ఈ విషయంలో కక్కలేక..మింగలేక అన్నట్లుందిగా?

తెలుగుదేశం పార్టీ కక్కలేక మింగలేక చస్తుంది. ఇటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడలేని పరిస్థితి. అలాగని ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకోకుండా ఉండలేరు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ [more]

Update: 2021-02-17 06:30 GMT

తెలుగుదేశం పార్టీ కక్కలేక మింగలేక చస్తుంది. ఇటు కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాడలేని పరిస్థితి. అలాగని ప్రజా వ్యతిరేకతను క్యాష్ చేసుకోకుండా ఉండలేరు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ విషయంలో టీడీపీ ఇరుకున పడిందనే చెప్పాలి. అధికారంలో ఉనన వైసీపీ సంగతి పక్కన పెడితే, ఉత్తరాంధ్రలో బలహీనంగా ఉన్న టీడీపీని బలోపేతం చేసుకోవాలంటే విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ పై ఉద్యమించక తప్పదు. కానీ కేంద్రంలో అధికారంలో ఉన్న బీజేపీ నిర్ణయానికి వ్యతిరేకంగా వెళ్లలేరు.

అధికార పార్టీనే…..

ఇక టీడీపీ విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రయివేటీకరణ విషయంలోనూ తెలుగుదేశం పార్టీ అధికార పార్టీపైనే విమర్శలు చేస్తుంది. ప్రయివేటీకరణ చేస్తామన్న కేంద్ర ప్రభుత్వాన్ని వదిలేసి రాష్ట్ర ప్రభుత్వంపై పడటం చర్చనీయాంశంగా మారింది. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రయివేటీకరిస్తే దానిని రాష్ట్ర ప్రభుత్వమే కొనుగోలు చేయాలని తెలుగుదేశం పార్టీ కొత్త వాదనను తెరమీదకు తీసుకువచ్చింది. అంటే కేంద్రం ప్రయివేటీకరించడాన్ని మాత్రం టీడీపీ బహిరంగంగా వ్యతిరేకించడం లేదు.

ఛత్తీస్ ఘడ్ తరహాలో…..

ఇందుకు ఛత్తీస్ ఘడ్ ను టీడీపీ నేతలు ఉదాహరణగా చూపుతున్నారు. ఛత్తీస్ ఘడ్ లోనూ అక్కడ ప్రభుత్వం ఉక్కు కర్మాగారాన్ని ప్రయివేటు పరం చేయబోతే తాను తీసుకుని నిర్వహిస్తుంది. అసలే ఆర్థికంగా రాష్ట్ర ప్రభుత్వం ఇబ్బందుల్లో ఉంది. కడపలోనూ స్టీల్ ఫ్యాక్టరీని ప్రభుత్వమే నిర్మించాలని నిర్ణయించింది. 2014కు ముందు స్వయంగా అప్పటి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబు శంకుస్థాపన చేశారు. ఇక విశాఖస్టీల్ ఫ్యాకర్టీ నిర్వహణ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటే భరించగలదా? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

అందరూ కలసి….

ఇప్పుడు అన్ని పార్టీలూ కలసి విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని ప్రయివేటు పరం చేయకుండా కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి చేయాల్సి ఉంది. ఈ పనులను పక్కన పెట్టి ఏపీ ప్రభుత్వాన్ని కొనుగోలు చేయాలని చెప్పడం జగన్ ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టడమే. చంద్రబాబు ప్రతి అంశాన్ని రాజకీయం చేయాలని చూస్తున్నారని వైసీపీ ఆరోపిస్తుంది. తాను అధికారంలో ఉండగా తీసుకోని నిర్ణయాలను విపక్ష నేతగా డిమాండ్లు పెట్టడం విడ్డూరంగా ఉందని అంటున్నారు. ఇప్పటికైనా అన్ని పార్టీలూ కలసి పోరాడితేనే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రయివేటీకరణ జరగకుండా అడ్డుకునే వీలుంటుంది.

Tags:    

Similar News