తమ్ముళ్ళకు అమరావతి బెంగ

ఏపీలో అయిదేళ్ళ పాటు తెలుగుదేశం ప్రభుత్వం పాలన సాగింది. ఆ పార్టీ ప్రాధాన్యతలు వేరుగా ఉండేవి. ఎక్కువగా అమరావతి రాజధాని ప్రస్తావన కనిపించేది. తెల్లారిలేస్తే అద్భుత రాజధాని [more]

;

Update: 2019-06-16 05:00 GMT

ఏపీలో అయిదేళ్ళ పాటు తెలుగుదేశం ప్రభుత్వం పాలన సాగింది. ఆ పార్టీ ప్రాధాన్యతలు వేరుగా ఉండేవి. ఎక్కువగా అమరావతి రాజధాని ప్రస్తావన కనిపించేది. తెల్లారిలేస్తే అద్భుత రాజధాని నగరం అదిగో ఇదిగో అంటూ భారీ ప్రకటనలు అనుకూల మీడియాలో దర్శనం ఇచ్చేవి. ఈ అయిదేళ్ళలో ఏం జరిగింది అంటే భూ సేకరణ భారీగా జరిగింది. ప్రతీ ఆరు నెలలకు ఓ శంఖుస్థాపన జరిగేది. భారీ డిజైన్లు, సెట్టింగులతో బ్రహ్మాండమైన రాజధాని రాబోతోందన్న బిల్డప్ ఎక్కువగా కనిపించింది. తీరా అధికారం చేజారాక చూస్తే అక్కడ అందరూ చెప్పుకుంటున్నట్లుగా పురోగతి కనిపించలేదు.

ఆ పేరు తలవని వైనం :

ఇక కొత్తగా అధికారం చేపట్టిన జగన్ సర్కార్ అమరావతి మీద ఇప్పటివరకూ ఇదీ మా విధానం అని చెప్పలేదు. అయితే ముఖ్యమంత్రి జగన్ పాదయాత్ర సమయంలోనూ, ప్రతిపక్ష నేతగా ఉన్నపుడు అనేక సందర్భాల్లో చెప్పిన మాటలు గుర్తు చేసుకుంటే అభివ్రుధ్ధి విషయంలో వైసీపీకి రెండవ ఆలోచన లేదు కానీ వేలాది ఎకరాలు తీసుకుని మరీ రియల్ ఎస్టేట్ బిజినెస్ చేయడం, అస్మదీయులకు పెద్ద పీట వేయడం పట్ల ట్లనే విముఖత వ్యక్తం అవుతోంది. ఈ పరిణామాలను గమనించినట్లైతే అమరావతి వూసు లేకుండా గవర్నర్ ప్రసంగం సాగడం విశేషం. దీని మీద జగన్ సర్కార్ కి నిర్దిష్టమైన విధానాలు, అభిప్రాయాలు ఉన్నాయని, వాటిని తొందరలోనే వెల్లడిస్తారని ఆ పార్టీ నాయకులు చెబుతున్నారు.

తమ్ముళ్ల గగ్గోలు :

నిజానికి అక్కడ అమరావతి అన్న పేరు తప్ప అభివ్రుధ్ధి ఏమీ లేదన్నది టీడీపీ తమ్ముళ్లకూ తెలుసు. అయినా ఆ బ్రాండ్ ఇమేజ్ ని కల్పించి దానికి గుత్త పెత్తందార్లు తామేనని చెప్పుకుంటూ వచ్చిన పసుపు పార్టీ నేతలు ఇపుడు అమరావతి అని కలవరిస్తున్నారు. గవర్నర్ ప్రసంగంలో అమరావతి వూసే లేదని ఘాటు విమర్శలు చేస్తున్నారు. అభివ్రుధ్ధి పడకేసిందని అపుడే విమర్శల బాణాలు సంధిస్తున్నారు. జగన్ సర్కార్ ఆ అంశం మీద ఇప్పటివరకూ ద్రుష్టి పెట్టలేదని కూడా అంటున్నారు. అభివ్రుధ్ధి ఏదీ అంటూ ప్రశ్నలతో శరసంధానం చేస్తున్నారు. అయితే ఇక్కడ ఒక విషయం క్లియర్. అభివ్రుద్ధికి తాము వ్యతిరేకం కాదని జగన్ ప్రభుత్వం గట్టిగానే చెప్పుకొస్తోంది. అందువల్ల అమరావతిపై టీడీపీకి బెంగ అసలు అవసరం లేదని వైసీపీ నేతలు అంటున్నారు. ఆ పేరు మీద జరిగిన అవినీతి విషయంలోనే వారు కంగారు పడుతున్నారని, అన్నీ తొందరలో వెలుగులోకి వస్తాయని చెబుతున్నారు. చూడాలి మరి.

Tags:    

Similar News