జ‌గ‌న్ పై దాడి కాదు.. జ‌నం నాడి ప‌డితేనే ఫ్యూచ‌ర్?

త‌మ్ముళ్లకు సూచ‌న అంటూ.. కొన్ని విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. వీటిలో ప్రధానంగా.. ఆస‌క్తిగా ఉన్నది ఏంటంటే.. జ‌గ‌న్‌మీద క‌న్నా.. జ‌నం మీద దృష్టి పెట్టాల‌నే విష‌యం. ఎందుకంటే.. ప్రతిప‌క్షాలు [more]

Update: 2021-07-13 02:00 GMT

త‌మ్ముళ్లకు సూచ‌న అంటూ.. కొన్ని విశ్లేష‌ణ‌లు వ‌స్తున్నాయి. వీటిలో ప్రధానంగా.. ఆస‌క్తిగా ఉన్నది ఏంటంటే.. జ‌గ‌న్‌మీద క‌న్నా.. జ‌నం మీద దృష్టి పెట్టాల‌నే విష‌యం. ఎందుకంటే.. ప్రతిప‌క్షాలు ఎన్ని విమ‌ర్శలు చేసినా.. సీఎం జ‌గ‌న్ ఎక్కడా ప‌ట్టించుకోవ‌డం లేదు. ప్రజ‌ల‌కు తాను ఏం చేయాల‌ని అనుకున్నాడో.. అది చేస్తున్నాడు. ఎంత మొత్తం నిధులు ఇవ్వాల‌ని అనుకున్నాడో.. అంత మొత్తం ఇస్తున్నారు. దీంతో ప్రజ‌ల్లో ముఖ్యంగా పేద‌లు, దిగువ మ‌ధ్యత‌ర‌గ‌తి.. మ‌హిళ‌లు, చేతి వృత్తుల వారిలో జ‌గ‌న్‌పై సానుభూతి మ‌రింత పెరుగుతోంది. సో.. త‌ను పెట్టుకున్న వ‌చ్చే ఎన్నిక‌ల టార్గెట్ నెర‌వేర్చుకునేందుకు జ‌గ‌న్ ఇలా వ్యవ‌హ‌రిస్తున్నార‌ని ప‌రిశీల‌కులు పేర్కొంటున్నారు. జ‌గ‌న్ ఓటు బ్యాంకు రాజ‌కీయాల దెబ్బతో టీడీపీ అతలాకుత‌లం అయిపోతోంది.

అధినేత బాటలోనే….

ఈ కార‌ణంగానే జ‌గ‌న్‌.. ప్రతిప‌క్షాల నుంచి ఎన్ని విమ‌ర్శలు వ‌చ్చినా ప‌ట్టించుకోవ‌డం లేద‌ని పేర్కొంటున్నారు. ఇదే స‌మ‌యంలో వ‌చ్చే ఎన్నిక‌ల్లో అధికారంలోకి వ‌చ్చేస్తామ‌ని.. మాకు మంత్రి ప‌ద‌వులు ఖాయ‌మ‌ని అనుకుంటున్న టీడీపీ నేత‌ల‌కు మాత్రం.. ఈ త‌ర‌హా వ్యూహం క‌నిపించ‌డం లేదు. అంటే.. ఎంత‌సేపూ.. జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తున్నారు. నాయ‌కుడు ఏ రూట్లో వెళుతున్నాడో.. ఆ పార్టీ నాయ‌కులు అదే ఫాలో అవుతున్నారు. జ‌గ‌న్ రాష్ట్రానికి ఎలాంటి పెట్టుబ‌డులు తీసుకురావ‌డం లేదు. ఆయ‌న వ‌ల్ల రాష్ట్రం అభివృద్ధి చెంద‌డం లేదు. ప్రత్యేక హోదా లేదు.. ఆయ‌న చేత‌కాని సీఎం. ఇలా.. అనేక వ్యాఖ్యలు సంధిస్తున్నారు. సీఎం జ‌గ‌న్‌ను టార్గెట్ చేశామ‌ని.. ఆయ‌న ప్రజ‌ల్లో ఇమేజ్ కోల్పోతున్నార‌ని.. టీడీపీ నేత‌లు చెప్పుకొంటున్నారు.

ప్రజల్లో వ్యతిరేకత లేదు…

కానీ, వాస్తవంలోకి వ‌స్తే.. ప్రజ‌లు.. ఎవ‌రూ కూడా రాష్ట్ర అభివృద్ధి కేవ‌లం జ‌గ‌న్‌తోనే ఆగిపోయింద‌ని.. ఆయ‌న వ‌ల్లే పెట్టుబడులు రాకుండా పోయాయ‌ని అనుకునే ప‌రిస్థితి క‌నిపించ‌డం లేదు. గ‌తంలో ప్రత్యేక హోదా విష‌యంలో చంద్రబాబు అనుస‌రించిన తీరును ప్రజ‌లు ఇప్పటికీ మ‌రిచిపోలేదు. అదేస‌మ‌యంలో గ‌తంలో అమ‌లు చేసిన ప‌థ‌కాల్లో రెండు మూడు వేల‌కు మించి ఒకే సారి ప‌ది వేలు, 15 వేలు. 18 వేల చొప్పున ఖాతాల్లో ప‌డిన దాఖ‌లా కూడా లేదు. దీంతో ప్రజ‌ల‌కు జ‌గ‌న్‌పై వ్యతిరేక‌త లేక‌పోగా.. ఆయ‌న‌పై సానుభూతి పెరిగింద‌నేది వాస్తవం అంటున్నారు ప‌రిశీల‌కులు. ఈ క్రమంలో టీడీపీ నేత‌లు.. జ‌గ‌న్‌ను టార్గెట్ చేస్తూ..నే మ‌రోప‌క్క,, జ‌నం నాడిని ప‌ట్టుకునే ప్రయ‌త్నం చేయ‌క‌పోతే.. ఉప‌యోగం ఉండ‌ద‌ని అంటున్నారు. మ‌రి ఇప్పటికైనా.. వాస్తవం ఏంటో త‌మ్ముళ్లు తెలుసుకుంటారో లేదో చూడాలి.

Tags:    

Similar News