టి జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు వీరే …

తెలంగాణ లో వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సైన్యాన్ని సర్వసన్నద్ధం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో అధికారం దక్కించుకోవాలంటే తెలుగు రాష్ట్రాలు కీలకం. ఆంధ్రప్రదేశ్ [more]

Update: 2019-02-08 04:26 GMT

తెలంగాణ లో వచ్చే పార్లమెంట్ ఎన్నికలకు సైన్యాన్ని సర్వసన్నద్ధం చేసే ప్రక్రియకు శ్రీకారం చుట్టింది కాంగ్రెస్ పార్టీ. కేంద్రంలో అధికారం దక్కించుకోవాలంటే తెలుగు రాష్ట్రాలు కీలకం. ఆంధ్రప్రదేశ్ లో పార్టీకి వ్యతిరేక పవనాలు ఇంకా వీస్తూనే వున్న నేపథ్యంలో తెలంగాణ లో వచ్చే సీట్లపై ఆధారపడింది కాంగ్రెస్. ఈ నేపథ్యంలో 31 జిల్లాలకు డిసిసి అధ్యక్షులను నియమించాలని టి పిసిసికి ఆదేశాలు ఇచ్చింది. దాంతో రంగంలోకి దిగిన టి కాంగ్రెస్ అన్ని జిల్లాల అధ్యక్షులను నియమించి ప్రకటించింది. వీరిలో 12 బిసి లకు 9 రెడ్డి, బ్రాహ్మణ 2 , కమ్మ 2, ఎస్సి ఎస్టీ లకు రెండేసి చొప్పున స్థానాలు కల్పించింది. మైనారిటీలకు అవకాశం ఇచ్చింది. డిసిసి అధ్యక్షులలో ఎమ్యెల్యేల భార్యలైన నిర్మలా జగ్గారెడ్డికి సంగారెడ్డి, భూపాలపల్లి ఎమ్యెల్యే గండ్ర వెంకట రమణ రెడ్డి భార్య గండ్ర జ్యోతికి డిసిసి పదవి దక్కింది. ఇక ఎమ్యెల్యే లలో రోహిత్ రెడ్డి, వనమా వెంకటేశ్వర రావు, ఆత్రం సక్కులకు పదవులు దక్కాయి. ఇక ఖమ్మం పై కాంగ్రెస్ ప్రత్యేక దృష్టి పెట్టింది. ఖమ్మం సిటీకి జావేద్ ను ఖమ్మం వర్కింగ్ ప్రెసిడెంట్ గా దీపక్ చౌదరి లకు పదవులు దక్కాయి. హైదరాబాద్ సిటీ అధ్యక్షుడిగా అంజన్ కుమార్ యాదవ్ ను నియమించింది కాంగ్రెస్. టి పిసిసి నియమించిన డిసిసి అధ్యక్షులు వీరే.

ఆసిఫాబాద్ – భార్గవ్ దేశ్ పాండే
మంచిర్యాల – కొక్కిరాల సురేఖ
నిర్మల్ – రామారావు పటేల్
ఆసిఫాబాద్ – ఆత్రం సక్కు
కరీంనగర్ – మృత్యంజయం
జగిత్యాల – లక్ష్మణ కుమార్
పెద్దపల్లి – ఈర్ల కొమురయ్య
రాజన్న సిరిసిల్లా – సత్యనారాయణ గౌడ్
నిజామాబాద్ -మానాల మోహన రెడ్డి
కామారెడ్డి – కైలాష్ శ్రీనివాసరావు
వరంగల్ అర్బన్ – నాయిని రాజేంద్ర రెడ్డి
వరంగల్ సిటీ – కేదారి శ్రీనివాసరావు
భూపాలపల్లి గండ్ర జ్యోతి
జనగామ – జాంగా రాఘవరెడ్డి
సంగా రెడ్డి – నిర్మల్ గౌడ్
మెదక్ – తిరుపతి రెడ్డి
సిద్ధిపేట – నర్సా రెడ్డి
వికారాబాద్ – రోహిత్ రెడ్డి
మేడ్చల్ – కూన శ్రీ శైలం గౌడ్
రంగారెడ్డి – చల్ల నర్సింహారెడ్డి
మహబూబ్ నగర్- ఓబేదుల్లా కొత్వాల్
వనపర్తి – శంకర ప్రసాద్
గద్వాల్ – పటేల్ ప్రభాకర రెడ్డి
నాగర్ కర్నూల్ – వంశీ కృష్ణా
సూర్యాపేట – వెంకన్న యాదవ్
యాదాద్రి – భిక్షమయ్య గౌడ్
మహబూబాబాద్ – భరత్ చంద్ర రెడ్డి
నల్గొండ – శంకర నాయక్
కొత్త గూడెం -వనమా వెంకటేశ్వర రావు
ఖమ్మం -పువ్వాడ దుర్గాప్రసాద్

Tags:    

Similar News