మోడీ టీడీపీ ఆశ తీర్చేలా లేరా … ?
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి నిన్న మొన్నటివరకు వైసీపీ కి చేదు టీడీపీకి తీపీగా ఉండేది. దీనికి కారణం అందరికి తెలిసిందే. మండలి లో టీడీపీకి ఆధిక్యం ఉండటం, [more]
;
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి నిన్న మొన్నటివరకు వైసీపీ కి చేదు టీడీపీకి తీపీగా ఉండేది. దీనికి కారణం అందరికి తెలిసిందే. మండలి లో టీడీపీకి ఆధిక్యం ఉండటం, [more]
ఆంధ్రప్రదేశ్ శాసన మండలి నిన్న మొన్నటివరకు వైసీపీ కి చేదు టీడీపీకి తీపీగా ఉండేది. దీనికి కారణం అందరికి తెలిసిందే. మండలి లో టీడీపీకి ఆధిక్యం ఉండటం, వైసీపీ కి మెజారిటీ లేకపోవడమే. ప్రజలు ఇచ్చిన అధికారంతో శాసన సభలో చేస్తున్న బిల్లులను రాజకీయ ఆధిపత్యానికి టీడీపీ మండలి ద్వారా అడ్డుకోవడంతో గత ఏడాది జగన్ సర్కార్ శాసన మండలి ని రద్దు చేస్తూ శాసనసభలో తీర్మానం చేసి కేంద్రానికి పంపేసింది. ఈ ఏడాది వైసీపీ మండలి లో ఆధిక్యం పొందే అవకాశం ఉన్నా జగన్ మాత్రం ఆవేశంతో నిర్ణయం తీసేసుకున్నారు.
రాష్ట్రాల ఇష్టం కాదుగా …
అయితే ఇలా రద్దు చేయడం కేవలం శాసనసభ తో అయ్యే పని కాదు పార్లమెంట్ లోని ఉభయ సభల ఆమోదం లభించాలిసి ఉంది. కానీ బిజెపి సర్కార్ దేశవ్యాప్తంగా వస్తున్న డిమాండ్లపై నిర్ణయం తీసుకోకుండా కాలయాపన చేస్తుంది. పలు రాష్ట్రాలు మండలిని ఏర్పాటు అనుమతి కోరుతూ కేంద్రంపై వత్తిడి తెస్తున్నాయి. ఇటీవల పశ్చిమ బెంగాల్ సర్కార్ కూడా మండలి కోసం అనుమతి కోరింది. ఇదిలా ఉంటే ఎపి మండలి రద్దుకు సంబంధించి వివిధ రాష్ట్రాల్లో ఉన్న సమస్యల దృష్ట్యా దాని జోలికే పోకుండా నెట్టుకొస్తోంది కేంద్రం. అదే ఇప్పుడు వైసీపీ సర్కార్ కి వరంగా మారింది . ప్రస్తుతం మండలిలో వైసీపీ ఆధిక్యంలోకి వచ్చేసింది. దాంతో ఆ పార్టీ శాసనమండలి రద్దు పై గొంతు పెగల్చడమే లేదు.
ఇరకాటంలో పెట్టాలని టీడీపీ …
శాసనమండలి ని ప్రస్తుతం రద్దు చేస్తే మంచిదన్న ఆలోచనతో పావులు కదుపుతుంది ఏపీ లోని ప్రధాన ప్రతిపక్షం టీడీపీ. మండలిలో తమ పార్టీ బలహీనపడటంతో తెలుగుదేశానికి దీని అవసరం ఇప్పుడు లేదు. జగన్ వేసుకున్న సెల్ఫ్ గోల్ ను పెద్దది చేసి ఆ పార్టీ నేతలకు ఇకపై మండలి ద్వారా ఎలాంటి పదవులు లభించకుండా ఉండేందుకు ఉన్న అవకాశాలన్నీ టీడీపీ ఇప్పుడు పరిశీలిస్తుంది. అందులో భాగంగానే తాజాగా రాజ్యసభలో టీడీపీ సభ్యుడు కనకమేడల రవీంద్రకుమార్ మండలి రద్దు పై ప్రశ్న సంధించారు. దీనిపై కేంద్రం కర్ర విరక్కుండా పాము చావకుండా ఉండేలా మంత్రి కిరణ్ రిజిజు లిఖిత పూర్వక సమాధానం ఇచ్చారు. ఈ అంశం కేంద్ర పరిశీలనలో ఉందంటూ ఆయన చెప్పడంతో మోడీ సర్కార్ ఇప్పట్లో మండలి రద్దు ను కోరుకోవడం లేదన్నది పరోక్షంగా చెప్పక చెప్పినట్లు అయ్యిందని విశ్లేషకులు భావిస్తున్నారు. దాంతో టీడీపీ ఆశ ఇక నిరాశగానే మిగిలే లాగే ఉంది.