ఇక్కడ వైసీపీయే కాదు.. టీడీపీ కూడా?
రాజమండ్రి వైసిపి లో పరిస్థితి అయోమయంగా ఉంది సరే. కానీ టిడిపి పరిస్థితి అదే రీతిలో నడుస్తుండటం విశేషం. వైసిపి లో ఎంపి భరత్ రామ్ ఒక [more]
;
రాజమండ్రి వైసిపి లో పరిస్థితి అయోమయంగా ఉంది సరే. కానీ టిడిపి పరిస్థితి అదే రీతిలో నడుస్తుండటం విశేషం. వైసిపి లో ఎంపి భరత్ రామ్ ఒక [more]
రాజమండ్రి వైసిపి లో పరిస్థితి అయోమయంగా ఉంది సరే. కానీ టిడిపి పరిస్థితి అదే రీతిలో నడుస్తుండటం విశేషం. వైసిపి లో ఎంపి భరత్ రామ్ ఒక గ్రూప్ అయితే రాజానగరం ఎమ్యెల్యే జక్కంపూడి రాజా ది మరో గ్రూప్ గా సాగుతున్న సంగతి తెలిసిందే. ఎవరి కార్యక్రమాలు వారివే. అదే రీతిలో తెలుగుదేశం లో ఆదిరెడ్డి – గోరంట్ల బుచ్చయ్య చౌదరి గ్రూప్ లు సాగుతున్నాయి. ఈ రెండు గ్రూప్ లు కలిసి పాల్గొనే కార్యక్రమాలు అరుదు. సీనియర్ నేతగా మాజీ మంత్రిగా రాజమండ్రి లో అర్బన్ లో గట్టి పట్టున్న గోరంట్ల అనివార్య పరిస్థితుల్లో రూరల్ కి మారినా నగరం పై పట్టు ఏ మాత్రం విడవలేదు.
లోకేష్ వచ్చినా …
ఇటీవల భావి టిడిపి అధినేతగా అంతా భావిస్తున్న నారా లోకేష్ శ్రీకాకుళం వెళుతూ మార్గమధ్యమం లో రాజమండ్రిలో కొద్ది సేపు హాజరయ్యారు. ఈ కార్యక్రమం పూర్తిగా ఆదిరెడ్డి అప్పారావు ఆయన తనయుడు ఆదిరెడ్డి వాసు నేతృత్వంలో సాగింది. దీనికి డుమ్మా కొట్టారు రూరల్ ఎమ్యెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి, మరో టిడిపి నేత గూడా మాజీ చైర్మన్ గన్ని కృష్ణ. అయితే ఆదిరెడ్డి వైపు వున్న క్యాడర్ అంతా లోకేష్ ను కలిసి కొద్దిసేపు ముచ్చటించారు. ఇదే ఇప్పుడు రాజమండ్రిలోనే కాదు ఎపి టిడిపి లోను హాట్ టాపిక్ గా మారింది.
ఆధిపత్యమే అసలు సమస్య…
వైసిపి, తెలుగుదేశం పార్టీలలో బలమైన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న వారు ఎక్కడా తమ ఆధిపత్యం వదులుకునేందుకు సిద్ధంగా లేరు. ఇదే ఇప్పుడు రెండుపార్టీల అధిష్టానాలకు తలనొప్పులు తెప్పిస్తుంది. వీరిని సముదాయించలేక ఒకరి నియోజకవర్గాల్లోకి మరొకరు వేలు పెట్టకుండా టిడిపి అధిష్టానం లక్ష్మణ రేఖలు గీసినా దీన్ని ఎవరు పాటించడం లేదు. ఏ మాత్రం అవకాశం చిక్కినా ఒకరిని మరొకరు ఇబ్బందులు పెట్టుకుంటూనే ఉంటున్నారు. అధికారపార్టీ లో కూడా ఇదే ధోరణి నడుస్తూ ఉండటంతో రాజమండ్రి రాజకీయాలు నిత్యం హాట్ గానే సాగుతున్నాయి.