తేజస్వి.. అంత తేడా అయితే ఎలా?

ఆశకు ఒక హద్దుండాలి. అధికారం కోసం అలివిమాలిన కోరికలు ఆచరణలో సాధ్యమవుతాయా? లేదా? అన్నది కూడా పరిశీలించుకోవాలి. కానీ రాజకీయాల్లో అవన్నీ జాన్తానై. ఎప్పటికప్పుడు క్యాడర్ ను [more]

;

Update: 2021-01-17 18:29 GMT
తేజస్వియాదవ్
  • whatsapp icon

ఆశకు ఒక హద్దుండాలి. అధికారం కోసం అలివిమాలిన కోరికలు ఆచరణలో సాధ్యమవుతాయా? లేదా? అన్నది కూడా పరిశీలించుకోవాలి. కానీ రాజకీయాల్లో అవన్నీ జాన్తానై. ఎప్పటికప్పుడు క్యాడర్ ను ఉత్సాహ పర్చడం కోసం రాజకీయనేతలు ఇలాంటి వ్యాఖ్యలే చేస్తారు. బీహార్ లో ఎన్నికలు జరిగి ఇంకా నెలలు గడవలేదు. అప్పుడే మధ్యంతర ఎన్నికలకు సిద్ధం కావాలని ఆర్జేడీ అధినేత తేజస్వి యాదవ్ పిలుపునిస్తున్నారు.

అధికారానికి కొన్ని సీట్ల…..

బీహార్ లో మొన్న జరిగిన ఎన్నికలలో తేజస్వి యాదవ్ గెలిచినట్లే గెలిచి అధికారానికి దూరమయ్యారు. దీనికి అనేక కారణాలున్నాయి. అయినా తేజస్వియాదవ్ నేతృత్వంలో కూటమి కనపర్చిన పెరఫార్మెన్స్ ను దేశ వ్యాప్తంగా అందరూ ప్రశసించారు. ఆఫ్ ది రికార్డులో బీజేపీ నేతలు సయితం తేజస్వి యాదవ్ నాయకత్వాన్ని పొగడకుండా ఉండలేకపోతున్నారు. కానీ తక్కువ స్థానాలతో అధికారానికి దూరమవ్వడంతో తేజస్వి యాదవ్ తట్టుకోలేకపోతున్నారు.

మధ్యంతర ఎన్నికలంటూ…..

అందుకే ఆయన మధ్యంతర ఎన్నికల ఊసును తెస్తున్నారు. నిన్న మొన్నటి వరకూ 17 మంది జేడీయూ ఎమ్మెల్యేలు తమ పార్టీలోకి రావడానికి సిద్ధంగా ఉన్నారని తేజస్వియాదవ్ పార్టీ ప్రకటించింది. ఇందుకు అరుణాచల్ ప్రదేశ్ లో జేడీయూ ఎమ్మెల్యేలను బీజేపీలో చేర్చుకోవడతో ఈ ప్రచారానికి కొంత బలం చేకూరింది. అయితే నితీష్ కుమార్ ఎమ్మెల్యేలతో సమావేశం అయిన తర్వాత ఈ ప్రచారం పూర్తిగా తెరవెనక్కు వెళ్లిపోయింది.

అది సాధ్యమేనా?

ఇప్పుడు కొత్తగా మధ్యంతర ఎన్నికల ఊసును తేజస్వియాదవ్ తెస్తున్నారు. నిన్న గాక మొన్న ఎన్నికలు జరిగితే మళ్లీ ఎన్నికలకు ఏ ఎమ్మెల్యే అయినా సిద్ధమవుతారా? అంతెందుకు సొంత పార్టీ ఆర్జేడీ ఎమ్మెల్యేలే మళ్లీ ఎన్నికలంటే వెనక్కు తగ్గుతారు. ఎన్నికల ఖర్చును భరించలేకపోవడం, మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకోవడమే ఇందుకు కారణం. ప్రభుత్వం పడిపోతుందని తేజస్వి యాదవ్ భావిస్తున్నారు. అదే జరిగితే అధికారంలో ఉన్న బీజేపీలోకి జేడీయూ ఎమ్మెల్యేలు వెళతారు తప్పించి, విపక్షంలోని తేజస్వి యాదవ్ చెంతకు చేరతారు? సో.. మధ్యంతర ఎన్నికల ప్రచారం కొంత కాలం బీహార్ లో అలా జరిగి ఇలా వెళ్లిపోతుంది.

Tags:    

Similar News