమస్యలను గుర్తించి వాటిపై పోరాటం చేయాలని పవన్ కల్యాణ్ పార్టీ నేతలను ఆదేశించారు. అదే సమయంలో జిల్లాలో పార్టీ నేతలతో సమావేశమై భవిష్యత్ కార్యాచరణపై చర్చించనున్నారు. మొత్తం మీద ముగ్గురు నేతలు ఎన్నికల మూడ్ లోకి వెళ్లినట్లే కన్పిస్తుంది. త్వరలో ఏపీలో రాజకీయ నేతల సమావేశాలతో మోతెక్కిపోనుంది.