గాలి వదిలేశారా..?

గాలి జనార్దన్ రెడ్డి ఎక్కడ ఉన్నారు? .. ఏం చేస్తున్నారు? తన కూతురు వివాహం తరువాత తెర మరుగు అయిన గాలి.. అసలు వ్యాపారాలు చేస్తున్నారా…?రాజకీయాలు చేస్తున్నారా?…కర్ణాటక [more]

;

Update: 2019-07-23 11:00 GMT

గాలి జనార్దన్ రెడ్డి ఎక్కడ ఉన్నారు? .. ఏం చేస్తున్నారు? తన కూతురు వివాహం తరువాత తెర మరుగు అయిన గాలి.. అసలు వ్యాపారాలు చేస్తున్నారా…?రాజకీయాలు చేస్తున్నారా?…కర్ణాటక లో రాజకీయ దూమారం చెలరెగుతుంటే గాలి మాత్రం ఎందుకు పట్టించుకోవడం లేదు. అసలు గాలి ఎక్కడ అని అందరు వెతుకున్న సమయంలో ఒక్కసారిగా హైదరబాద్ లో ప్రత్యక్షమయ్యారు. అది కూడా ఆస్తుల కోసం ఆధికారులను సంప్రదించేందుకే.

కర్ణాటక రాజకీయం…..

కర్ణాటక రాజకీయం సంక్షోభంలో పడింది. కొద్దోగొప్పో ఇప్పుడు భారతీయ జనతా పార్టీకే అనుకూలంగా పరిస్థితి ఉంది. యడ్యూరప్ప ముఖ్యమంత్రి అయ్యే అవకాశాలు స్పష్టంగా కన్పిస్తున్నాయి. అయినా గాలి జనార్థన్ రెడ్డి మాత్రం కర్ణాటక రాజకీయాల గురించి పట్టించుకోవడం లేదు. గత ఎన్నికల్లో తనను పక్కన పెట్టినందుకు కాషాయ పార్టీపై కస్సుబుస్సుమంటున్నారా? లేక అంతా సజావుగా ముగిసిన తర్వాత ఎంటర్ అవ్వాలని భావిస్తున్నారా? అన్నది చర్చనీయాంశంగా మారింది.

ఆస్తుల కోసం…..

కర్ణాటక రాజకీయాలు హాట్ హాట్ గా సాగుతున్న సమయంలోనే గాలి జనార్థన్ రెడ్డి హైదరాబాద్ లో ప్రత్యక్షమయ్యారు. ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ ఎదుట హాజరయ్యారు. గాలి జనార్థన్ రెడ్డి ఆస్తులన్నీ ఎన్ ఫోర్స్ మెంట్ డెరెక్టరేట్ అటాచ్ చేసేసింది. తన ఆస్తుల కోసం గాలి జనార్థన్ రెడ్డి అధికారుల చుట్టూ తిరుగుతున్నారు. మైనింగ్ కింగ్ గా పేరొందిన గాలి జనార్థన్ రెడ్డి ఎక్కడకు వెళ్లినా అధికారులు రెడ్ కార్పెట్ పర్చే వారు. కానీ ఇప్పుడు అది గతం. అధికారులు ఎవరూ ఇప్పుడు గాలిని పట్టించుకోవడం లేదు. హైదరాబాద్ ఈడీ ఆఫీస్ కు గాలి వచ్చినా సాదాసీదానే వచ్చారు.

కోర్టు అనుకూలంగా…..

అక్రమ మైనింగ్ చేస్తున్నారని గాలి జనార్థన్ రెడ్డిపై 2007లో సీబీఐ కేసు నమోదు చేసింది. గాలి జనార్థన్ రెడ్డిని అరెస్ట్ చేసి జైల్లోనూ పెట్టింది. సీబీఐ దాఖలు చేసిన ఛార్జిషీటు ప్రకారం గాలి జనార్థన్ రెడ్డి ఆస్తులను ఈడీ జప్తు చేసింది. వాటి విలువ వెయ్యి కోట్ల పైమాటే. దీనిపై అప్పిలేట్ అధారిటీలో గాలి జనార్థన్ రెడ్డి అప్పీల్ చేశారు. ఆస్తుల కోసం కోర్టును కూడా ఆశ్రయించారు. కోర్టు తీర్పులన్నీ గాలికి అనుకూలంగా వచ్చినా ఈడీ అధికారులు మాత్రం ఆస్తుల అప్పగింత విషయాన్ని పట్టించుకోవడం లేదు. అందువల్లే జప్తు చేసిన ఆస్తులను తనకు తిరిగి అప్పగించాలని గాలి జనార్థన్ రెడ్డి అధికారుల వద్దకు వచ్చారు. ఆయనకు రాజకీయాలకంటే ప్రస్తుతం అటాచ్ అయిన తన ఆస్తులను తిరిగి పొందడమే ప్రధమ ప్రాధాన్యం.

Tags:    

Similar News