ఉత్తమ్ …ఇలా చేస్తారని
ఉత్తమ్ కుమార్ రెడ్డిపై వత్తిడి పెరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడిగా వైదొలగాలంటూ సీనియర్ నేతలు సయితం పరోక్షంగా ఉత్తమ్ కు సంకేతాలు పంపుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో [more]
;
ఉత్తమ్ కుమార్ రెడ్డిపై వత్తిడి పెరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడిగా వైదొలగాలంటూ సీనియర్ నేతలు సయితం పరోక్షంగా ఉత్తమ్ కు సంకేతాలు పంపుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో [more]
ఉత్తమ్ కుమార్ రెడ్డిపై వత్తిడి పెరుగుతోంది. పీసీసీ అధ్యక్షుడిగా వైదొలగాలంటూ సీనియర్ నేతలు సయితం పరోక్షంగా ఉత్తమ్ కు సంకేతాలు పంపుతున్నారు. ఉత్తమ్ కుమార్ రెడ్డి సారథ్యంలో కాంగ్రెస్ పార్టీకి వరస ఓటములు చవిచూడాల్సి వచ్చింది. అయితే ఓటమికి నైతిక బాధ్యత వహిస్తూ ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయకపోవడం చర్చనీయాంశమైంది. తాజాగా రాహుల్ కాంగ్రెస్ పార్టీ దేశ వ్యాప్త ఓటమికి తానే బాధ్యుడినంటూ రాజీనామా చేసిన సంగతి తెలిసిందే.
వరస ఓటములు వచ్చినా…..
రాహుల్ రాజీనామాతో తాత్కాలికంగా కాంగ్రెస్ అధిష్టానం మోతీలాల్ ఓరాను నియమించింది. తెలంగాణలో సయితం అలాగే తాత్కాలిక అధ్యక్షుడిని నియమించాలన్న డిమాండ్ పార్టీలో ఊపందుకుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి నాలుగేళ్లుగా ప్రదేశ్ కాంగ్రెస్ అధ్యక్షుడిగా వ్వవహరిస్తున్నారు. ఆయన పీసీీసీ ప్రెసిడెంట్ అయ్యాక జరిగిన జీహెచ్ఎంసీతో పాటు ఉప ఎన్నికలు, సాధారణ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ దారుణ ఓటమిని చవిచూడాల్సి వచ్చింది.
కొందరు రాజీనామా చేసినా…..
ఇప్పటికే రాహుల్ గాంధీ రాజీనామాకు సంఘీభావంగా పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ లు రేవంత్ రెడ్డి, పొన్నం ప్రభాకర్ లు రాజీనామా చేశారు. సీనియర్ నేత వి.హనుమంతరావు కూడా తన పదవికి రాజీనామా చేశారు. కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి పీసీసీ అధ్యక్ష పదవికి రాజీనామా చేయకపోవడం చర్చనీయాంశమైంది. అలాగే పొరుగున ఉన్న ఆంధ్రప్రదేశ్ పార్టీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి కూడా పదవికి రాజీనామా చేశారు.
రాహుల్ కు సన్నిహితుడైనా…..?
నిజానికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గాంధీ కుటుంబానికి విధేయుడు. రాహుల్ గాంధీకి సన్నిహితుడు. వాస్తవానికి రాహుల్ ఏఐసీసీ అధ్యక్ష పదవిలో కొనసాగి ఉంటే రాష్ట్రాల పీసీసీల మార్పులో భాగంగా తెలంగాణలోనూ ఛేంజ్ జరిగేదన్న ప్రచారం ఎన్నికల ఫలితాల తర్వాత జరిగింది. ఇప్పుడు రాహుల్ రాజీనామా చేయడంతో కాంగ్రెస్ పార్టీ కూడా పీసీసీల జోలికి ఇప్పుడు వెళ్లే ప్రసక్తి ఉండదు. ఈ నేపథ్యంలో పదవీ వ్యామోహంతోనే ఉత్తమ్ కుమార్ రెడ్డి రాజీనామా చేయడం లేదన్న వ్యాఖ్యలు పార్టీ నుంచే విన్పిస్తున్నాయి. మరి ఉత్తమ్ సీనియర్ నేతల ఒత్తిడికి తలొగ్గుతారో? లేదో? చూడాల్సి ఉంది.