Tdp : అంతలా నమ్మితే.. ఇంతలా చేస్తారా?

నమ్మిన వారిని అక్కున చేర్చుకునేదే నాయకత్వం. అలాంటి నాయకులనే కిందిస్థాయి క్యాడర్ నమ్ముతుంది. తమకు ఈ నాయకత్వం చేతుల్లోనే రాజకీయ భవిష‌్యత్ ఉంటుందన్న భరోసా వారికి ఇవ్వాల్సి [more]

;

Update: 2021-10-15 14:30 GMT

నమ్మిన వారిని అక్కున చేర్చుకునేదే నాయకత్వం. అలాంటి నాయకులనే కిందిస్థాయి క్యాడర్ నమ్ముతుంది. తమకు ఈ నాయకత్వం చేతుల్లోనే రాజకీయ భవిష‌్యత్ ఉంటుందన్న భరోసా వారికి ఇవ్వాల్సి ఉంటుంది. కానీ తెలుగుదేశం పార్టీ ఆ భరోసా నేతలకు కన్పించడం లేదు. నమ్ముకున్న పార్టీ అధినాయకత్వమే నట్టేట ముంచితే ఎవరికి చెప్పుకోవాలన్న ఆవేదనతో పార్టీ నేతలు ఉన్నారు. తాడికొండ మాజీ ఎమ్మెల్యే శ్రావణ్ కుమార్ పరిస్థితి ఇదే.

రాజధాని ప్రాంతంలో….

తాడికొండ నియోజకవర్గం అమరావతి ప్రాంతంలో ఉంది. ఇక్కడ టీడీపీ బలంగా ఉండాలి. ఎందుకంటే రాజధానిగా అమరావతిని ప్రకటించడంతో ఇక్కడ భూములకు అధిక ధరలు వచ్చాయి. 2014లో తాడికొండలో టీడీపీయే విజయం సాధించింది. ఎమ్మెల్యేగా శ్రావణ్ కుమార్ ఎన్నికయ్యారు. రాజధాని ప్రకటించడంతో ఇక్కడ తమకు ఎదురులేదని టీడీపీ కూడా భావించింది. అధికారంలో ఉన్నప్పుడే శ్రావణ్ కుమార్ పై వ్యతిరేకత ఉన్నవారిని ప్రోత్సహించింది.

అగ్రవర్ణాల ఆధిపత్యమే….

పేరుకు తాడికొండ ఎస్సీ నియోజకవర్గమైనా ఇక్కడ అగ్రవర్ణాలదే రాజకీయ పెత్తనం. అందుకే శ్రావణ్ కుమార్ కు తెలుగుదేశం పార్టీలోని కీలకనేతలే సహకరించలేదు. 2019 ఎన్నికల్లో ఆయనకు టిక్కెట్ ఇవ్వవద్దంటూ గట్టిగానే ప్రయత్నం చేశారు. అయినా చంద్రబాబు రాజధాని ప్రాంతం కావడంతో చివరకు ఆయనకే టిక్కెట్ ఇచ్చారు. కానీ చంద్రబాబు ప్రకటించిన రాజధాని ప్రాంతంలోనే గత ఎన్నికలలో ఓటమి పాలు కావాల్సి వచ్చింది.

టీడీపీనే నమ్ముకున్నా….

పార్టీ ఓటమి పాలయినా శ్రావణ్ కుమార్ టీడీపీనే నమ్ముకుని ఉన్నారు. తనకు చంద్రబాబు అన్యాయం చేయరని గట్టిగా విశ్వసించారు. వివిధ పార్టీ కార్యక్రమాల్లో ఆయన ముందున్నారు. కానీ చివరకు ఆయనకు తెలియకుండానే పదవులను భర్తీ చేయడం శ్రావణ్ కుమార్ కు ఆగ్రహం తెప్పించింది. శ్రావణ్ కుమార్ ను నిర్లక్ష్యం చేయడంపై తాడికొండ దళిత వర్గాలు కూడా తప్పుపడుతున్నాయి. నిరసనగా టీడీపీకి స్థానిక నేతలు రాజీనామా కూడా చేశారు. శ్రావణ్ కుమార్ ఎఫెక్ట్ చుట్టుపక్కల నియోజకవర్గాలపై పడే అవకాశముంది. మొత్తం మీద నమ్ముకున్న వారిని నిర్లక్ష్యం చేస్తే పార్టీ ఎలా బలోపేతం అవుతుందని నేతలు ప్రశ్నిస్తున్నారు. దీనికి హైకమాండ్ వద్ద సమాధానం లేదు.

Tags:    

Similar News